Bigg Boss 8 Telugu: ఆ టాస్కులేంటీ.. ఆ సౌండ్స్ ఎంటీ.. కొత్త టాస్క్ తో తికమక పడుతున్న బిగ్ బాస్..!

Bigg Boss 8 Telugu Latest Promo: బుల్లి తెర ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఈ సీజన్ కు గతంలో ఏ సీజన్ కు లేని భారీ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సీజన్‌ మాత్రం అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో నడుపుతున్నారు. అందుకు తగ్గట్లుగా ఎవరూ ఊహించని కంటెంట్‌ను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు బిగ్ బాస్ లకు దిమ్మతిరిగేలా చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. నిన్నటి ఎపిసోడ్ ( శనివారం) మాత్రం వేరే లెవెల్.. బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోయే ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ వస్తున్న బిగ్ బాస్ తాజా తాజాగా 21వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో మూడోవారం ఆఖ‌రికి వ‌చ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ లో విష్ణుప్రియ, నాగ మణికంఠ, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, సీత, అభయ్, నైనిక ఉన్నారు. అయితే.. అందులో ఎవరూ ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెల‌కొంది. నిన్నటి ఎపిసోడ్లో కింగ్ నాగార్జున హోస్టింగ్ అదుర్స్. ఎన్నాడు చూడని విధంగా చాలా సీరియస్ అయ్యారు.బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసిన అభయ్ నవీన్ కు రెడ్ కార్డుతో చూపించి సీరియస్ అయ్యాడు. రెడ్ కార్డ్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళి పోవాల్సిందిగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అలాగే.. ఇతర కంటెస్టెంట్లపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. నిన్నటి ఎపిసోడ్ చాలా హాట్ హాట్ గా ఉన్నా నేటీ ఎపిసోడ్ మాత్రం సండే.. ఫన్డే గా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించింది.

Bigg Boss Telugu 8 Day 21 Promo 2 out Guess the Sound Task promo viral

ఈ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన తొలి ప్రొమోలో.. 'సండే ఫ‌న్ డే' అంటూ.. 'సెట్ అండ్ కట్' అనే చాలెంజ్ ఇచ్చారు. సెట్ అయిన వాళ్ల‌కు రెడ్ హార్ట్ ను గిప్టుగా ఇవ్వాల‌ని, సెట్ కాని వాళ్లకు హార్ట్‌ను బ్రేక్ చేయాల‌ని చెప్పాడు. ఈ ప్రొమోలో మరో సరికొత్త టాస్క్ తో కంటెస్టెంట్స్ ను తికమక పెట్టే ప్రయత్నం చేశారు. 'గెస్ ది టాస్క్' అనే బైండ్ పోల్డ్ టాస్క్ పెట్టారు. ఒక కంటెస్టెంట్ కు కళ్ళకి గంతలు కట్టుకుంటే.. మరొకరు కంటెస్టెంట్ .. టీవీ స్కీన్ పై కనిపిస్తున్న వస్తువు ఎంటో సౌండ్ ద్వారా చెప్పాలి. కళ్లకు గంతలు కట్టుకున్న వాళ్ళు.. ఆ సౌండ్ ను అర్థం చేసుకుని అక్కడ ఏ డిస్లే అయిందో చెప్పాలి. సరైన సమాధానం చెబితే వారే విన్నర్ అంటూ నాగార్జున చెబుతారు.

తొలుత నిఖిల్ బ్లైండ్ ఫోల్డ్ చేసుకోగా..అతని ఫేర్ గా సోనియా వచ్చింది. ఆమెకు కెమెరా చూపించారు. దీంతో ఆమె ఎలా చెప్పాలో తెలియక చాలా కంగారు పడింది. ఎంతో వింత శబ్దం చేసి.. నిఖిల్ ను కనిప్యూజ్ చేసింది. సరైన సమాధానం చెప్పలేక ఫెల్యూర్ అయ్యారు నిఖిల్.. ఆ తర్వాత ప్రెజర్ కుక్కర్ ఫోటో టీవీలో డిస్లే అయింది. ఈ సారి ఆదిత్య ఓం బ్లైండ్ ఫోల్డ్ చేసుకోగా.. అభయ్ స్.. స్.. అంటూ సౌండ్ చేశాడు. ఆ సౌండ్ అర్ధం చేసుకున్న ఆదిత్య ప్రెజర్ కుక్కర్ అంటూ చెప్పేశాడు.

ఆ తర్వాత నైనిక బ్లైండ్ ఫోల్డ్ చేసుకోగా.. మిక్సర్ గ్రైండర్ డిస్లే అయింది. నిఖిల్ మిక్సర్ గ్రైండర్ సౌండ్ ను అనుకరించడానికి నానా తంటాలు పడ్డారు. కానీ, నైనిక చెప్పలేకపోయింది. ఆ తరువాత ప్రేరణ,య శ్మీ వచ్చారు. యష్మీ బైండ్ పోల్డ్ చేసుకోగా.. అక్కడ డోర్ విజువల్ గా చూపించారు. డోర్ సౌండ్ చేయడానికి ప్రేరణ నానా తంటాలు పడింది. కన్ను చూసుకుని ఉన్న యష్మీకి సౌండ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేయకుండా.. యాక్షన్ ద్వారా చూపించింది. ఈ సమయంలో ఆమె ప్రవర్తన అందర్ని నవ్వు తెప్పించింది. ఇలా పుల్ ఫన్ గా నడించింది.

అభయ్ ఎలిమినేట్ ..

ఇదిలా ఉండగా ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారిలో అభయ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కవగా ఉన్నట్టు సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. బజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా అభయ్ తన నోటి దూల వల్ల ఎలిమినేటర్ చేసి ఉంటారని అందరూ భావిస్తున్నారు. అంతే కాకుండా.. అభయ్ దాదాపు వారానికి రూ.3లక్షలు చొప్పున అంటే.. మూడు వారాలకు గానూ రూ .9 లక్షలు ఇచ్చే అవకాశాలు తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X