Bigg Boss: మణికంఠపై విషం కక్కుతున్న హౌస్ మేట్స్.. కంటెస్టెంట్లందరికీ స్టాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
Bigg Boss 8 Telugu Latest Promo: బుల్లితెర ప్రేక్షకులను రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తోంది.ఈ సీజన్ లో ఎవరూ ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, మిడ్ వీక్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అంటూ ఓ రేంజ్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ అనౌన్స్ మెంట్, దిమ్మతిరిగే ట్వీస్టులతో ఇవ్వడంతో గతంలో ఏ సీజన్ కు లేని భారీ రెస్పాన్స్ సీజన్ 8 దూసుకపోతోంది.హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి షో ఐదోవారం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం శనివారానికి సంబంధించిన బిగ్ బాస్ లెటేస్ట్ ఫోటో విడుదలైంది.
ప్రోమో ప్రారంభం కాగానే కింగ్ నాగార్జున్ కూల్ గా కనిపించినా.. కంటెస్టెంట్లందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ముందుగా కిర్రాక్ సీతను పిలిచి .. 'ఈ వారం నువ్వు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కరెక్టేనా?' అని కింగ్ నాగార్జున ప్రశ్నించగా.. 'లేదు సార్. ఈసారి విష్ణు ప్రియ, మణికంఠలనునామినేట్ చేశాను సార్. కానీ, అది తప్పుగా అనిపిస్తుంది. అందుకే.. నేనే సాక్రిఫైజ్ చేసుకుందామని అనుకున్నా..' అని అని సమాధానం ఇస్తుంది సీతా. 'మరి మొదటి మూడు వారాలు కోపం తగ్గించుకో.. కంట్రోల్ చేసుకో.. బార్డర్ దాటొద్దు .. అని ముందే చెప్పానుగా..' అంటూ నాగార్జున నిలదీశారు.

ఆ తర్వాత పృద్విని గేమ్ బాగా ఆడుతున్నావంటూ అప్రిషేట్ చేస్తాడు నాగార్జున. ఆ తర్వాత డాన్సింగ్ డాల్ నైనిక ను నిలుచోబెట్టి ఓ రేంజ్ లో క్లాస్ పీకుతాడు. బోర్డుపై ఉన్న నైనిక ఫోటోకు కలర్ తో మార్కు చేస్తూ..'చిన్న ప్యాకెట్.. పెద్ద బ్లాస్ట్. మరీ ఆ బ్లాస్ట్ ఏది? ' అంటూ నైనికను నిలదీస్తాడు నాగార్జున. దీంతో నైనిక రిప్లే ఇస్తూ.. 'ఏదైనా టాస్క్ వస్తే.. స్ట్రాంగ్ గా పర్ఫామెన్స్ చేస్తా'నట్టుంది. 'కానీ ఫస్ట్ వీక్ లో చూసిన నైనిక తనకు కనిపించడం లేదు. ఆ నైనిక ఎక్కడికి వెళ్లిపోయింది' అంటూ కింగ్ నాగార్జున సెటైర్ వేస్తాడు.
'తుఫాను రాబోతుందమ్మ.. వైల్డ్ కార్డ్స్ ద్వారా వన్ బై వన్ రాబోతున్నాయి.. మీరు వైల్డ్ గా లేకపోతే.. వారిని తట్టుకోలేరు' అంటూ కంటెస్టెంట్ లందరికీ వార్నింగ్ ఇస్తాడు నాగార్జున. ఆ తర్వాత మణికంఠను నిల్చోబెట్టి.. 'మణికంఠ మేనీకంఠ .. నీతో చాలా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడుకుందామా .. తర్వాత మాట్లాడుకుందామా ..? అంటూ స్ట్రైట్ గా క్వశ్చన్ వేశాడు నాగార్జున. దీంతో మణికంఠ కంగారు పడుతూ ..'ఎప్పుడైనా ఒకే సార్' అంటూ సమాధానం ఇస్తాడు. 'మరి సీత బాడీ లాంగ్వేజ్ లో నీకున్న ప్రాబ్లం ఏంటి?' అని ప్రశించగా.. 'సీత కాస్త ఎక్కిరించినట్లు అనిపించింది' అని సమాధానమిస్తాడు. ఆ ఆన్సర్ తో వెంటనే రియాక్ట్ అయిన సీత..'మాకు మాత్రం మణికంఠనే ప్రాబ్లెమ్.. కంటెస్టెంట్లు అందరినీ కార్నర్ చేస్తున్నాడనిపిస్తుంది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది సీత.

ఆ సమాధానంతో సీరియస్ అయినా నాగార్జున.. మణికంఠ వెంటనే యాక్షన్ రూమ్ లోకి రమ్మంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. యాక్షన్ రూమ్ లోకి వెళ్లిన మణికంఠకు ఓ ఆప్షన్స్ ఇస్తాడు. 'నీకు ఎనిమిది నిమిషాలు టైం ఇస్తున్నాను. ఎంత ఏడవాలనిపిస్తుందో అంతగా ఏడ్చేయి'అని సలహా ఇస్తాడు నాగార్జున. దీంతో షాక్ అయిన మనికంఠ..'ఆల్మోస్ట్ తన బాధలన్నీ పోయాయ'ని బదిలిస్తాడు. 'ఒకవేళ ప్రియ వచ్చు నా దగ్గరికి రావద్దని అంటే.. నీ రియాక్షన్ ఏంటి? ' అని ప్రశ్నిస్తాడు. అది తలుచుకుంటూనే భయమేస్తుందని ఎమోషనల్ అవుతాడు. ఇదే కాదు నీకు మరో విషయం పర్సనల్గా చెప్పాలనుకుంటున్నానని. ఏడవడమే నీ స్ట్రాటజీ అయితే.. అది పనికిరాదు హౌస్ అందరికీ ఆ విషయం తెలిసిపోయింది అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తాడు నాగార్జున. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ వారం ఓటింగ్ పరంగా విష్ణు ప్రియ, నైనిక లు వెనకబడ్డారు. అయితే విష్ణుప్రియకు స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం అలాగే పృద్వి ఫ్యాన్స్ కూడా విష్ణుప్రియ కు సపోర్ట్ చేయడంతో విష్ణు ప్రియ ఓటింగ్ శాతం పెరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. నైనిక డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయింది దాదాపు నైమి కానీ ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది అంటూ చెబుతున్నారు. ప్రోమో చూస్తే కింగ్ నాగార్జున కూడా నైనికాకు వార్నింగ్ ఇవ్వడంతో ఈ వారం డాన్సింగ్ డాల్ నైనిక కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











