Bigg Boss Telugu 8 : గుడ్డు పెట్టిన పెంట.. సెంటిమెంట్ అస్త్రం తీసిన మణికంఠ , అమ్మ కోసం అడుక్కున్నానంటూ
బిగ్‌బాస్ తెలుగు 8లో నామినేషన్ల పంచాయతీ షురూ అయ్యింది. ఆడియన్స్ ఏ రోజు మిస్సయినా సరే నామినేషన్స్ ఉన్నరోజు మాత్రం టీవీలకు అతుక్కుపోతుంటారు. ఆరోజు దొరికినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పుడూ దొరకదనేది వాళ్ల ఫీలింగ్ మరి. అరుపులు, కేకలు, వాగ్వాదంతో బిగ్‌బాస్ హౌస్ దద్ధరిల్లిపోతుంది. సోమవారం చీఫ్‌ల ఎంపికతో ఎపిసోడ్ ముగించిన బిగ్‌బాస్ మంగళవారం నామినేషన్ల జాతర మొదలెట్టాడు. బేబక్క, మణికంఠ, పృథ్వీ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఇంకా చాలామంది నామినేట్ చేయాల్సి ఉండటంతో బుధవారం హౌస్ మోతెక్కిపోనుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
నిఖిల్, నైనిక, యాష్మీలు చీఫ్‌లు కావడంతో వారు నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లుగా బిగ్‌బాస్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అలాగే ఎవరిని నామినేట్ చేయాలో, ఎవరిని సేవ్ చేయాలో తేల్చే పవర్‌ను కూడా వారికే కట్టబెట్టాడు. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బేబక్క, ప్రేరణలను సోనియా ఆకుల.. మణికంఠ, బేబక్కలను నబీల్.. మణికంఠ, బేబక్కలను ఆర్జే శేఖర్ భాషా.. పృథ్వీరాజ్, నబీల్‌లను బేబక్క నామినేట్ చేశారు. అయితే నామినేషన్స్ సమయంలో ప్రేరణ, సోనియాలు గొంతు చించుకుంటూ గొడవ పడ్డారు. అలాగే పృథ్వీకి మద్ధతుగా కిర్రాక్ సీత మాట్లాడింది.

బిగ్‌బాస్ తెలుగు 8 మొదలైన నాటి నుంచి ఎవ్వరితోనూ మింగిల్ అవ్వకుండా ఒంటరిగా రూమ్‌లో కూర్చోవడమే, లేదంటే విడిగా ఉండటమో చేస్తున్నాడు నాగ మణికంఠ. అందుకే సోనియా, నబీల్, శేఖర్ భాషాలు ఇదే రీజన్ చెప్పి నామినేట్ చేశారు. దీనిని ఒప్పుకోని మణికంఠ తాను ఎందుకిలా ఉంటున్నాడో చెబుతూ క్లారిటీ ఇస్తున్నాడు. జీవితంలో ఎన్నో సమస్యల మధ్య బిగ్‌బాస్‌లో ఛాన్స్ వచ్చిందని , ఓ 14 మంది కొత్త మైండ్ సెట్‌లతో ట్రావెల్ చేయడం ఈజీ కాదని.. దానికి టైం పడుతుందని మణికంఠ చెప్పాడు.
బిగ్‌బాస్ హౌస్‌లో డే 3 నామినేషన్స్‌లో ఏం జరిగిందో హిట్స్ ఇస్తూ స్టార్ మా ప్రోమోను రిలీజ్ చేసింది. కిరాక్ సీత బేబక్కను నామినేట్ చేయగా.. వీరిద్దరి మధ్య మళ్లీ కిచెన్‌లో హెల్ప్, వంట , రేషన్ వంటి విషయాలపై పెద్ద గొడవ జరిగింది. నేను ఎగ్ బుర్జి చేసుకుంటానంటే మీరు ఎందుకు నో చెప్పారంటూ సీత ప్రశ్నించింది. ఇక వచ్చినప్పటి నుంచి కొందరు హౌస్‌మెట్స్ నాగ మణికంఠను టార్గెట్ చేస్తుండటంతో అతను మరోసారి ఎమోషనల్ డ్రామా ప్లే చేసినట్లుగా కనిపిస్తోంది. తన బాల్యం, తల్లిదండ్రుల మరణం, స్టెప్ ఫాదర్ వేధింపులు చెబుతూ కంటతడి పెట్టించాడు.
మణికంఠ , అభయ్ నవీన్ మధ్య గొడవ సందర్భంగా తాను అన్‌ఫిట్ అనుకుంటే ఈ వీకే హౌస్ నుంచి వెళ్లిపోతానంటూ ఇంటి సభ్యులకు ఛాలెంజ్ విసురుతాడు. విష్ణుప్రియ , శేఖర్ భాషాలు కూడా మరోవైపు నుంచి టార్గెట్ చేస్తుండటంతో మణికంఠ సహనం కోల్పోయి ఎమోషనల్‌గా బరస్ట్ అయ్యాడు. చావు అంచుల దాకా వెళ్లొచ్చానని.. మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోతే అంత్యక్రియలకు, చితి పేర్చడానికి కట్టెల కోసం అడుకున్నా అంటూ మణికంఠ కంటతడి పెట్టాడు. అతని మాటలకు కంటెస్టెంట్స్ అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా చీఫ్ స్థానంలో ఉన్న యాష్మీ గౌడ వెక్కి వెక్కి ఏడుస్తూ నోటికి చేయి అడ్డు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 8 ఎపిసోడ్ ఎలా ఉండబోతుందోనని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











