Bigg Boss Elimination: 2వ వారం దిమ్మతిరిగే ఓటింగ్.. డేంజర్‌ జోన్‌లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా హిందీలో ఎప్పుడో మొదలై.. తెలుగులో ఆలస్యంగా వచ్చినా సూపర్ డూపర్ హిట్ అయిన షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టే అయినా మన ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, ఇటీవలే ఎనిమిదోది కూడా ప్రారంభం అయింది. ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో వారంలో ఊహించని ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

గతంలో కంటే భిన్నంగానే
తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. తక్కువ సమయంలోనే బిగ్ బాస్ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని టాప్ షోగా మారిపోయింది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇటీవలే ఎనిమిదో సీజన్‌ను మొదలు పెట్టారు. దీన్ని గతంలో ఎన్నడూ చూపించని సరికొత్త టాస్కులతో నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో వినోదాన్ని ఇస్తున్నారు.

Bigg Boss Telugu 8 Elimination Prithviraj and Kirrak Seetha Entered into Danger Zone In 2nd Week

14 మందిలో ఆమె అవుట్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లలో మొదటి వారం జరిగిన ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు.

నామినేషన్‌లో 8 మంది
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి రెండో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో చాలా గొడవలు కనిపించాయి. దీంతో ఇది రెండు రోజులు సాగింది. ఇందులో మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయిపోయారు. వారిలో నిఖిల్, విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, శేఖర్ బాషా, నైనికలు నామినేట్ అయ్యారు.

డిఫరెంట్‌గా.. వాళ్లే టాప్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రెండో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి నుంచి మొదలైంది. ఇది ఎంతో డిఫరెంట్‌గా సాగుతున్నట్లు తెలిసింది. గత వారం మొత్తంలో విష్ణుప్రియ భీమనేని టాప్‌లో ఉండగా.. ఈ వారంలో మాత్రం నిఖిల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఫలితంగా ఆమె రెండో స్థానంలో ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.

సేఫ్ అయ్యే వారు ఎవరు
రెండో వారంలో జరిగిన ఓటింగ్‌లో నిఖిల్, విష్ణుప్రియ భీమనేని ప్రస్తుతానికి టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. నాగ మణికంఠ మూడో స్థానంలో, నైనిక నాలుగో స్థానంలో, శేఖర్ బాషా ఐదో స్థానంలో ఉన్నారు. ఈ వారం వీళ్లంతా సేఫ్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

డేంజర్ జోన్‌లో ముగ్గురు

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రెండో వారానికి సంబంధించి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతం ఆరో స్థానంలో ఆదిత్య ఓం ఉన్నాడు. అయితే, అతడి కంటే తక్కువగా అంటే ఏడు, ఎనిమిది స్థానాల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన పృథ్వీరాజ్, కిర్రాక్ సీతలు ఉన్నారు. అంటే, ఈ ముగ్గురిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో ఎలాంటి మార్పు కనిపించకపోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X