Bigg Boss Telugu 8: విష్ణుప్రియ బాగోతాన్ని బయటపెట్టిన రోహిణీ.. పృద్వీతో లవ్ ట్రాక్ గేమ్ ప్లానా?

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. మరో మూడు వారాల్లో షో ముగిసిపోతుండగా . టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఎవరు? టైటిల్ విన్నర్ ఎవరు అని చర్చ జోరుగా సాగుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు? అని బెట్టింగ్స్ కూడా సాగుతున్నాయి. అయితే.. ఈ క్రమంలో బిగ్ బాస్ కళామతల్లి విష్ణు ప్రియ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఉంటుందని భావిస్తున్నారు అందరూ. కానీ, విష్ణు ప్రియ క్యారెక్టర్ ను డామేజ్ అయ్యేలా రోహిణి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రోహిణి విష్ణు పై ఎలాంటి కామెంట్స్ చేసిందో ఓ లూకేయ్యండి

బిగ్ బాస్ లో 11వ వారం ఫ్యామిలీ వీక్ అంటూ ఫ్యామిలీ సెంటిమెంట్ తో సాగిపోయింది. గత వారం ఎలాంటి ఎలిమినేషన్స్ లేకుండా హ్యాపీగా సాగిపోయింది. కానీ, 12వ వారం హోరా హోరీగా సాగుతోంది. ఈ వారం చివరి దశకు చేరుకోవడంతో ఆఖరి మెగా చీఫ్ కంటెండర్ అవ్వడానికి కంటెస్టెంట్స్ అందరూ హోరా హోరీగా పోటీపడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా 'ఆటోలో ప్రయాణం' అంటూ ఓ ఛాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్.ఈ టాస్క్ లో గెలవాలంటే చివరి వరకు ఆటో దిగకుండా తమని తాను రక్షించుకోవాలని బిగ్ బాస్ బిగ్ ట్వీస్ట్ పెట్టారు.

Bigg Boss Telugu 8 Day 82 Promo Rohini shocking comments on Vishnu Priya love stories in Auto Lo Prayanam Challenge

ఈ టాప్ గేమ్ కు నబిల్ ను సంచలక్ గా పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్కులో విష్ణు ప్రియ, రోహిణి, యశ్మీ , టేస్టీ తేజ, పృద్వి పాల్గొన్నారు. ఈ టాస్క్ ప్రారంభం కాగానే.. ఒకరిని ఒకరు తోసేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో విష్ణు ప్రియ.. 'రోహిణిని తోసై తోసెయ్' అంటూ.. విష్ణు ప్రియ గట్టిగా అరుస్తుంది. కానీ ఈ తోపులాటలో మొదట టేస్టీ తేజ ఆటోలో నుండి బయటపడతాడు. ఆ తర్వాత.. రోహిణిని టార్గెట్ చేస్తారు. ఆమెను బయటికి తోసే ప్రయత్నం చేయగా.. ఆమెనే బయటపడుతుంది. ఆ తర్వాత పృద్వి, యష్మీ, విష్ణు ప్రియలు మిగులుతారు.

'మీ ముగ్గురిలో ఎవరు ఎవరితో పోటీపడుతారో.. ఎవర్ని ఎవరు తోసేస్తారో నేను చూస్తా ' అంటూ ఫైర్ అవుతుంది రోహిణి. ఆ తర్వాత..విష్ణు ప్రియ, పృద్వి లు కలిసి యశ్మిని బయటకు తోసేస్తారు. దీంతో యష్మి బయటకు వచ్చి.. ఏడుస్తుంది. ఈ సమయంలో ముందుగా పృథ్వి ఇచ్చిన మాట తప్పడు అంటూ ఎమోషనల్ అవుతుంది. దీంతో పృద్వి మాట్లాడుతూ..' ఎమోషనల్ అవ్వకు.. ఇది గేమ్ 'అంటూ కామెంట్ చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు మాట ఇవ్వాలని నిలదీస్తోంది.' ఇప్పుడు ఆడండి గేమ్ ఎవరు ఎవరిని తోస్తారో నేను చూస్తా.. దమ్ముంటే విష్ణు ప్రియ ను తోసేసి పాయింట్ తీసుకొని రా' అంటూ ప్రుధ్వీకి సవాల్ విసురుతుంది యశ్మీ.

ఆ తర్వాత ఈ టాపిక్ లోకి రోహిణి ఎంటర్ అవుతుంది. 'వాళ్ళు ఎందుకు గేమ్ ఆడుతారు?' అంటూ కామెంట్ చేస్తుంది. ఆ మాటలు విన్నవిష్ణు ప్రియ..' ఎందుకు మా గురించి మాట్లాడుతున్నావ్.. ఫస్ట్ నీది నువ్వు చూసుకో 'అంటూ గట్టిగా అరుస్తుంది విష్ణు ప్రియ. దీంతో రోహిణీకి ఎక్కడ లేని కోపం వస్తోంది. 'నేనేం చేశాను' అంటూ రోహిణి గట్టిగా అరుస్తుంది. ఈ సమయంలో విష్ణు ప్రియ నోరు జారుతుంది..'ఈ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు' అంటూ రోహిణి హేళన చేస్తుంది.

Bigg Boss Telugu 8 Day 82 Promo Rohini shocking comments on Vishnu Priya love stories in Auto Lo Prayanam Challenge

దీంతో రోహిణి మరింత సీరియస్ అవుతూ.. 8క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడకు.. నీ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు' అంటుంది. 'నువ్వంటో అందరికీ తెలుసు.. మొదట నిఖిల్ కు ట్రై చేసి.. పడలేదని, పృద్విని ట్రై చేశానని నువ్వే చెప్పావు. ఎవరు ప్లాన్ చేశారు' అంటూ విష్ణు ప్రియ బాగోతాన్ని బయటపడుతుంది రోహిణి. 'నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు' అంటూ రోహిణి పై విష్ణు ప్రియ ఫైర్ అవుతుంది. రోహిణి కూడా తగ్గేదేలే అన్నట్లుగా.. ' నువ్వే గుర్తు చేసుకో ఏం చెప్పావు?'అని అంటుంది.

'క్యారెక్టర్ తెలుస్తుంది అంటేనే నేను అలా మాట్లాడాను' అని తర్వాత క్లారిటీ ఇస్తుంది రోహిణి. ఇలా మొత్తానికి విష్ణు ప్రియ క్యారెక్టర్ ను రోహిణి బయటపెట్టింది. ఇప్పటివరకు విష్ణు ప్రియా.. సిన్సియర్ గా పృద్విని ట్రై చేస్తుందని భావించిన బిగ్ బి ప్రేక్షకులకు రోహిణి మాటలు షాక్ ఇచ్చాయి. దీంతో విష్ణు ప్రియ ఓటింగ్ తగ్గే అవకాశం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. ఈవారం కళామతల్లి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం పక్క అంటూ కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X