Bigg Boss Telugu 8: ఆ కోరిక తీరకుండానే గంగవ్వ ఎలిమినేట్..ఈ సీజన్ లో ఎంత సంపాదించిందంటే?

Bigg Boss 8 Telugu Gangavva Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో ఎవరూ ఊహించని ట్విస్టులు, మలుపులు చోటు చేసుకుంటున్నాయి. పదోవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ లవర్స్ కు దిమ్మతిరిగిపోయేలా డబుల్ ఎలిమినేషన్ కు ప్లాన్ చేశారు. ఈ తరుణంలో శనివారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఎవరు ఊహించని విధంగా గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే.. ఈ సీజన్ లో గంగవ్వ ఎంత సంపాదించిందంటే?

బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 9 ఎపిసోడ్‌లో ఎవరూ ఊహించని విధంగా మై విలేజ్ షో ఫేమ్, ఫేమస్ యూబ్యూబర్ గంగవ్వ ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ లవర్స్ షాకింగ్ ఇచ్చింది. ఈ సీజన్ లో నాలుగోవారం వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఈ సీజన్ లో తొలిరోజు నుంచే యంగ్ కంటెస్టెంట్లతో పోటీపడుతోంది. వయసుతో సంబంధం లేకుండా యాక్టివ్ గా ఉంటూ.. తన కామెడి టైమింగ్ తో నవ్వుల పువ్వులను పూయిస్తోంది. యంగ్ కంటెస్టెంట్లకు స్ఫూర్తినిస్తుంది. అవసరమైతే.. కంటెస్టెంట్లను దుమ్ముదులుపుతోంది. బిగ్ బాస్ లవర్స్ కు ఎంటర్టైన్మెంట్ ను అందించింది. అయితే.. గత రెండు వారాలుగా.. ఫిజికల్ టాస్కులు, గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం లేదు.వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

Bigg Boss Telugu 8 Gangavva Eliminated from BB House Remuneration details Full Story Here

బిగ్ బాస్ ఇంట్లో గంగవ్వను కంటెస్టెంట్లందరూ అభిమానిస్తూ.. ఓ అవ్వ లాగా చూసుకుంటున్నారు. ఆమె వయస్సు రీత్యా లేదా ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ద్రుష్ట్యా గంగవ్వను ఎలిమినేట్ చేసే సహాయం ఎవరూ చేయలేదు. ఆమెను నామినేట్ చేస్తే.. తమ ఓటింగ్ కే దెబ్బపడుతుందనే ఇతర కంటెస్టెంట్స్ బాధపడ్డారనే చెప్పాలి. కానీ, గంగవ్వను కంటిన్యూ చేస్తే.. ఆమె ఆరోగ్యానికి, ఇతర కంటెస్టెంట్ల ఆట తీరుపై కూడా ప్రభావం చూపుతుందని బిగ్ బాస్ టీం ఆలోచించినట్టు ఉంది. ఈ తరుణంలో శనివారం ఎపిసోడ్ లో నాగార్జున.. గంగవ్వను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి, ఆమె ఆరోగ్యంపై ఆరా తీసేవారు.

ఈ సమయంలో గంగవ్వ హోస్ట్ నాగార్జునతో మాట్లాడాడు.. తన చేతులకు మంటలు పుడుతున్నాయని, హౌస్ లో ఉండాలని ఉంది. కానీ, తన వల్ల కావట్లేదని, ఎక్కిళ్లు, తేర్పులు తరచుగా వస్తున్నాయని, గత 5 రోజులుగా ఒక పూట భోజనం చేస్తున్న అని గంగవ్వ తన ఆరోగ్య సమస్య చెప్పుకుంది. ఈ సమయంలో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తావా ? అని నాగార్జున అడితే.. ఆరోగ్యం పరిస్థితి సరిగాలేదు అని గంగవ్వ చెప్పింది. గంగవ్వ కోరిక మేరకు ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి పంపిచేయాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నారని, తాను ఎలిమినేట్ అయి వెళ్లిపోతుందని నాగార్జున చెప్పారు. ఇలా గంగవ్వ అనూహ్యంగా ఎలిమినేట్ అయి.. బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయింది.

ఇక గంగవ్వ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. నాలుగో వారం వైల్డ్ కార్డు ద్వారా (అక్టోబర్ 6న) బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. దాదాపుగా 5 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన గంగవ్వ వారానికి రూ. 3.5లక్షల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అంటే..గంగవ్వ రోజుకు సుమారుగా రూ. 50 వేల రెమ్యునరేషన్ అందుకుంది. ఇలా ఐదు వారాల పాటు కొనసాగిన గంగవ్వ.. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా రూ. 17. 50 లక్షలు సంపాదించినట్టు సమాచారం.

బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌లో కూడా గంగవ్వ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఆమె అనారోగ్య కారణాలతోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. ఆ సీజన్ లో ఐదు వారాలు గాను దాదాపు రూ. 10 లక్షల పారితోషికం వచ్చిందని సమాచారం. అలాగే.. గంగవ్వ ఇంటి కోసం నాగార్జున రూ.7 లక్షలు అందించినట్టు టాక్. అయితే.. ఈ సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్లలో నిలువాలని గంగవ్వ భావించింది. కానీ, ఆ కల నెరవేరకూడనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిందని గంగవ్వ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X