Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అతనే... ఆ ఒక్క లీక్‌తో క్లారిటీ!
Bigg Boss Season 8 Winner: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులు, మలుపులతో ఈ సీజన్ రసవత్తరంగా సాగింది. దీంతో ఈ షో టాప్ టిఆర్పి దూసుకెళ్లోంది. సక్సెస్ పుల్ గా సాగుతున్న ఈ రియాల్టీ షో చివరి అంకానికి చేరుకుంది.ఈ షో రేపటితో ముగిసిపోతుంది. అయితే ఈ తరుణంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8
విన్నర్ ఎవరో? రన్నర్ ఎవరో? అనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ షోలో తొలుత 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. ఆ తర్వాత ఎనిమిది మంది కంటెస్టెంట్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ప్రతి కంటెంట్ తనకు సాధ్యమైనంతవరకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ బిగ్ బాస్ లవర్స్ ను మెప్పించారు. ఇలా దాదాపు 105 రోజులు సాగిన బిగ్ బాస్ తెలుగు 8 ప్రయాణం రేపటితో ముగియనున్నది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న హట్టహాసంగా నిర్వహించబోతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 8 లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న.. చివరికి ఐదురుగు మాత్రం గ్రాండ్ ఫినాలే లో చోటు దక్కించుకున్నారు. అయితే టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబిల్, అవినాష్ లు నిలిచారు. ఇందులోని ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వడానికి, టైటిల్ ను కైవసం చేసుకోవడానికి హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ విన్నర్ గా నిలువాలని భావిస్తున్నారు.
అయితే ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలప్రకారం అతడే బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇంతకీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరంటే? ప్రారంభం నుండి నిఖిల్ పై చాలామందికి హోప్స్ ఉన్నాయి. అతడి ఆట తీరు, లీడర్షిప్ క్వాలిటీస్ బిగ్ బాస్ ప్రేక్షకులను మెప్పించాయి. అందుకే నిఖిల్ టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచారు. ఇక గౌతమ్ విషయానికొస్తే.. అశ్వద్వామ బ్యాక్ అంటూ గత సీజన్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ప్రతిచోటా పోటీ పడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఎన్నో టాస్క్ లలో విజయాన్ని సాధించి, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక నబిల్ విషయానికొస్తే.. ఈ ఓరుగల్లు పోరడు యూట్యూబర్ గా బిగ్బాస్ లోకి అడుగు పెట్టాడు. కానీ తన జన్యునిటీ, తన ఆటతీరుతో ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.ఎస్పెషల్లీ నబిల్ నామినేషన్స్ ఈ సీజన్లోనే హైలెట్గా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో అతని కి సంబంధించిన వీడియోలు ఓ రేంజ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇలా బిగ్ బాస్ టైటిల్ రేస్ లో నబిల్ కూడా ఉన్నాడని చెప్పవచ్చు.

ఇక ప్రేరణ తన ముక్కుసూటితనంతో, ఏదైనా స్ట్రైట్ గా చెప్పేస్తుంది ఈ అమ్మడు. ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. ఎలాంటి అవరోధాలైనా ఎదుర్కొంటూ.. ప్రతిఘటిస్తూ దుమ్మురేపుతోందిఈ అమ్మడు. ఇలా టాప్ 5 కంటెస్టెంట్లలో లేడీ కంటెస్టెంట్ నిలిచింది. ఇక నవ్వుల రారాజు అవినాష్. బిగ్ బాస్ షోలో నవ్వుల పువ్వులు పూస్తున్నాయి అంటే దానికి కారణం అవినాష్. ఎవరు ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్లను దెబ్బ కొట్టి.. తనదైన ఆటతీరుతో ప్రశంసలు పొందారు. తొలి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచారు.
ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ చూస్తే.. గౌతమ్, నిఖిల్ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉంది. వీరిద్దరూ టాప్ ప్లేస్ లో దూసుకెళుతున్నారు. వీరిద్దరి మధ్య మొదటి నుండి ఐదో రోజు వరకు స్థానాలలో మార్పులు జరుగుతున్నాయి. ఒకసారి గౌతం టాప్ ప్లేస్ లో ఉంటే.. మరోసారి నిఖిల్ టాప్ ప్లేస్ లో ఉంటున్నారు. ఇలా వీరి మధ్య హోరా హోరగా ఓటింగ్ జరుగుతుంది. సోషల్ మీడియా అనాలసిస్ ప్రకారం. 75% ఓటింగ్ ను నిఖిల్ అండ్ గౌతమ్ షేర్ చేసుకుంటున్నారని సమాచారం.
ఆ తర్వాత స్థానంలో నబీల్, ప్రేరణ, అవినాష్ లు నిలిచారు. సోషల్ మీడియా అండ్ ఇతర అనాలసిస్ ప్రకారం.. బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ గా గౌతమ్ నిలుస్తారని, రన్నర్ గా నిఖిల్ నిలుస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే..ఈ విషయం క్లారిటీ రావాలంటే మాత్రం బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే వరకు వేచి ఉండాల్సిందే.


Click it and Unblock the Notifications











