Bigg Boss 8 telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పదా? వారిద్దరే హౌస్ నుంచి అవుట్ !
Bigg Boss 8 Telugu: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8. ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో ఎన్నడూ చూడని, ఎవరు ఊహించని ట్విస్టులు చోటుచేసుకోవడంతో బిగ్ బాస్ లవర్స్ షోపై మరింత ఆసక్తి కనబరుస్తున్నారు . తొలి నాలుగో వారాలు షో పసలేకుండా నడిచినా.. వైల్డ్ కార్డు ఎంట్రీ లతో షోపై ఇంట్రెస్ట్ పెరిగింది. హైయెస్ట్ టీఆర్పీతో దూసుకెళ్తుంది. అయితే బిగ్ బాస్ షోలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బిగ్ బాస్ సీజన్ 8 అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. మంచి ఆదరణ వస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మందిని షోలోకి ఎంట్రీ ఇచ్చి, అందరికీ షాక్ ఇచ్చారు బిగ్ బాస్ మేనేజ్మెంట్. వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ షో కాస్త జోష్ పెరిగింది. కంటెస్టెంట్ల మధ్య కూడా పోటీ పెరిగింది. ఇలా వైల్డ్ కార్డు ద్వారా గేమ్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ మంచి కంటెంట్ ను ఇస్తున్నారు. గేమ్స్ లో తన సత్తా చాటుతున్నారు. దీంతో గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. అలాగే.. లవ్ స్టోరీస్ కూడా స్టార్ అయ్యారు. వారి రోమాన్స్ చూడటానికైనా చాలా మంది ఈ షోను వీక్షిస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది.

ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న ఈ సీజన్ పదోవవారం ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ ఉండబోతుందని, ఈ వారం ఒకరు కాదు.. ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఒకేసారి ఎలిమినేటర్ చేయబోతున్నారు తెలుస్తోంది. అందులో మొదటిగా గంగవ్వను ఎలిమినేటర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ వైల్డ్ కార్డ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో తొలిరోజు నుంచి యంగ్ కంటెస్టెంట్లతో పోటీపడి టాస్క్ ఆడి గెలుపొందింది. వయసుతో సంబంధం లేకుండా చాలా యాక్టివ్ గా ఉంటూ.. తన కామెడి టైమింగ్ తో నవ్వుల పువ్వులను పూయిస్తోంది.
అలాగే..ప్రాంక్ లతో కంటెస్టెంట్లకు చెమటలు పట్టించింది. కానీ, గత వారం రోజులుగా వయసు దృష్ట్యా గంగవ్వకు ఫిజికల్ టాస్కులు, గేమ్స్ లో పాల్గొనడం లేదు. అయితే.. గంగవ్వకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా.. ఆమెను నామినేట్ చేయడానికి కూడా తోటి కంటెస్టెంట్లు భయపడుతున్నారు. గత 2 వారాలుగా గంగవ్వ.. కేవలం సంచాలకురాలు గాని వ్యవహరిస్తుంది. కానీ, ఎలాంటి గేమ్ లలో.. కానీ ఫిజికల్ టాస్క్ గానీ పాల్గొనడం లేదు.

బిగ్బాస్ షోలో ఉండాలంటే ఇతర కంటెస్టెంట్లతో సరిగా ఉండడమే కాదు. అన్ని టాస్కులలో పాల్గొంటూ బెస్ట్ ఇస్తే గేమ్ కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి గంగవ్వ మినహిస్తే.. ఇతర కంటెస్టెంట్ల ఆట తీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే సోషల్ మీడియాలో గంగవ్వను ఎందుకు తీసుకున్నారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో షోపై నెగెటివిటీ పెరగకముందే గంగవ్వను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ టీం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఓట్ల పరంగా చూస్తే ఈ వారం ఎవరు ఊహించని విధంగా గౌతమ్.. అత్యధిక ఓట్లు సాధించి.. టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఆ తర్వాత స్థానాలలో నిఖిల్, ప్రేరణ గెలిచారు. ఇక తర్వాత నాలుగు స్థానాలలో విష్ణు ప్రియ, యష్మీ, పృథ్వి, హరితేజ నిలిచారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే .. నిఖిల్, గౌతమ్ , ప్రేరణ, సేఫ్ ప్లేస్ లో నిలవగా.. డేంజర్ జోన్ లో విష్ణు ప్రియ, యష్మీ, పృథ్వి, హరితేజ ఉన్నారు. తక్కువ ఓట్లు రావడంతో ఈ వారం హరితేజ ఎలిమినేట్ కావచ్చని బిగ్ బాస్ రివ్యూవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే.. ఆదివారం ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











