Bigg Boss Telugu 8 : శాడిస్ట్ గా మారిన బిగ్ బాస్.. కంటెస్టెన్స్ కు అలాంటి నరకంతో ఆటలు!

Bigg Boss 8 Telugu Latest Promo: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. గతంలో ఏ సీజన్ కు రానీ, లేని భారీ స్పందన తో బిగ్ బాస్ సీజన్ 8 దూసుకపోతోంది. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ పేరుతో ప్రారంభమైన బిగ్ బాస్ అన్ లిమిటెడ్ కాన్సెప్టుతో ఎవరూ ఊహించని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు ఇస్తుండటంతో హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ 8 దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ నాలుగు వారాలు విజయవంతంగా కంప్లిట్ చేసుకొని ఐదోవారానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. తాజా ప్రోమో మాత్రం ఓరేంజ్ లో ఉంది.

ప్రోమో ప్రారంభం కాగానే.. 'బిగ్ బాస్ ఇప్పుడు మీకు మార్నింగ్ మస్తీ ఇవ్వబోతున్నాడు' అంటూ వాయిస్ వస్తుంది. 'కలర్ కలర్ విచ్ కలర్ డు యు వాంట్' అనే టాస్క్ కంటెస్టెంట్లకు పెట్టాడు బిగ్ బాస్. చూడడానికి.. కంటెస్టెంట్లు ఆడేటప్పడూ చాలా ఫన్నీగా ఉన్నా.. పనిష్‌మెంట్లతో కంటెంట్లకు చుక్కలే చూపించాడు బిగ్ బాస్. ఈ టా అసలు విషయం తెలియని నబిల్ సూపర్ బిగ్ బాస్ సూపర్ బిగ్ బాస్ అంటూ చాలా ఎక్సైటింగ్ గా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఫీల్ గుడ్ మ్యూజిక్ ప్లే అయ్యింది. కంటెస్టెంట్లు కూడా చిరునవ్వుతో ఒకే బిగ్ బాస్ ఓకే బిగ్ బాస్ అంటూ క్లాప్స్ కొట్టారు.

Bigg Boss Telugu 8 Day 31 Promo 1 out Colour Colour Which Colour Task promo viral

టాస్క్ ఆడే విధానాన్ని బిగ్ బాస్ చెబుతూ.. నేనొక కలర్ చెప్తాను ఆ కలర్ ఉన్న వస్తువును మీ అపోనెంట్ పర్సన్ కంటే ముందుగా తీసుకొచ్చి అక్కడ ఉన్న బాక్స్ లో పెట్టాలంటూ టాస్క్ కండిషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు బిగ్ బాస్. చాలా ఎక్సైటింగ్ తో మణికంఠ, ఆదిత్య ఓం ముందుగా వచ్చి టాస్క్ ప్రారంభించారు.
కలర్ కలర్ విచ్ కలర్ డు యు వాంట్ అంటూ నాగమణికంఠ బిగ్ బాస్ ను అడగగా బ్లాక్ అంటూ సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో మణికంఠ తన మైకును బాక్స్ లో వేయగా ఆదిత్యా ఓం తన షూను బాక్స్ లో వేశాడు.

ఆదిత్య ఓం ముందుగా వేయడంతో మణికంఠ ఓడిపోయాడు. ఓడిపోయిన వారికి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలిగా అంటూ కంటెస్టెంట్లకే అవకాశం ఇచ్చాడు. దీంతో ఆదిత్య చాలా డిఫరెంట్ గా ఆలోచించి మణికంఠ ఓ ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేయాలంటూ సవాల్ విసిరాడు. ఆ సవాలు తీసుకున్న మణికంఠ సూపర్ మచ్చి అనే సాంగ్ మీద మాస్ స్టెప్పులేసాడు. ఆ తర్వాత నిఖిల్ నబీల్ ఇద్దరు ముందుకు వచ్చారు ఈ టాస్క్ లో నబిల్ ఓడిపోవడంతో బిగ్ బాస్ చుక్కలు చూపించాడు. పూల్లో ఉన్న వాటర్ తో బకెట్ ను నింపాలంటూ చెప్పాడు కానీ తాను అనుకున్నట్టు కాకుండా స్పూన్ తో బకెట్ను నింపాలంటూ దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ సమయంలో నబిల్ కష్టాలు చూస్తే బిగ్ బాస్ లవర్స్ కడుపు పట్టుకొని నవ్వాల్సిందే.

Bigg Boss Telugu 8 Day 31 Promo 1 out Colour Colour Which Colour Task promo viral

ఆ తర్వాత పృద్వి, యశ్మీ టాస్క్ ఆడగా ఇందులో పృథ్వి ఓడిపోతాడు. పనిష్మెంట్ గా పృద్వి అమ్మాయి గెటప్ వేసుకొని ఫ్యాషన్స్ షో చేయాలంటూ ఇతర కంటెస్టెంట్లు సవాల్ విసురుతారు. ఆ సవాళ్లు తీసుకున్న పృథ్వి లేడీ గెటప్ వేసుకొని ఉ అంటావా మామ అనే సాంగ్కు స్టెప్పులేస్తూ వయ్యారంగా నడుస్తూ ఫ్యాషన్ షో చేశాడు ఈ క్రమంలో కంటెస్టెంట్ అందరూ తెగపడి పడి నవ్వుకున్నారు ఈ సీన్ చూస్తే.. ఎవరికైనా నవ్వు రావాల్సిందే. ఇలా నేటి ఎపిసోడ్ సంబంధించిన తాజా ప్రోమో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓసారి లుక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X