Bigg Boss Elimination: తొలి వారమే షాకింగ్ ఓటింగ్.. వీక్ కంటెస్టెంట్ టాప్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే!
తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని షోగా.. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ప్రేక్షకులను మజాను పంచుతోంది బిగ్ బాస్. ఎంటర్‌టైన్‌మెంట్‌కు హద్దులు ఉండవని నిరూపించిన ఇది.. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని టీఆర్పీ రేటింగ్‌తో నేషనల్ టాప్ షోగా నిలిచింది. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఎనిమిదోది కూడా గత ఆదివారమే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8వ సీజన్ మొదటి వారం జరుగుతున్న ఓటింగ్ లీక్ అయింది. ఇందులో ఎవరెవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో మీరే చూడండి మరి!
ప్రయోగాలు చేస్తూ సరికొత్తగా
తెలుగులో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన స్పందనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే ఇది ఇప్పటికే ఎన్నో సీజన్లను టాప్ రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే నిర్వహకులు గత ఆదివారం ఎనిమిదో దాన్ని కూడా స్టార్ట్ చేశారు. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్టుతో వస్తున్న ఈ సీజన్‌లో ఎన్నడూ చూడని సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

14 మందే.. వాళ్లు వస్తారంటూ
ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లతో పాటు మరికొందరు సెలెబ్రిటీలు కూడా వస్తారని చెప్తున్నారు.
నామినేషన్‌లో ఈ ఆరుగురు
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి సీజన్‌లో మొదటి వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో చాలా గొడవలు కనిపించాయి. దీంతో ఇది రెండు రోజులు సాగింది. ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయిపోయారు. వారిలో విష్ణుప్రియ, సోనియా, బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్, శేఖర్ బాషాలు నామినేట్ అయ్యారు. మిగిలిన వాళ్లంతా సేఫ్ అయిపోయారు.
ఫస్ట్ వీక్‌లోనే షాకింగ్ ఓటింగ్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ బుధవారం రాత్రి నుంచి మొదలైంది. ఇది ఎంతో ఆసక్తికరంగా, షాకింగ్‌గా సాగుతున్నట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ విష్ణుప్రియ టాప్‌లో కొనసాగుతుంది. ఆమె తర్వాత వీక్ కంటెస్టెంట్‌గా పేరొందిన మణికంఠ ఉన్నాడు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎవరు ఏ స్థానంలో ఉన్నారు
మొదటి వారంలో జరిగిన ఓటింగ్‌లో విష్ణుప్రియ భీమనేని, నాగ మణికంఠ ప్రస్తుతానికి టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగుతునట్లు తెలిసింది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ మూడో స్థానంలో, శేఖర్ బాషా నాలుగో స్థానంలో ఉన్నారు. వీళ్లిద్దరూ దాదాపుగా సేఫ్ అయినట్లే అని చెప్పాలి.
వాళ్లిద్దరూ డేంజర్ జోన్‌లోనే
మొదటి వారానికి సంబంధించి జరుగుతున్న ఓటింగ్‌లో పెద్దగా ఫాలోయింగ్ లేని సోనియా ఆకుల ఐదో స్థానంలో, బెజవాడ బేబక్క ఆరో స్థానంలో ఉండి డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అంటే వీళ్లిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే రాను రానూ ఈ ఓటింగ్‌లో మార్పులు వస్తే ఎలిమినేషన్ కూడా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











