18వ అంతస్థు నుంచి దూకి చనిపోదామనుకున్నాను.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎమోషనల్
Bigg Boss: బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. గతంలో ఎన్నడూ లేని విధంగా రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఈ షో హైయెస్ట్ టీఆర్పితో సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది. ఈ షో నేటితో ముగియబోతుంది. నేడు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరో.. రన్నర్ ఎవరో అనేది సర్వత్ర ఉత్కంఠ గా మారింది. ఈ నేపథ్యంలో చివరి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటూ.. కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 చివరి ఎపిసోడ్ లో కంటెస్టెంట్లకు ఓ డిఫరెంట్ టాస్క్ ఇచ్చారు. ఈ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరిని కలవాలనుకుంటున్నారు? ఎవరితో దూరంగా ఉండాలని అనుకుంటున్నారు? అనే టాస్క్ పెట్టారు బిగ్ బాస్. అయితే.. దాదాపు కంటెస్టెంట్లు అందరూ తామందరం కలుసుకుంటామంటూ చెప్పారు. ఈ తరుణంలో ప్రేరణ మాట్లాడుతూ.. సోనియా తనకు పర్సనల్ గా నచ్చలేదని ఓపెన్ గానే చెప్పిస్తుంది. ఆ తర్వాత గౌతమ్.. పృద్విని బ్లాక్ చేశానని చెప్పాడు. ఇక నబిల్.. హరితేజ, సోనియా లను బ్లాక్ చేశారు. ఇక నిఖిల్.. తనని బ్లెమ్ చేసిన బేబక్క, సీతను బ్లాక్ చేప్పారు. ఇక అవినాష్.. పృద్విని టెంపరరీగా బ్లాక్ చేస్తానని చెప్పుకొచ్చారు.

అనంతరం.. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ చలిమంట వేసుకొని ఎంజాయ్ చేశారు. ఈ తరుణంలో తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను, వరస్ట్ మూమెంట్స్ ను పంచుకున్నారు. ఈ సమయంలో నబీల్ మాట్లాడుతూ.. తనకు బైక్ యాక్సిడెంట్ కావడంవల్ల ఆసుపత్రి పాలయానని, అది తన జీవితంలో దారుణమైన పరిస్థితి అని తన బాధను చెప్పుకున్నాడు. ఇక నిఖిల్ మాట్లాడుతూ.. తాను ఆర్కిటెక్ కోర్సు చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్లు వచ్చాయని, దీంతో మధ్యలో చదువు ఆపేయాల్సి వచ్చిందని చెప్పారు.
మూడేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నానని, కనీసం తన చేతి ఖర్చులు కూడా లేకపోవడంతో తన తల్లిని అడుక్కునే వాడినని, ఆ సమయంలో తన తల్లి తనని తిట్టిందని చెప్పుకుంటూ ఫీలయ్యారు. ఆ తర్వాత.. కంటిన్యూగా ప్రయత్నాలు చేయడంతో కన్నడ సీరియల్లో ఆఫర్ వచ్చిందని, రోజుకు 2500 ఇస్తామని చెప్పారు. దీంతో నెలకు 75000 దాకా సంపాదించవచ్చు అనుకున్నా.. కానీ తీరా వెళ్తే కేవలం పది రోజులు మాత్రమే షూటింగ్ జరిగేదని, ఆ తర్వాత తెలుగు సీరియల్ లో అవకాశం వచ్చిందని, అప్పటినుండి తాను వెనక్కి తిరిగి చూడలేదని చెప్పుకున్నారు.

ఇక ప్రేరణ తన నాయనమ్మ చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఏడ్చింది. ఆ తర్వాత గౌతమ్ తన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తాను మెడిసిన్స్ అవుతున్నప్పుడు.. ఓ అమ్మాయిని ప్రేమించాలని, కానీ తాను బ్రేకప్ చెప్పిందని, ఆ బాధ తట్టుకోలేక 18వ అంతస్తు నుండి దుంకి చనిపోదామని ఫిక్స్ అయ్యానని అన్నారు. కానీ, తనతో పాటు తనను ప్రేమించే వాళ్లు గర్వంగా చూస్తే ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆరోజు తాను ఫిక్స్ అయ్యానని ఆనాటి నుండి ప్రతి అవకాశాని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పుకొచ్చారు.
ఇక అవినాష్ మాట్లాడుతూ.. తన ఎమోషనల్ స్టోరీ చెప్పి అందర్నీ కన్నీటి పర్యంతం చేశారు. తాను తన భార్య ఎన్నో కలలు కన్నామని, ఏ జన్మలో ఏ తప్పు చేశామో తమకు తెలియదని పుట్టినరోజు ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే.. నేడు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఈ సీజన్లో ఎవరు రన్నర్ అవుతారో ఎవరు విన్నర్ అవుతారు అనేది సర్వత్ర చర్చనీయంగా మారింది. ఇప్పటివరకు వెలబడుతున్న సోషల్ మీడియా అనాలసిస్ ప్రకారం.. టాప్ 5 ప్లేస్ లో అవినాష్ నిలువగా.. టాప్ 4 ప్లేస్లో ప్రేరణ, టాప్ 3 గా నబిల్ నిలిచినట్లు సమాచారం. ఇక టాప్ 1 లేదా 2 స్థానాలలో గౌతమ్, నిఖిల్ నిలిచారు. వీరిద్దరిలో రన్నర్ ఎవరో విన్నర్ ఎవరో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











