Bigg Boss Telugu 8: దెబ్బ అదుర్స్ ! బిగ్ బాస్ హౌస్ లో భూకంపం.. ఏకంగా 12 మంది వైల్డ్ కార్డు ఏంట్రీ!

Bigg Boss 8 Telugu Latest Promo: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఏ సీజన్ కు లేని భారీ రెస్పాన్స్‌ తో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దూసుకుపోతోంది. ఈ సీజన్‌ అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో ఎవరూ ఊహించని కంటెంట్‌ను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తూ కంటెస్టెంట్లకే కాదు బీబీ లవర్స్ కూడా దిమ్మతిరిగేలా చేస్తున్నారు.

ఇక ఈ రియాల్టి షో ఇప్పటి వరకూ మూడు వారాలు విజయవంతంగా కంప్లిట్ చేసుకొని నాలుగు వారంలోకి అడుగుపెట్టింది. నాలుగోవారంలో నామినేషన్ల పర్వంతో హీటెక్కిన హౌస్ ను మరింత హీటెక్కించడానికి బిగ్ బాస్ చరిత్ర ఎన్నాడు చేయని సంచలన ప్రకటన చేశారు. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ వస్తున్న బిగ్ బాస్ తెలుగు 8 డే 24 ప్రోమో 2 నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

Bigg Boss Telugu 8 Day 24 Promo 2 Wildest Twist Ever bigg boss lastest promo viral

వాస్తవానికి ప్రోమో ప్రారంభంలో చాలా కామ్ గా సాగిపోయింది. కాంతారా క్లాన్ కి సీత చీఫ్ గా ఎన్నికవ్వగా, శక్తి క్లాన్ కి మరోసారి నిఖిల్ చీఫ్ గా ఎన్నికయ్యారు. ఇక కొత్త చీఫ్ ఎన్నికైన తర్వాత కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. తమకు నచ్చిన క్లాన్ లోకి వెళ్లే అవకాశాన్ని ఇస్తూ గొడవలు క్రియేట్ చేశారు. కంటెస్టెంట్ల మధ్య చర్చ జరుగుతోంది. కొంతమంది సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో బిగ్ బాస్ వాయిస్ వచ్చింది. దీంతో కంటెస్టెంట్లంతా వచ్చి హాల్లోకి వచ్చి కూర్చొన్నారు. బిగ్ బాస్ హౌస్ లో భూకంపం రాబోతోంది అంటూ కంటెస్టెంట్ల అందర్నీ షాక్ చేశారు. మీ మనుగడను సవాల్ చేసే సమయం మెచ్చిందని భయపెడ్డాడు బిగ్ బాస్..

'బిగ్ బాస్ ఇంట్లో భూకంపం.. మీ మనుగడను సవాల్ చేస్తూ.. మిమ్మలి బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లవచ్చు. బిగ్ బాస్ చరిత్రలో ఒక్కటి కాదు.. రెండు కాదు.. 12 వైల్డ్ కార్డు ఎంట్రీలు. మరో రెండు వారాల్లో ఈ వైల్డ్ కార్డుల ద్వారా 12 మంది కంటెస్టెంట్లు రాబోతున్నారు' అంటూ కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే ట్వీస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే.. బిగ్ బాస్ చరిత్రలో మొదటి సారి ఆ వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా వచ్చే కంటెస్టెంట్లను అడ్డుకునే పవర్ బిగ్ బాస్ మీకు ఇవ్వబోతున్నారంటూ.. ఇందు కోసం మీరందరూ సర్వేవల్ ఆఫ్ ఫిట్ నెస్ టెస్ట్ గెలవాలి' అంటూ వసూల్ విసిరాడు.

'ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా మీరు ఓ వైల్డ్ కార్డు ఎంట్రీలను అడ్డుకోగలరు' అంటూ సంచలన ప్రకటన చేశారు బిగ్ బాస్. అంటే.. రానున్న 12 రోజుల్లో 12 టాస్కులు పెట్టబోతున్నారంటూ.. ఒక్కవేళ టాస్క్ ఓడిపోతే.. ఒక వైల్డ్ కార్డు ఏంట్రీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రోమో మాత్రం చాలా క్రేజీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి రాబోయే కంటెస్టెంట్లలో నలుగురు కన్ఫార్మ్ అయిపోయారని తెలుస్తోంది. అందులో హరితేజ, ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి, నయని పావని ఫ్లేస్ ఫిక్స్ అయినట్టు టాక్. వీరంతా గతంలో బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి సందడి చేసినవాళ్లే.. వీళ్లు కాకుండా మరో ఇద్దరు కొత్త కంటెస్టెంట్లు కూడా హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X