Bigg Boss Elimination: 3వ వారం దిమ్మతిరిగే ఓటింగ్.. ఆ స్ట్రాంగ్ లేడీకి షాక్.. ఎలిమినేట్ ఎవరంటే!
భారతదేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతూ... అన్ని చోట్లా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. అయితే, అన్నింటి కంటే ఎక్కువగా తెలుగులో రన్ అవుతోన్న షోకు మాత్రమే మద్దతు దక్కుతోంది. అందుకే మన దానికి మాత్రమే ఊహించని రీతిలో రేటింగ్ దక్కుతోంది. దీంతో వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్ మరింత రంజుగా మారుతోంది. ఈ నేపథ్యంలో మూడో వారంలో ఇంటి నుంచి ఏ కంటెస్టెంట్ వెళ్లిపోతున్నారు అనే దానిపై వివరాలు చూద్దాం పదండి!
అంతులేని వినోదం ఇచ్చేలా
అన్ని భాషల కంటే తెలుగులో వచ్చే బిగ్ బాస్ షోపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. అందుకే నిర్వహకులు కొత్త కొత్త కాన్సెప్టులతో వస్తున్నారు. ఇలా ఇప్పుడు 'అంతులేని వినోదం'తో ఎనిమిదో దాన్ని నడుపుతున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూపించని కొత్త కంటెంట్ చూపిస్తున్నారు. అలాగే ట్విస్టులు, షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు, టాస్కులు వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు.

2 వారాల్లో వాళ్లు ఎలిమినేట్
తాజాగా ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్‌లోకి విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్లలో మొదటి వారంలో బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయిపోయారు.
మూడో వారంలో 8 మందితో
బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కుపై అందరి కళ్లు ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే ఎనిమిదో సీజన్‌లో సైతం ఈ టాస్కుకు భలే రంజుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మూడో వారంలో ఇది హై రేంజ్‌లో జరిగింది. ఇలా ఈ వారంలో అభయ్ (సెల్ఫ్ నామినేట్), విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, యష్మీ గౌడ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ, నైనికలు నామినేట్ అయ్యారు.
వాళ్లిద్దరూ టాప్ లేపేశారుగా
గత సీజన్లతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఎనిమిదో దానిలో భారీ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లు తక్కువ మందే ఉన్నారు. అందులో విష్ణుప్రియ ఒకరు. అందుకే ఈ అమ్మడు తాజా ఓటింగ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అయితే, ఆమె తర్వాత మాత్రం అనామక కంటెస్టెంట్ నాగ మణికంఠ ఉన్నారు. వీళ్లిద్దరూ మూడో వారంలో టాప్ 2గా నిలిచి సేఫ్ అయిపోయారు.
మారిన స్థానాలు.. ఫైనల్‌గా
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మూడో వారంలో జరిగిన ఓటింగ్‌లో విష్ణుప్రియ భీమనేని, మణికంఠ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. వీళ్ల తర్వాత మాత్రం కంటెస్టెంట్ల స్థానాల్లో మార్పులు కనిపించాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. నైనిక మూడో స్థానంలో, ప్రేరణ నాలుగో స్థానంలో, పృథ్వీరాజ్ ఐదో స్థానంలో ఉన్నారు. ఈ వారం కూడా వీళ్లంతా దాదాపుగా సేఫ్ అయిపోతారు.
ఎలిమినేషన్ ఎవరంటే
ఎనిమిదో సీజన్ మూడో వారం ఓటింగ్‌లో ఆరో స్థానంలో కిర్రాక్ సీత ఉంది. అలాగే, ఏడో స్థానంలో యష్మీ గౌడ, ఎనిమిదో స్థానంలో అభయ్ ఉన్నారు. అంటే.. ఈ ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే చెప్పాలి. ఇందులో మాత్రం అభయ్ ఈ వారం ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే మిగిలిన ఇద్దరి వల్ల షోలో కంటెంట్ వస్తుంది. దీంతో వాళ్లను పంపే సాహసం చేయరు.


Click it and Unblock the Notifications











