Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లో జంబలకడిపంబ..కంటెస్టెంట్ల గెటప్స్ మామూలుగా లేవుగా..
Bigg Boss 8 Telugu: బుల్లితెర ప్రేక్షకులకు పుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఈ సీజన్లో ఎవరూ ఊహించని ట్విస్టులు మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు చూడని కంటెంట్ తో ముందుకు రావడంతో ఈ షోకు మంచి ఆదరణ వస్తోంది. హైయెస్ట్ టీఆర్పీతో రసవత్తరంగా సాగుతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. నేటీ ఎపిసోడ్ లో జంబలకడిపంబ మూవీని రిక్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
తాజాగా విడుదలైన బిగ్ బాస్ తెలుగు ప్రోమో చూస్తే.. సండే ఫన్డే గా మారింది. టాలీవుడ్ పార్టీ సాంగ్ పై స్టెప్పులు వేసుకుంటూ కంటెస్టెంట్ లందరూ.. డిఫరెంట్ గెటప్స్ లలో ఎంట్రీ ఇచ్చారు. అంటే అబ్బాయిలు అమ్మాయిల గెటప్ లో.. అమ్మాయిలు అబ్బాయిల గెటప్ లలో కనిపించి ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ షోలోకి ఎలాగైతే జంటలుగా ఎంట్రీ ఇచ్చారో.. అలానే.. కంటెస్టెంట్లు జంటగా లాన్ లోకి వచ్చారు. వారి గెటప్స్ చూసి.. నాగార్జున కూడా పడి పడి నవ్వారు. ముక్కా అవినాష్ చాలా డిఫరెంట్గా టాప్ లో వచ్చి నాకు సార్ కు ప్రపోజ్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇందులో నబిల్, గౌతమ్ ల లేడీ గెటప్ మాత్రం అందర్నీ అట్రాక్ట్ చేసింది. వారిద్దర్నీ చూస్తే నిజంగానే అమ్మాయిలా.. అనేలా మేకప్ అయ్యారు. చాలా క్యూట్ గా ఉన్నారు. ఈ సమయంలో హోస్ట్ నాగార్జున.. ఇతర కంటెస్టెంట్లలాగా యాక్ట్ చేయాలని ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇస్తారు. ఈ తరుణంలో విష్ణు ప్రియ, పృథ్విలు హౌస్ లో ఎలా ఉంటారో చేసి చూపించమని ముక్కు అవినాష్, విష్ణు ప్రియలకు టాస్క్ ఇస్తాడు నాగార్జున. ఇదే ఛాన్స్ గా భావించిన ముక్కు అవినాష్ రెచ్చిపోతాడు. మెయిల్ గెటప్ లో ఉన్న విష్ణు ప్రియను హగ్ చేసుకొని.. ముద్దులు ఇస్తాడు. అలాగే విష్ణు ప్రియ ముందే విష్ణుప్రియలాగా.. యాక్ట్ చేసి కంటెస్టెంట్ అందర్నీ నవ్విస్తాడు.
ఆ తర్వాత యశ్మీ ఎలా రియాక్ట్ .. అవుతుందో చూపించమని నిఖిల్ కు టాస్క్ ఇస్తాడు. యష్మీ దానికంటే నిఖిల్ చేసిన పర్ఫామెన్స్ అదుర్స్ అని చెప్పాలి. రియల్ గా.. యష్మీ క్యారెక్టర్ లో నిఖిల్ లీలమైపోతాడు. ఆ తర్వాత టేస్టీ తేజను పిలిచి.. రోహిణి, గౌతమ్ లు ఎలా ఉంటారో ఆక్ట్ చేసి చూపించమన్నారు నాగార్జున. ఈ సమయంలో గౌతమ్ గా రోహిణి యాక్ట్ చేయగా.. రోహిణిగా టేస్టీ తేజ నటిస్తారు. వీరి పర్ఫామెన్స్ కూడా పొట్ట చెక్కలయ్యేలా ఉంది. ఆ తర్వాత గౌతమ్ గెటప్ ను చూసి నాగార్జున కూడా ఇంప్రెస్ అయితాడు. గౌతమ్ ను యష్మీ లా ఆక్ట్ చేయమని స్కిట్ ఇస్తాడు. ఈ స్కిట్ లో ప్రేరణ ఎంట్రీ వీర లెవల్లో యాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రేరణ.. నిఖిల్ లా యాక్ట్ చేయడంతో నిఖిల్ కు అవాక్కవుతారు. ఇలా మొత్తానికి సండే చాలా పండేగా సాగిందని అర్థమవుతుంది.
అయితే శనివారం ఎపిసోడ్లో గంగవ్వ ను ఎలిమినేట్ చేసి పంపించిన విషయం తెలిసిందే. ఈ విషయం బిగ్ బాస్ లవర్స్ చాలా డిస్పాయింట్ అయ్యారనే చెప్పాలి. ఈ తరుణంలో బీబీ ఫ్యాన్ లో మరో టెన్షన్ పట్టుకుంది. పదోవారం ఎవరు హౌస్ నుండి వెళ్లిపోతారనేది హార్ట్ టాపిక్ గా మారింది. అయితే బిగ్ బాస్ ఓటింగ్, రివ్యూస్ ప్రకారం.. 99% హరితేజ ఎలిమినేట్ అవుతుందని ఆమెకే తక్కువ ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. మరి బిగ్బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వాలని భావిస్తున్నాడో.. తెలియాలంటే షో ప్రసారం అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











