Bigg Boss Telugu 8 Grand Finale: తెలుగోడిపై కన్నడ వాడి గెలుపు.. ఇది తెలుగు షోనేనా?
Bigg Boss Telugu 8 Grand Finale: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ముగిసింది. ఎన్నడు లేని విధంగా లిమిట్ లెస్ ట్విస్టులు.. లిమిట్ లెస్ సర్ప్రైజ్ లు.. లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్ తో సాగిన బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేతో ఎండ్ కార్డు పడింది. రసవత్తరంగా సాగిన ఈ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో తెలిసిపోయింది. ఎవరు ఊహించని విధంగా విన్నర్ కాగా నిఖిల్ రన్నర్ గా నిలిచారు.
గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ తేజ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ టైటిల్ నిఖిల్ ను అందుకున్నాడు. అలాగే ప్రైజ్ మనీని రూ. 55 లక్షల రూపాయలను అందుకున్నారు. ఇక ఈ సీజన్ రన్నర్ గా గౌతమ్ ని నిలిచారు.

ఆ తర్వాత నాగార్జున స్వయంగా హౌస్ లోకి గోల్డెన్ బాక్స్ తీసుకుని వెళ్లారు. ఎవరైనా ఒకరు గోల్డెన్ బాక్స్ తీసుకుని ఎలిమినేట్ కమ్మని నిఖిల్, గౌతమ్ ను ఆఫర్ ఇస్తారు. నాగార్జున స్వయంగా ఆఫర్ ఇచ్చినా.. నిఖిల్, గౌతమ్ లు అస్సలు తగ్గలేదు. తాము ప్రేక్షకుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమంటూ నాగార్జున గోల్డ్ బాగ్స్ ఆఫర్ను రిజెక్ట్ చేస్తారు. దీంతో వారిద్దరిని నాగార్జున స్టేజ్ పైకి తీసుకువస్తాడు. గెలుపు ముంగిట్లో నిలిచారని పేర్కొంటాడు.


Click it and Unblock the Notifications











