Bigg Boss Telugu 8 : బిగ్‌బాస్‌కి నువ్వు అన్‌ఫిట్.. మణికంఠకి ఇచ్చిపడేసిన పృథ్వీ, ఎవడు ఫేకో చూద్దామన్న అభయ్
బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో మొదలైన రెండ్రోజులకే అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ లేడని చెప్పి ఆ ప్లేస్‌లో చీఫ్‌లను తెచ్చిన నిర్వాహకులు కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి వారం నామినేషన్స్‌లో ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో తెలుసుకోవాలని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్టార్ మా కూడా ఎప్పటికప్పుడు ప్రోమోల ద్వారా ఈ ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతోంది. తాజాగా వదిలిన బిగ్‌బాస్ డే 3 సెకండ్ ప్రోమోలో నామినేషన్స్ జరిగిన తీరుపై హింట్ ఇచ్చారు. మరి ఆ ప్రోమోలో ఏం చూపించారో పరిశీలిస్తే .
మంగళవారం నాడు నామినేషన్స్ ప్రారంభించిన బిగ్‌బాస్.. చీఫ్‌లుగా ఎంపికైన నిఖిల్, నైనిక, యాష్మీలు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని చెప్పారు. వారికి మూడు హారాలు, మూడు సీట్లు ఇచ్చి అందులో కూర్చోమని ఆదేశించాడు. కంటెస్టెంట్స్ నామినేట్ చేసిన వారిని కన్ఫర్మ్ చేసిన పవర్ వారి చేతికే అప్పగించాడు. బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో ఫస్ట్ నామినేషన్ చేసే అవకాశం సోనియా ఆకులకు దక్కింది. ఈమే బేబక్క, ప్రేరణను నామినేట్ చేయగా.. ఆ తర్వాత వరుసగా నాగ మణికంఠ, బేబక్కలను నబీల్.. నాగ మణికంఠ, బేబక్కలను శేఖర్ భాషా.. పృథ్వీరాజ్, నబీల్‌లను బేబక్క నామినేట్ చేశారు.

మంగళవారం నాటికి బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్‌లు నామినేషన్స్‌లో ఉండగా.. ఈ వారం మొత్తంగా ఎంతమంది నామినేట్ అవుతారోనని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. బుధవారం వదిలిన ప్రోమోలో మణికంఠ హైలైట్‌గా నిలిచాడు. అందరూ తననే టార్గెట్ చేస్తుండటంతో అతను సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశాడు. తన తల్లి మరణించాక ఆమె అంత్యక్రియల కోసం చేతిలో డబ్బు లేక అడుక్కున్నానని మణికంఠ చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా కన్నీటి పర్యంతమయ్యారు.
తాజాగా వదిలిన మరో ప్రోమోలో నామినేషన్స్ ఏ స్థాయిలో జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏంటీలో ఎవరు , ఏం చేస్తున్నారో తాను చూస్తానని.. మాట్లాడతానని అభయ్ తేల్చి చెప్పాడు. అయితే తనను నామినేట్ చేసినందుకు బేబక్కను పృథ్వీ కూడా నామినేట్ చేయడంతో ఆమె ఆర్గ్యుమెంట్‌కి దిగినట్లుగా తెలుస్తోంది. తన క్యారెక్టర్ ఇదే, ఇవాళ నేను బిగ్‌బాస్ అనే షోలోకి వచ్చానంటూ కౌంటర్ ఇచ్చింది. వచ్చినప్పటి నుంచి సైలెంట్‌గా ఉంటున్న ఆదిత్య ఓం కూడా నామినేషన్ సమయంలో మాట్లాడాడు.
లాజిక్‌తో మాట్లాడాలి, కరెక్ట్‌గా ప్రూవ్స్‌తో ఉండాలని బేబక్కను ఉద్దేశించి అన్నాడు. ఇంతలో ప్రేరణ రంగప్రవేశం చేసి కిర్రాక్ సీతను నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరో హర్ట్ అవ్వకపోతే నాకేం సంబంధం అనగా, నేను హర్ట్ అయ్యానంటూ విష్ణుప్రియ లేస్తుంది. ఎవడు ఫేకో, ఎవడు మంచిగా ఉన్నాడో, ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎవడు ఒరిజినల్ అన్నది ఆడియన్స్ డిసైడ్ చేస్తారని అభయ్ చాలా క్లారిటీతో చెబుతాడు. నువ్వు సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నావంటూ మణికంఠపై పృథ్వీ ఫైర్ అయ్యాడు. నువ్వు ఈ హౌస్‌కి అన్‌ఫిట్, నువ్వే నెగిటివ్ పర్సన్ అని పృథ్వీ కామెంట్ చేస్తుండగా ప్రోమో ఎండ్ అవుతుంది. మరి దీనికి మణికంఠ రియాక్షన్ ఏంటో తెలియాలంటే కొద్దిగంటల వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











