Bigg Boss Voting: 4వ వారం ఊహించని ఓటింగ్.. బిగ్ బాస్ ముద్దుబిడ్డకు షాక్.. టాప్‌లో యంగ్ సెన్సేషన్
తెలుగు టెలివిజన్‌పై రకరకాల కాస్సెప్టులతో షోలు ప్రసారం అవుతున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి భారీ స్పందన దక్కింది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగో వారం ఓటింగ్ ఎలా నడుస్తుందో చూద్దాం పదండి మరి!
మరింత వినోదం పంచేలా
బిగ్ బాస్ షోలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తుంటాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు, గ్రూపులు, రొమాన్స్, లవ్‌తో పాటు బాధలు ఇలా అన్ని రకాల సన్నివేశాలను చూపిస్తుంటారు. ఇక, ఇప్పుడు జరుగుతోన్న ఎనిమిదో సీజన్‌లో వాటిని ఇంకాస్త ఎక్కువగా చూపిస్తున్నారు. ఫలితంగా ఇది ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ఈ సీజన్‌కు రెస్పాన్స్ కూడా బాగానే లభిస్తోంది.

14 మందిలో ముగ్గురు ఔట్
తాజా సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లలో తొలి వారం జరిగిన ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా, మూడో వారంలో అభయ్ వెళ్లిపోయారు.
4వ వారం ఆరుగురు బలి
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ నాలుగో వారంలో జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో కూడా ఎన్నో ఆసక్తికరమైన వాగ్వాదాలే జరిగాయి. ఇందులో కొందరు క్యారెక్టర్ల గురించి కూడా మాట్లాడి రెచ్చిపోయారు. ఇలా మొత్తం ఆరుగురు సభ్యులు ఈ వారం నామినేట్ అయిపోయారు. వారిలో నబీల్, సోనియా ఆకుల, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణలు ఉన్నారు.
టాప్‌లో యంగ్ సెన్సేషన్
నామినేషన్స్ టాస్క్ ఒక్క ఎపిసోడ్‌కే పరిమితం కావడంతో ఎనిమిదో సీజన్ నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియను సోమవారం రాత్రి నుంచి ప్రారంభించారు. ఇది ఎవరూ ఊహించని విధంగా సాగుతున్నట్లు తెలిసింది. లేటెస్ట్ ఇన్పో ప్రకారం.. ఈ ఓటింగ్‌లో యంగ్ సెన్సేషన్ నబీల్ అందరి కంటే ఎక్కువ ఓట్లను సాధిస్తూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడట.

తర్వాత ఎవరు ఉన్నారు
ఎనిమిదో సీజన్ నాలుగో వారంలో జరుగుతున్న ఓటింగ్‌లో నబీల్ మొదటి స్థానంలో ఉండగా.. అతడి తర్వాత నాగ మణికంఠకు ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నట్లు తెలుస్తోంది. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం మార్పులు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రేరణ మూడో స్థానంలో, ఆదిత్య నాలుగో స్థానంలో ఉన్నారు. మరి ఈ ఓటింగ్ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి.
ముద్దుబిడ్డకు షాకిచ్చేలా
నాలుగో వారం ఓటింగ్‌లో ప్రస్తుతం ఐదో స్థానాలో పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు. అలాగే అందరి కంటే చివర్లో అంటే ఆరో స్థానంలో సోనియా ఆకుల ఉంది. బిగ్ బాస్ ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు చాలా తక్కువ ఓట్లతో చివరి స్థానానికే పరిమితం అయిపోయింది. అయితే, ఓటింగ్‌కు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఈమె సేఫ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











