Bigg Boss Telugu 8 : సాయంత్రం 6 దాటితే.. బయటపడ్డ యష్మీ బాగోతం..

Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ ను అందిస్తుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఈ సీజన్లో ఎప్పుడూ లేనివిధంగా కొత్త కంటెంట్ తో బీబీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాగే గత సీజన్లో చూడని ట్విస్టులు, మలుపులు సీజన్ 8లో చోటు చేసుకుంటున్నాయి. దీంతో బిగ్ బాస్ లవర్స్ నుండి మంచి ఆదరణ వస్తుంది. ఇప్పటికే 10 వారాలను సక్సెస్ పుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్. 11వ వారం చివరి దశకు చేరుకుంది. తాజాగా ఎపిసోడ్ కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ అంశాలను జోడిస్తూ ప్రోమో విడుదల చేశారు.

బిగ్బాస్ తాజా ప్రోమో దుమ్ము రేపుతుంది. బిగ్బాస్ 11 వారం ఫ్యామిలీ వీక్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో కంటెస్టెంట్లలో ఫుల్ జోష్ వచ్చింది. ఆ జోష్ ను మరింత రెట్టింపు చేయడానికి వీకెండ్ లో.. కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ను తీసుకువచ్చి వారిని సర్ప్రైజ్ చేశారు బిగ్ బాస్ టీం. నేటి ఎపిసోడ్లో అవినాష్ కోసం తన బ్రదర్ తో పాటు రైటర్ కోనా వెంకట్ స్టేజ్ పైకి వచ్చారు. కోన వెంకట్ ను చూడగానే అవినాష్ చాలా సర్ప్రైజ్ అయ్యారు. కోన వెంకట్ బిగ్ బాస్ కు పెద్ద ఫ్యాన్ అంటూ అవినాష్ చెప్పాడు. ఈ సమయంలో కోన వెంకట్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ వల్ల తనకు టాలెంటెడ్ యాక్టర్స్ దొరికాయంటూ చెప్పుకొచ్చారు.

Bigg Boss Telugu 8 Day 77 Yashmi Secret Reveal by Sri Satya Before Nagarjuna

ఆ తర్వాత యష్మీ కోసం తన ఫ్రెండ్, నటి శ్రీ సత్య స్టేజ్ పైకి వచ్చి సర్ప్రైజ్ చేశారు. వాళ్ళిద్దరినీ చూడగానే యష్మి తెగ సంతోష పడింది. కానీ శ్రీ సత్య..మాత్రం నాగార్జున ముందు యశ్మీ పరువు తీసింది. శ్రీ సత్య మాట్లాడుతూ 'వీళ్ళిద్దరూ కలిస్తే.. ఏం చేస్తారో ? మీరు ఒకసారి అడగండి సార్ అంటూ నాగార్జునకు చెబుతుంది. 'సాయంత్రం 6 తర్వాత యశ్మీ ఏం చేస్తుందో మీరు ఇంకా చూడలేదు సార్ 'అంటూ తన ఫ్రెండ్ ఓ హింట్ ఇస్తోంది. దీంతో షాక్ అయినా నాగార్జున.. ఆ సీక్రెట్ చెబితే తాను ప్రైజ్ మనీకి మూడు లక్షలు కలుపుతానని ఆఫర్ ఇస్తాడు.

దీంతో అంగీకరించిన యష్మీ ..'నేను ఏం చేస్తానంటే.. బావ ఏక్ పెగ్ లా ' అంటూ స్టెప్పులేస్తుంది. దీంతో అవాక్కైనా నాగార్జున.. 'ఏంటమ్మా మన బ్రాండ్' అంటూ పంచ్ వేస్తాడు. ఆ తర్వాత శ్రీ సత్య మాట్లాడుతూ..తాను పాత యష్మిని చూడాలనుకుంటున్నానని మోటివేట్ చేస్తుంది. మరోవైపు అవినాష్ ను ఇరకాటంలో పడేస్తుంది శ్రీ సత్య. అవినాష్ గురించి తనకు బాగా తెలుసని శ్రీ సత్య చెబుతోందని నాగార్జున అంటాడు. దీంతో అవినాష్ తన సీక్రెట్ ఏదో బయట పడుతున్నట్లు .. శ్రీ సత్య గురించి కూడా నాకు బాగా తెలుసు అంటూ రిప్లై ఇస్తాడు.

దీంతో శ్రీ సత్య రెచ్చిపోతుంది. 'ఫారిన్ ట్రిప్పులకు వెళ్లి ఏం చేస్తావ్?' అంటూ అవినాష్ ను నిలదీస్తుంది శ్రీ సత్య. ఆ ప్రశ్నకు నీళ్లు మింగుతూ.. దొరికిపోయానురా అయ్యా అంటూ తల పట్టుకుంటాడు. 'బయటికి రా నీకు ఉంది' అంటూ అవినాష్ కు శ్రీ సత్య వార్నింగ్ ఇస్తుంది. 'ఉంది ఉంది అంటున్నావ్.. ఆఫ్టర్ సిక్సా..' అంటూ సెటైర్ చేస్తాడు. ఇలా షోలో నవ్వుల పువ్వులు పూయించారు.

Bigg Boss Telugu 8 Day 77 Yashmi Secret Reveal by Sri Satya Before Nagarjuna

ఆ తర్వాత తేజ కోసం తన తండ్రి, వీజే సన్నీ స్టేజ్ పైకి వస్తారు. తన తండ్రిని చూడగానే తేజ ఎమోషనల్ అయితాడు. ఈ సమయంలో వీజే సన్నీ మాట్లాడుతూ 'ఏంట్రా తగ్గినట్లు ఉన్నావు 'అంటూ సరదాగా మాట్లాడుతాడు. 'నాగార్జున సార్ షర్ట్ ఇస్తానన్నాడు.. అందుకే నేను తగ్గుతున్నా'నని రిప్లై ఇస్తాడు. 'నాగార్జున సార్ షర్ట్ ఇవ్వాలంటే అదృష్టం అనేది రాసిపెట్టే ఉండాలి. అది జరగదమ్మా 'అంటూ కౌంటర్ వేస్తాడు సన్నీ.

ఇలా నేటీ ఎపిసోడ్ సండే ఫన్డే గా కొనసాగినట్లు తెలుస్తోంది. అలాగే.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. డేంజర్ జోన్ లో ముక్కు అవినాష్, టేస్టీ తేజ ఉండగా.. నబీల్ తన ఎవిక్షన్ పవర్ ను యూస్ చేస్తానంటూ నాగార్జున సార్ తో చెబుతాడు. అయితే.. ఆ పవర్ తో ఎవరిని కాపాడాడు అనేది ట్విస్ట్ గా మారింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తెలియాలంటే ఎపిసోడ్లో చూడాల్సిందే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X