Bigg Boss Elimination: ఒక్కసారిగా ఓటింగ్ ఉల్టా పుల్టా.. 3వ వారం అతడే ఎలిమినేట్!
ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్పందనను సొంతం చేసుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు గ్యాప్ లేకుండా సీజన్లను ప్రసారం చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇది ఆరంభ వారాల్లోనే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో వారం ఎలిమినేషన్స్‌ను నిర్ణయించే ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? చూసేద్దాం పదండి!
కాన్సెప్టుకు తగ్గట్లే కంటెంట్
అంచనాలు లేకుండానే వచ్చి సంచలనాలు సృష్టించిన షో బిగ్ బాస్. దీని నుంచి వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎనిమిదో దానిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఫలితంగా దీన్ని అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్‌ను విభిన్నమైన కంటెంట్‌తో ప్రసారం చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నారు.

14 మందిలో ఇద్దరు అవుట్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లలో మొదటి వారం జరిగిన ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా వెళ్లిపోయారు.
3 వీక్ 8 మంది నామినేషన్
బిగ్ బాస్ షోలో అత్యంత ముఖ్యమైన ఘట్టమే నామినేషన్స్ టాస్క్. దీనికి కారణం ఇందులో జరిగే గొడవలే. ఎనిమిదో సీజన్‌లో కూడా ఆరంభం నుంచే ఇవి కనిపిస్తున్నాయి. మూడో వారంలోనూ చాలా ఫైటింగ్‌లో కనిపించాయి. ఇలా ఈ వారంలో అభయ్, విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, యష్మీ గౌడ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ, నైనికలు నామినేషన్‌లోకి వచ్చేశారు.
ఆమె టాప్‌లో.. అతడు 2లో
ఎనిమిదో సీజన్ మూడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియను సోమవారం రాత్రి నుంచి మొదలెట్టిన విషయం తెలిసిందే. ఇది ఎవరూ ఊహించని రీతిలో సాగుతోందని తెలిసింది. ఉన్న ఎనిమిది మందిలో పాపులారిటీ ఎక్కువగా ఉన్న విష్ణుప్రియ టాప్‌లో ఉండగా.. సాదాసీదా కంటెస్టెంట్ అయిన నాగ మణికంఠ కూడా భారీ ఓటింగ్ సాధిస్తూ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
వీళ్లంతా దాదాపుగా సేఫ్‌నే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మూడో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో విష్ణుప్రియ భీమనేని, మణికంఠ ప్రస్తుతానికి మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత మాత్రం మార్పులు కనిపిస్తున్నాయి. తాజా ఓటింగ్ ప్రకారం.. నైనిక మూడో స్థానంలో, సీత నాలుగో స్థానంలో, ప్రేరణ ఐదో స్థానంలో ఉన్నారు. ఈ ఓటింగ్ కంటిన్యూ అయితే వీళ్లంతా ఈ వారం సేఫ్ అయినట్లే.
బిగ్ బాస్ ట్విస్ట్‌తో బుక్
మూడో వారం ఓటింగ్‌లో ఆరో స్థానంలో యష్మీ గౌడ ఉంది. అలాగే, ఏడో స్థానంలో పృథ్వీరాజ్, ఎనిమిదో స్థానంలో అభయ్ ఉన్నారు. అంటే.. ఈ ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే చెప్పాలి. ఇందులో మాత్రం అభయ్ కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కారణం ప్రభావతి 2.O టాస్కులో అతడు ఏమాత్రం ప్రభావం చూపకపోవడమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











