Bigg Boss Telugu 8: షాకింగ్ ఎలిమినేషన్.. పృథ్వీకి బదులు మణికంఠ అవుట్! కారణమదేనా?
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ సీజన్ 8లో ఏడో వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ వారం హౌస్ నుంచి మణికంఠ ఎలిమినేట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఓటింగ్ పరంగా మణికంఠ స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఈ ఏడు వారాల ఆటలో మణికంఠ ఏకంగా ఆరు సార్లు నామినేట్ అయ్యాడు. అయినా.. అతని గేమ్ నచ్చిన ప్రేక్షకులు ఓట్లు వేసేస్తున్నారు. కానీ, ఈ వారం తక్కువ ఓట్లు ఉన్న పృథ్వీని కాకుండా నాగ మణికంఠను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. నాగమణికంఠను ఎలిమినేట్ చేయడానికి కారణమేంటీ? అసలేం జరిగిందో ఓ లూక్కేద్దాం..
తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరూ ఊహించని ఘటనలు, కంటెస్టెంట్లనే కాదు.. ఆడియన్స్ కూడా దిమ్మతిరిగే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. గత సీజన్లో లేని విధంగా ఈ సీజన్ లో డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 8 మంది కంటెస్టెంట్స్ రావడం, మిడ్ వీక్ ఎలిమినేషన్లు.. ఇలా ఎన్నో షాకింగ్ కంటెంట్ ను ఇచ్చారు బిగ్బాస్. ఇలా బిగ్ బాస్ షోపై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. గత సీజన్లో ఎప్పుడు చూడని కంటెంట్ ఇస్తుండటంతో ఈ షోకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇలా రసవత్తరంగా సాగుతోన్న ఈ షోలో ఏడో వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది.

ఏడో వారం నామినేషన్లలో గౌతమ్, పృథ్వీ, నిఖిల్, యష్మీ, తేజ, మణికంఠ, నబిల్, హరితేజ, ప్రేరణ ఉన్నారు. ఈ సీజన్ లో మొదటి సారి.. 9 మంది కంటెస్టెంట్స్ ఉండటంతో బిగ్ బాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతివారం లాగానే ఈ వారం కూడా ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న పర్సన్ వెళ్లిపోతున్నారని అందరూ భావించారు. ఓటింగ్ పరంగా చేస్తూ..నిఖిల్ మొదటి స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానంలో నబీల్, మూడో స్థానంలో మణికంఠ ఉన్నారట. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా.. ప్రేరణ, యష్మీ,గౌతమ్ నిలిచారు. ఇక చివరి మూడు స్థానాల్లో టేస్టీ తేజ, హరితేజ, పృథ్వీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈవారం నామినేషన్లలో తక్కువ ఓటింగ్ వచ్చిన పృథ్వి ఎలిమినేట్ అవుతానే ప్రచారం జరిగింది. ప్రతి బిగ్ బాస్ రివ్యూవర్ కూడా ఈ వారం పృథ్వి ఎలిమినేషన్ పక్కా అని చెప్పారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ వారం నాగ మణికంఠ (Naga Manikanta) ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. సమాచారం ప్రకారం మణికంఠ తనకు తానే స్వయంగా హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్టు సమాచారం.
మణికంఠ (Naga Manikanta)ఈ వారం ప్రారంభం నుంచే కాస్త డల్ గా ఉన్నాడని చెప్పాలి. తనుకు ఏమైనా జరిగితే..తన ఫ్యామిలీకి కష్టమనీ, తాను ఆడలేనని చెప్పడం. ఈ వారం ఎలిమినేట్ అయిపోయినా ఫర్లేదు అంటూ ఫిజికల్ ట్కాసులకు దూరంగా ఉన్నారు. తాను ఫిజికల్ గా వీక్ గానీ, మెంటల్ గా వీక్ కాదంటూనే.. ఇతర కంటెసెంట్లతో తనకు హౌస్ నుంచి వెళ్లిపోవాల్సి వస్తోంది చెప్పడం. ఈ వారం షూటింగ్ సయమంలో కూడా తనకు తానుగా వెళ్లిపోతానని నాగార్జునను అడిగాడని టాక్ నడుస్తోంది.
మరోవైపు.. ఇన్ని వారాలు ఆట సరిగా ఆడినా ఆడకపోయినా మణికంఠ సింపథీ ఓట్లతో హౌస్ లో ఉంటున్నాడనీ, కానీ, ఈ వారం కావాలని అందరితో గొడవ పెట్టుకోవడం, ఫిజికల్ టాస్కులు ఆడకుండా సైలెంట్ గా కూర్చోవడం, తనకు తానే వీక్ అని ఒప్పేసుకోవడం, తానే హౌస్ నుంచి వెళ్లిపోతాననీ, మైండ్, హార్ట్ ఏం బాలేదు అంటూ ఇతర కంటెస్టెంట్లకు చెప్పడం .. ఇవన్నీ కారణాలతో ప్రుద్వీని కాకుండా.. మణికంఠను ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదిమైనా.. మణికంఠ ఎలిమినేట్ .. షాకింగ్ ఎలిమినేషనే.


Click it and Unblock the Notifications











