Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌ తెలుగులో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ కంటెస్టెంట్ ఎవరు? నాగార్జన లీక్!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 8వ సీజన్ నాలుగు వారాల ఆటను ముగించుకొని 5వ వారంలోకి అడుగు పెట్టింది. తాజా సీజన్‌లో కంటెస్టెంట్ల ఆటతీరు కొంత వివాదాస్పదంగాను, అలాగే ఫన్నీగా, ఫీల్‌గుడ్ అంశాలతో మిక్స్‌డ్ ఎమోషన్స్‌తో ముందుకు కొనసాగుతున్నది. అయితే నాలుగో వారంలో హోస్ట్ నాగార్జున షాకింగ్‌గా ఓ విషయాన్ని లీక్ చేశారు. ఆ విషయం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌ 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభించారు. బెజవాడ బేబక్క, శేఖర్ మాస్టర్, అభయ్, సోనియా ఆకుల, విష్ణుప్రియ, ప్రేరణ, యశ్వీ గౌడ, నిఖిల్, పృథ్వీ, మణికంఠ, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, నైనిక తదితరులు ఇంటిలోకి వచ్చారు. తొలివారం నుంచి తమదైన ఆటతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

Bigg Boss Telugu 8 going to Witness Mid Week Elimination Nagarjuna Akkineni Hints Wild Card Entries

అయితే ఎప్పటిలానే తొలివారం నుంచే బిగ్‌బాస్ ఇంటి నంచి ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. తొలివారం బెజవాడ బేబక్క, రెండోవారం శేఖర్ మాస్టర్, 3వ వారంలో అభయ్ నవీన్, 4 వారం సోనియా ఆకుల ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే సోనియా ఆకుల ఎలిమినేట్ కావడం కొందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తే.. హమ్మయ్య అంటూ కొందరు కామెంట్ చేశారు.

ఇదిలా ఉండగా, నాలుగో వారం ముగింపులో హోస్ట్ నాగార్జున అక్కినేని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ షోలోకి వైల్డ్ కార్డు ద్వారా మరికొంత మంది వస్తున్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంతమందిని తీసుకు రావాలన్నది మీ చేతుల్లోనే.. ఎప్పుడు తీసుకు రావాలన్నది బిగ్‌బాస్ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇంటిలో ఆట తీరును బట్టే వైల్డ్ కార్డులు ఉంటాయి అని చెప్పారు.

Bigg Boss Telugu 8 going to Witness Mid Week Elimination Nagarjuna Akkineni Hints Wild Card Entries

అలాగే 5వ వారంలో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. కాబట్టి నామినేషన్‌లో ఉన్న మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌ కోసం ఓట్లు వేయడం మరిచిపోవద్దు. మీరు వేసే ఓట్ల ప్రకారమే ఏ కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్లాలనేది ఆధార పడి ఉంటుంది అని నాగార్జున చెప్పారు. అయితే ఈ వారం నామినేట్ అయితే మణికంఠ ఎలిమినేట్ కావడం తథ్యం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ అంతా ట్విస్టులు, టర్నులతో సాగుతుందని ముందే హింట్ ఇచ్చారు. అపరిమితమైన వినోదం, ట్విస్టులు ఉంటాయి అని చెబుతూ వస్తూనే వస్తున్నారు. ఆ క్రమంలో వచ్చే వారాల్లో ఈ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీలతోపాటు మరిన్ని మలుపులు ఉంటాయనే స్పష్టంగా అర్ధమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X