Bigg Boss Telugu 8: ‘మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్’ నామినేషన్ల పర్వంలో సోనియా, నబిల్ మధ్య వార్...

Bigg Boss 8 Telugu Latest Promo: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్.గతంలో ఏ సీజన్ కు లేని భారీ రెస్పాన్స్‌ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు వస్తోంది. ఈ సీజన్‌ మాత్రం అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో నడుపుతున్నారు. అందుకు తగ్గట్లుగా ఎవరూ ఊహించని కంటెంట్‌ను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు బిగ్ బాస్ లకు దిమ్మతిరిగేలా చేస్తున్నారు. ఇక ఈ షో మూడు వారాలు విజయవంతంగా కంప్లిట్ చేసుకొని నాలుగు వారంలోకి అడుగుపెట్టింది. నాలుగోవారం తొలిరోజు కావడంతో హౌస్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.
భారీ స్థాయిలో రెస్పాన్స్‌ వస్తున్న బిగ్ బాస్ తెలుగు 8 డే 22 ప్రోమో 2 నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

విజయవంతంగా ముగ్గురు కంటెస్టెంట్లను బయటకు పంపించి నాల్గవ వారానికి లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్. నాలుగో వారం తొలిరోజు కావడంతో నామినేషన్స్ తో కంటెస్టెంట్స్ హీట్ పుట్టింది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంటూ సోనియా.. నబీల్ ను రెచ్చగొడుతూ చేసిన కామెంట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తొలుత సోనియాకు అవకాశమొచ్చింది. దీంతో ఆదిత్య ఓం ను టార్గెట్ చేసింది. ' మీ గురించి చెప్పడానికి ఎక్కువ పాయింట్స్ లేవు.. ఎందుకంటే మీరు హౌస్ లో ఎటువంటి పర్ఫామెన్స్ ఇవ్వట్లేదు' అన్నది. అంతతో ఆగకుండా.. ఈ వీక్ లో వెళ్తానని మీరే డిసైడ్ అయ్యారు కదా.. సో వెళ్లిపోండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Bigg Boss Telugu 8 Day 22 Promo 2 Nominations Heat Up bigg boss promo viral

తర్వాత నైనిక అండ్ ప్రేరణకు గొడవ జరుగుతుంది. ఈ గొడవ కాస్త తారాస్థాయికి చేరుకుంటుంది. నువ్వు నాకు కనిపించలేదని ప్రేరణను నైనిక అంటుంది. దీనికి నైనిక నీకు ఊరికే గొడవలు కావాలి కదా? అని అంటుంది. నీ గేమ్ నాకు కనిపించడం లేదు అని నైనికపై ప్రేరణ కామెంట్ చేస్తుంది. నైనిక మీ చీఫ్ కే పోటీ ఇచ్చానని, నీకు కనిపించలేదా అంటూ మండిపడుతుంది. ఇక పృథ్వీ గతంలో గొడవలు దృష్టిలో పెట్టుకుని మణికంఠ ను నామినేట్ చేశారు. ముందు ముందు మీతో గొడవ పడాల్సి వస్తుందని భయంగా ఉందని అంటాడు.. దీనికి సోనియా వేరేలా చూస్తుంది. ఈ లుక్ అందర్ని ఆకట్టుకుంటుంది.

తర్వాత విష్ణు ప్రియ, ప్రేరణ మధ్య చిన్నగా గొడవ జరుగుతుంది. కారణం చెప్పకుండానే నామినేట్ చేస్తుందని ప్రేరణ అరుస్తుంది. దీనికి విష్ణుప్రియ నువ్వు స్టాండ్ తీసుకోలేకపోయావంటూ నామినేట్ చేస్తుంది. ఇక నబీల్ ను సోనియా మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని రెచ్చగొడుతుంది. దీంతో నబిల్ కు చాలా కోపం వస్తుంది.నబీల్ మాట్లాడుతూ.. నబీల్ అని పిలవండి మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని పిలవకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు.

దీంతో రెచ్చిపోయిన సోనియా ' నేను ఇలాగే పిలుస్తాను నువ్వు ఫెయిల్డ్ సంచాలక్' అంటూ మళ్ళీ రెచ్చగొట్టింది. 'ఎంత ఇస్తానో అంత తీసుకునే అంత దమ్ము కూడా ఉంది' అంటూ సోనియా ధీమా వ్యక్తం చేసింది. ఆ తరువాత నబిల్ ను నామినేషన్స్ లో నిల్చోవాలని అడిగింది సోనియా. దీంతో ' ఏం పరవాలేదు ' అంటూ కూర్చిలోనే కూర్చొన్నాడు నబీల్. ఐ థింక్ నువ్వు ఫెయిల్ పర్సన్ కూడా అని సోనియా అనడంతో నబీల్ కోపంతో రెచ్చిపోయాడు. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం వైరల్ గా మారుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X