Bigg Boss Telugu 8 : చీఫ్‌ల మధ్య చిచ్చు పెట్టే స్కెచ్ .. టీమ్స్‌గా విడిపోయిన కంటెస్టెంట్స్, ఆడపులినంటూ సోనియా
బిగ్‌బాస్ తెలుగు 8లో నామినేషన్ల వ్యవహారం కాకరేపుతోంది. హౌస్‌లోకి వచ్చిన రెండ్రోజుల్లో ఏ కారణం చెప్పి కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేయాలో తెలియక సిల్లీ రీజన్స్‌తో నామినేషన్స్‌ని ముగిస్తున్నారు. అయితే ఇలాంటి రీజన్స్‌ను పెట్టి తమను నామినేట్ చేస్తామంటే ఊరుకునేది లేదనట్లుగా కొందరు ఇంటి సభ్యులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఇది హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలకు దారి తీస్తోంది. గురువారం నాటి ఎపిసోడ్‌కి సంబంధించి లేటెస్ట్ ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.
ఈ సీజన్‌లో కెప్టెన్ ఉండడని ప్రకటించిన బిగ్‌బాస్ ఆ ప్లేస్‌లో కొత్తగా చీఫ్‌లను తీసుకొచ్చారు. నిఖిల్, నైనిక, యాష్మీ గౌడ్‌లు చీఫ్‌లుగా ఎంపికయ్యారు. నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్స్‌ను సేవ్ చేసే బాధ్యతను వారి చేతుల్లోనే పెట్టారు. బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో ఫస్ట్ నామినేషన్ చేసే అవకాశం సోనియా ఆకులకు ఇచ్చాడు బిగ్‌బాస్. ఈమే బేబక్క, ప్రేరణను నామినేట్ చేయగా.. ఆ తర్వాత వరుసగా నాగ మణికంఠ, బేబక్కలను నబీల్.. నాగ మణికంఠ, బేబక్కలను శేఖర్ భాషా.. పృథ్వీరాజ్, నబీల్‌లను బేబక్క నామినేట్ చేశారు.

మంగళవారం నాటికి బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్‌లు నామినేషన్స్‌లో ఉండగా.. బుధవారం విషయానికి వస్తే పృథ్వీరాజ్, శేఖర్ భాషాలను ఆదిత్య ఓం.. ప్రేరణ, బేబక్కలను కిర్రాక్ సీత.. మణికంఠ, బేబక్కలను అభయ్.. శేఖర్ భాషా, సోనియాలను విష్ణుప్రియ.. విష్ణుప్రియ, శేఖర్ భాషాలను మణికంఠ.. బేబక్క, మణికంఠలను పృథ్వీరాజ్ నామినేట్ చేశారు. మొత్తంగా ఈ వారం సోనియా, బేబక్క, శేఖర్ భాషా, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠలు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
గురవారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా ప్రోమో రిలీజ్ చేసింది. అది ప్రారంభం కాగానే.. ఉదయాన్నే బ్రష్ చేసుకునేందుకు పృథ్వీ పేస్ట్ తీసుకుంటాడు. దానిని చూసిన నిఖిల్.. ఏంటీ , ఆ క్రీమ్ వేసుకున్నావా నువ్వు అని అడగ్గా.. పృథ్వీ ఔను అంటాడు. అది ఫేస్ వాష్ అని నిఖిల్ చెప్పగా.. అక్కడే ఉన్న అమ్మాయిలు పగలబడి నవ్వుతారు. జస్ట్ మిస్ నిఖిల్ చెప్పకుంటే బ్రష్ చేసేవాడినని పృథ్వీ అంటాడు.
అనంతరం కంటెస్టెంట్స్ అంతా కూర్చొని ఉండగా.. సైన్యం లేని రాజు.. రాజు కాడు, అలాగే చీఫ్ పవర్‌ఫుల్ కావడానికి అతనికి సైన్యం కావాలని , వారి క్లాన్‌ని నిర్మించుకునే సమయం ఆసన్నమైందని బిగ్‌బాస్ వాయిస్ వినిపిస్తుంది. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ముగ్గురు చీఫ్‌లు నిఖిల్, నైనిక, యాష్మీలు ఇంటి సభ్యులను మోటివేట్ చేస్తూ వారిని తమ సైన్యంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇంటి సభ్యులు ముగ్గురు చీఫ్‌లలో ఎవరి వైపు వెళ్లాలో నిర్ణయించుకునే ఛాన్స్ ఉండటంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయం చెబుతారు. మనుషుల్ని గెలుచుకుంటున్నాడో లేదో చూడాలని అనుకుంటున్నానని.. ఈ ఆడపులితో ఫైట్ చేస్తేనే పాజిబుల్ అవుతుందని నిఖిల్ వంక చూస్తూ సోనియా చెబుతుండగా ప్రోమో ఎండ్ అవుతుంది. చూస్తుంటే సైన్యం పేరుతో చీఫ్‌లు ముగ్గురి మధ్య పెంట పెట్టాలని బిగ్‌బాస్ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది. మరి ఏ ఇంటి సభ్యులు ఏ చీఫ్ వైపు వెళ్లాడో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











