ఆ ఇద్దరు తేనే పూసిన కత్తులు.. ఇంటిలో వాళ్లు అలా.. బేబక్క సంచలన వ్యాఖ్యలు
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో తొలివారం ముగిసి రెండోవారంలోకి ప్రవేశించింది. అయితే ఊహించిన విధంగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ జరగడంతో ఈ సీజన్ ట్విస్టులకు, టర్న్‌లకు చాలా స్కోప్ ఉందనే అభిప్రాయాన్ని కలిగించారు. అయితే కొన్నివారాలు ఇంటిలో బెజవాడ బేబక్క వినోదాన్ని పంచుతారు అనే నమ్మకం ఉన్న ఆడియెన్స్ బిగ్‌బాస్ షాకిచ్చారు. తొలివారం ఎలిమినేషన్ తర్వాత బేబక్క ఇన్‌హౌజ్ ఇంటర్వ్యూ బిగ్‌బాస్ బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వాఖ్యలు చేశారు. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో నుంచి తొలి కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క ఇంటి నుంచి బయటకు వచ్చారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించకపోవడంతో ఆమె తక్కువ ఓటింగ్ కారణంగా ఎలిమినేట్ అయ్యారు. దాంతో కొందరు ఇంటి సభ్యులే కాకుండా ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు.

అయితే బిగ్‌బాస్ ఇంటి నుంచి బజ్ షోలో హోస్ట్ అంబటి అర్జున్‌తో తన మనసులోని విషయాలను, హౌస్‌లో జరిగిన అనుభవాలను పూస గుచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షోలో అనుభవం కొత్తగా ఉంది. అర్ధం కాకముందే బయటకు వచ్చాను. ఇది ఊహించలేదు అని ఆమె చెప్పారు.
నిఖిల్ టీమ్‌లోకి నేను ఏరి కోరి వెళ్లడం ముళ్ల కిరీటం పెట్టుకొని ఉన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత సోనియానే స్ట్రాంగ్.. ఆమె గురించి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటే.. నాకు నచ్చలేదు. సోనియాను చూసి కొంత భయపడిన విషయం కరెక్టే.. ఆమె నిఖిల్ తేనే పూసిన కత్తులు అని బేబక్క ఆరోపణలు చేశారు. లోపల వారిద్దరు క్లోజ్‌గా ఉండటం అందరూ చూస్తున్నారు అన్నారు.
ఇంటిలో తొలి రోజు కిచెన్‌లో ప్రెషర్ కుక్కర్ వల్ల జరిగిన గొడవ నా జీవితాన్ని తలకిందులు చేసింది అని ఆమె అన్నారు. సోనియాతో గొడవ అక్కడే మొదలు కావడం తెలిసిందే. ఇక సోనియా మిర్చి కంటే ఘాటు అంటూ ఆమెపై కామెంట్ చేసింది. నిఖిల్ అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అని అన్నారు.


Click it and Unblock the Notifications











