Bigg Boss Telugu 8 Elimination: బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ ఉంటుందా? ఉంటే ఆ కంటెస్టెంట్‌ ఇంటికేనా?

బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షోను హోస్ట్ నాగార్జున అక్కినేని ఘనంగా మొదలుపెట్టారు. అయితే తొలి రోజు నుంచే ఇంటి సభ్యులు మధ్య బిగ్‌బాస్ చిచ్చు పెట్టి తమాషా చూస్తున్నాడు. ఆ చిచ్చుతో ఇంటిలో సభ్యులు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. అయితే ఈ సీజన్ కంటెస్టెంట్స్‌లో మణికంఠ ఆటతీరు, వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. అయితే ఈ వారం నామినేషన్స్ తర్వాత ఎలిమినేషన్స్ ఉంటాయా? మణికంఠ ఎలిమినేషన్ నుంచి తప్పించుకొంటాడా? అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగులో ఏదో రకంగా మణికంఠ తన ఉనికికి గట్టిగా పునాది వేసుకొన్నాడు. ఆట మొదలైన తొలి గంటలోనే ఆయనను కంటెస్టెంట్ల అందరి చేత ఎలిమినేషన్‌కు ఓటింగ్ చేయించి ట్విస్టు ఇచ్చారు. దాదాపు ఇంటి నుంచి బయటకు వెళ్తాడా అనే రేంజ్‌లో టెన్షన్ పెట్టిన బిగ్‌బాస్.. ఇదంతా ప్రాంక్ అని తెల్చేశాడు.

Bigg Boss Telugu 8 Elimination Will Manikantha escape from exit of first week threat

అయితే బిగ్‌బాస్ ఆడిన ఆటలో కంటెస్టెంట్లందరూ పావులగా మారిపోయారు. ఆయన ట్రాప్‌లో పడి వాగ్వాదం పెట్టుకొన్నారు. కంటెస్టెంట్ల మధ్య జరిగిన నామినేషన్ల రచ్చ ఆయన ఆడిన నాటకంలో భాగమయ్యారని అనే ఫీలింగ్ కలిగించింది.

అయితే ఈ వారం ఆటలో మణికంఠ తన విషాద జీవిత గాథను ప్రపంచానికి చెప్పి సానుభూతిని సాధించేందుకు ప్రయత్నించారా? అనే అనుమానం కలిగింది. అయితే కొందరు మాత్రం ఆయన లైఫ్ స్టోరి విని మాత్రం పాజిటివ్‌గా స్పందించారు. అయితే అది ఆయనకు పాజిటివ్ అవుతుందా? లేదా నెగిటివ్ అవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.

నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అందరూ మణికంఠనే టార్గెట్ చేశారు. దాంతో ఈ సారి ఆయన తప్పకుండా ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఉంటారనే ఫీలింగ్ కలిగింది. అయితే తొలివారం ఎలిమినేషన్ పెడుతారా? పెడితే ఆ వేటు నుంచి మణికంఠ తప్పించుకొంటాడా? అనేది ప్రస్తుతం అభిమానుల్లో చర్చ భారీగా జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X