Bigg Boss Telugu 8 Voting: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఓటింగ్.. డేంజర్‌ జోన్‌లో ఇద్దరు, నిఖిల్ చేతుల్లోనే ఎలిమినేషన్!

బిగ్‌బాస్ తెలుగు 8 ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మూడో వారం నాటికి కంటెస్టెంట్స్‌కు ఆటపై అవగాహన రావడంతో అంతా ఇరగదీస్తున్నారు. శేఖర్ భాషా ఎలిమినేషన్ కావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న టెన్షన్ నెలకొంది. ఈ వీక్ ఇంటి సభ్యులంతా బాగానే ఆడుతున్నారు. ఎమోషన్స్, టాస్క్‌లు, డిస్కషన్స్ ఊపందుకున్నాయి. అలాంటి సమయంలో ఎవరిని బిగ్‌బాస్ ఇంటికి పంపుతారోనని ఆడియన్స్ ఎగ్జయిటింగ్‌తో ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ ఒకసారి పరిశీలిస్తే :

అనూహ్య పరిణామాల మధ్య ఆర్జే శేఖర్ భాషా హౌస్‌ను వీడాడు. బిగ్‌బాస్ సీజన్ 8లోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ అని చెబుతూ.. ఓటింగ్‌లో బాటమ్‌లో ఉన్న ఆదిత్య ఓం, శేఖర్ భాషాలలో ఎవరు ఇంట్లో ఉండాలో, ఎవరు బయటికి వెళ్లాలో డిసైడ్ చేసే పవర్ ఇంటి సభ్యులకే ఇచ్చారు. అలా హౌస్‌మెట్స్ ఓటింగ్‌ను బట్టి శేఖర్ భాషాను ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు నాగార్జున. మూడో వారం నామినేషన్స్ మునుపెన్నడూ లేనివిధంగా జరిగాయి. సిల్లీ రీజన్స్ కాకుండా ఓ పాయింట్ ప్రకారం కంటెస్టెంట్స్ వ్యవహరించారు. మొత్తంగా ఈ వారం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో విష్ణుప్రియ, నాగ మణికంఠ, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, సీత, అభయ్, నైనిక ఉన్నారు. రెండు వారాల పాటు చీఫ్‌గా పెత్తనం చేసిన యష్మీ తొలిసారి నామినేషన్స్‌లో నిలవడం విశేషం.

bigg boss telugu 8 elimination prithviraj and nainika entered into danger zone in 3rd week

ఈసారి సోమవారమే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. దీని వల్ల కంటెస్టెంట్స్‌కు సరైన విధంగా ఓట్లు పడతాయని అంటున్నారు. మధ్యలో టాస్క్‌లు, బిహేవియర్‌ పరంగా కంటెస్టెంట్స్ ఏమాత్రం సత్తా చాటినా వాళ్ల ఓటింగ్ బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఓటింగ్ విషయానికి వస్తే.. గడిచిన మూడు వారాల మాదిరిగానే విష్ణుప్రియ టాప్‌లో కొనసాగుతోంది. అమాయకత్వంతో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే విష్ణుకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఈ సీజన్ విన్నర్ ఆమె అన్నంతగా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.

నాగ మణికంఠ కూడా ఓటింగ్ బాగా మెరుగుపరచుకున్నాడు. తొలుత ఎమోషనల్ డ్రామా ప్లే చేసినా తర్వాత మాత్రం ఆటలో దూకుడు పెంచాడు. గత వారం డేంజర్ జోన్‌లో ఉన్న సీత ఈ వారం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఓటింగ్‌లో థర్డ్ ప్లేస్‌లోకి వచ్చిందని అంటున్నారు. ప్రేరణ ఫోర్త్ ప్లేస్‌లో ఉండగా.. ది గ్రేట్ చీఫ్‌గా వెలిగిపోయిన యష్మీ గౌడ అనూహ్యంగా ఓటింగ్‌లో దిగజారిపోయింది. తన యాటిట్యూడ్ , కర్ర పెత్తనంతో జనాల చేత ఛీకొట్టించుకుంది. ఆ తర్వాతి స్థానంలో నైనిక, అభయ్ నవీన్, పృథ్వీ ఉన్నారు.

మొత్తంగా చూస్తే ఈ వారం నైనిక, అభయ్, పృథ్వీలు డేంజర్ జోన్‌లో ఉన్నారు. పృథ్వీ ఫస్ట్ వీక్ నుంచి ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉంటున్నాడు. కానీ బిగ్‌బాస్ సొంత స్క్రిప్ట్‌ వర్కవుట్ చేస్తుండటంతో బతికిపోతున్నాడు. వయసులో పెద్దవారు ఇంటిని వీడాలనే కాన్సెప్ట్ ఉన్నా.. ఈ వీక్ ఆదిత్య ఓం నామినేషన్స్‌లో లేడు. కాబట్టి.. నైనిక, అభయ్, పృథ్వీలలో ఒకరు హౌస్‌ను వీడాల్సి ఉంటుంది. నైనిక నిలబడటానికి ఒక్క టాస్క్ చాలు. ఏటోచ్చి పృథ్వీ పరిస్ధితే డైలమాలో ఉంది. అయితే నిఖిల్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన స్పెషల్ గుడ్డు సాయంతో ఒకరిని నామినేషన్స్ నుంచి కాపాడవచ్చు. మరి ఆయన రుణం తీర్చుకోవాలని అనుకుంటే తన కోసం సెల్ఫ్ నామినేట్ అయిన అభయ్‌ని రక్షిస్తాడని నెటిజన్లు భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతోందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X