Bigg Boss: 3వ వారం మైండ్ బ్లాక్ ఓటింగ్.. టాప్‌లో ఊహించని కంటెస్టెంట్.. బిగ్ బాస్ ట్విస్ట్‌తో అతడు బుక్
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'.. రొమాన్స్, లవ్, ఏడుపులు అన్నింటి కంటే ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య గొడవలతో రంజుగా సాగుతోంది. గత సీజన్లతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఇందులో చాలా మంది కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ ఫైటింగ్‌లు జరుగుతున్నాయి. ఫలితంగా సీజన్ -8లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మూడో వారం నామినేషన్స్ ముగిసిన తర్వాత ఓటింగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా మొదలైంది. దానికి సంబంధించిన వివరాలను మీరే చూసేయండి మరి!
మంచి రెస్పాన్స్‌తో రన్
బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు రన్ అయినా సక్సెస్ అవుతూనే ఉంటోంది. అందుకే ఏడు సీజన్లను ఒకదానికి మించి ఒకటి భారీ రేటింగ్‌తో సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న 8వ సీజన్ కూడా విజయవంతంగా నడుస్తోంది. ఇందులో ఎన్నో ట్విస్టులు ఉండడంతో పాటు విభిన్నమైన కంటెంట్ చూపించడంతో ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

14 మందిలో ఆ ఇద్దరు
ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లలో మొదటి వారం జరిగిన ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయిపోయారు.
ఈ 8 మంది నామినేట్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మూడో వారంలో జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో కూడా చాలానే గొడవలు జరిగాయి. ఇందులో కొందరు పర్సనల్ ఎటాక్ కూడా చేసుకున్నారు. ఇలా మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఈ వారం నామినేట్ అయిపోయారు. వారిలో అభయ్, విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, యష్మీ గౌడ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ, నైనికలు నామినేట్ అయ్యారు.
మైండ్ బ్లాక్.. వాళ్లిద్దరే
నామినేషన్స్ టాస్క్ ఒక్కరోజులోనే పూర్తి కావడంతో ఎనిమిదో సీజన్ మూడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియను సోమవారం రాత్రి నుంచి మొదలెట్టారు. ఇది మైండ్ బ్లాక్ అయ్యేలా సాగుతోందని తెలిసింది. ఎందుకంటే ఈ సారి విష్ణుప్రియ టాప్‌లో ఉండగా.. తక్కువ ఫాలోయింగ్‌తో షోలోకి వచ్చిన కంటెస్టెంట్ అయిన నాగ మణికంఠ రెండో స్థానంలో కొనసాగుతుండడమే.
తర్వాత ఉన్నది వీళ్లే
ఎనిమిదో సీజన్ మూడో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో విష్ణుప్రియ భీమనేని, మణికంఠ ప్రస్తుతానికి టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం మార్పులు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. కిర్రాక్ సీత మూడో స్థానంలో, నైనిక నాలుగో స్థానంలో, యష్మీ గౌడ ఐదో స్థానంలో ఉన్నారు. ఈ ఓటింగ్ కంటిన్యూ అయితే వీళ్లంతా ఈ వారం సేఫ్ అయిపోతారు.
బిగ్ బాస్ ట్విస్ట్‌తో బుక్
మూడో వారం ఓటింగ్‌లో ప్రస్తుతం ఆరో స్థానంలో ప్రేరణ ఉంది. అలాగే, ఏడో స్థానంలో పృథ్వీరాజ్, ఎనిమిదో స్థానంలో అభయ్ ఉన్నారు. అంటే.. ఈ ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా.. చీఫ్ అయిన అభయ్ తాజా నామినేషన్స్‌లో నిఖిల్ కోసం త్యాగం చేసి సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఇప్పుడు అదే అతడి కొంప ముంచేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











