పెళ్లై పిల్లలున్న వ్యక్తితో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమాయణం.. రహస్యంగా ఎంగేజ్మెంట్
Bigg Boss Telugu 8: సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బజాలు మోగుతున్నాయి. నటులు, నటీమణులు లేదా మూవీ మేకర్స్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తమకు నచ్చిన వారితో ఒక్కటై.. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. ఇటీవల డైరెక్టర్ క్రిష్ సైలెంట్ రెండవ మ్యారేజ్ చేసుకోగా.. గత వారం గాయని రమ్య బెహారా తన తోటి గాయకుడు అనురాగ్ కులకర్నిని సీక్రెట్ గా ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లల పెళ్లి కూడా డిసెంబర్ 4న జరగనుంది. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరోయిన్ పెళ్లికి సిద్దమైంది. తాజాగా తన ప్రియుడుతో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు? మీరు కూడా ఓ లూక్కేయండి.
పెళ్లికి సిద్దమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో కాదు.. తెలుగు హీరోయిన్, బిగ్ బాస్ ఆడపులి సోనియా ఆకుల. యాంకర్‌గా, నటిగా గుర్తింపు పొందిన ఆకుల సోనియా బిగ్‌బాస్ 8వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన సోనియా 2019లో 'జార్జి రెడ్డి' మూవీ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. జార్జి రెడ్డి నిజ జీవిత కథగా తెరకెక్కిన సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'దిశా ఎన్కౌంటర్' మూవీలో సోనియా ఆకుల నటించింది.

ఆ తరువాత మళ్లీ ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన 'కరోనా వైరస్ 'మూవీలో నటించింది. 2020లో కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో అనే కాన్సెప్ట్ లో ఈ సినిమా వచ్చింది. కానీ సినిమాకు పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ, ఆర్జీవీ హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది.ఆమె సినిమాల్లో నటించడం కాదు.. ఆమె సోషల్ వర్కర్ గా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం అందిపుంచుకుంది.
కానీ, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సోనియా అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది. మేల్ కంటెస్టెంట్స్ తో సన్నిహితంగా ఉండటంతో సోనియా ఆకుల ప్రవర్తన వివాదాస్పదం మారింది. మెయిన్ నిఖిల్, పృథ్విలతో ఆమె అత్యంత సన్నిహితంగా ఉండటంతో వీరి మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. పలు మార్లు సోనియా గేమ్ పై హోస్ట్ నాగార్జున కూడా అసహనం వ్యక్తం చేశాడు.అదే సమయంలో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న సోనియా.. నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది.

కానీ, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక షో నిర్వాహకులపై సోనియా ఫైర్ అయ్యారు. నన్ను చాలా తప్పుగా చూపించి, తన క్యార్టెక్టర్ ను తప్పుగా చూపించారని ,ఇన్నేళ్లు కష్టపడి సంపాదించున్న గౌరవం అంతా పోయింది భాధపడింది. హౌస్ లో నిఖిల్, పృథ్విలను తాను బ్రదర్స్ చూసుకున్నాననీ, కానీ తనని కావాలని బ్యాడ్ గా చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేసి విషయం తెలిసిందే.
ఇదెలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 8 సంచలన కంటెస్టెంట్‌గా హౌస్‌లో అల్లాడించిన సోనియా ఆకుల త్వరలో ఇల్లాలు కాబోతుంది. తన ప్రియుడు యష్‌ని పెళ్లి చేసుకోబోతుంది. యష్, సోనియాలు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. నవంబర్ 21వ తేదీన యశ్, సోనియా నిశ్చితార్థ వేడుక జరిగింది. కొద్దిమంది మాత్రమే బంధుమిత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే సోనియా చేసుకోబోయే యశ్‌కు గతంలోనే వివాహమై విడాకులు తీసుకున్నారట. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం యశ్, సోనియా నిశ్చితార్థ ఫొటోలు వైరల్ అవుతాయి.


Click it and Unblock the Notifications











