Bigg Boss Telugu 8 : ‘‘ బిగ్‌బాస్ తెలుగు 8 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్.. ఈసారి వాళ్లు లేకుండానే , బేబక్క వల్లే

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 8 మరికొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి గేమ్ ఎలా ఉండనుంది, ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారనే దానిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రాండ్ లాంచింగ్ రోజున ఎవరెవరు గెస్ట్‌లు రానున్నారు, ఆటాపాటా లాంటి వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బిగ్‌బాస్ తెలుగు 8 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఓ లిస్ట్ బయటకు వదిలాడు . అదేంటో ఒకసారి పరిశీలిస్తే.

ఏడు సీజన్ల మాదిరిగానే ఎనిమిదో సీజన్‌పై నిర్వాహకులు క్యూరియాసిటీ పెంచుతున్నారు. అన్నీ లిమిట్‌లెస్ అంటూ కొంతకాలంగా ప్రోమోలతో ఎగ్జయిట్‌మెంట్ తీసుకొస్తున్నారు. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, ట్విస్టులు, టర్న్‌లకు కొదవ లేదంటున్నారు. దీంతో ఈసారి కొత్త కాన్సెప్ట్ ఏదైనా ట్రై చేస్తున్నారా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ప్రజంట్ తెలుగునాట ఏ ఇద్దరు కలిసినా బిగ్‌బాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎన్నికలు, ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్స్ ముగియడంతో జనాలు అసలు సిసలు వినోదం కోసం వెయిట్ చేస్తున్నారు. అదే బిగ్‌బాస్‌పై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేస్తోంది.

Bigg Boss Telugu 8 Grand Launch Bigg boss telugu 6 Contestant Adi Reddy reveals Bigg Boss Telugu 8 Final Contestants List here s the details

సెప్టెంబర్ 1 సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి బిగ్‌బాస్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. కంటెస్టెంట్స్‌ను హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేయనున్నారు. వారి ఇంట్రడక్షన్‌తో పాటు డ్యాన్స్‌లు, స్పెషల్ పర్ఫార్మెన్స్‌లు కూడా గ్రాండ్‌గా రెడీ చేశారట మేకర్స్. లాంచింగ్ ఎపిసోడ్‌కు ముగ్గురు స్పెషల్ గెస్ట్‌లు రానున్నారు. నేచురల్ స్టార్ నాని, రానా, నివేదా థామస్, ప్రియాంక మోహన్‌లు బిగ్‌బాస్‌ స్టేజ్‌పై సందడి చేయనున్నారు. వీరు అతిథులుగా రావడంతో పాటు హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్‌తోనూ ఇంటరాక్ట్ అవుతారని టాక్.

బిగ్‌బాస్ 8 తెలుగు గ్రాండ్ లాంచింగ్‌కు సంబంధించి నిర్వాహకులు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. గత ఏడు సీజన్‌ల మాదిరిగా కాకుండా ఈసారి మాత్రం ట్విస్టులు భారీగా ఉండే అవకాశం ఉంది. కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారా అన్నది మాత్ంర ఇప్పటి వరకు సస్పెన్స్‌గానే ఉంచారు. తాజా ప్రోమోలోనూ కంటెస్టెంట్స్ ముఖాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ కొన్ని వాయిస్‌లను బట్టి కంటెస్టెంట్స్ ఎవరా అన్నది అభిమానులు గుర్తుపడుతున్నారు. చివరికొచ్చినా ఇంకా సస్పెన్స్ ఎందుకు బ్రదర్ అంటూ కొందరు కామెంట్ పెడుతున్నారు.

Bigg Boss Telugu 8 Grand Launch Bigg boss telugu 6 Contestant Adi Reddy reveals Bigg Boss Telugu 8 Final Contestants List here s the details

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ ఆదిరెడ్డి తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా బిగ్‌బాస్ లాంచింగ్‌పై మినిట్ టూ మినిట్ అప్‌డేట్స్ ఇవ్వనున్నాడని టాక్. దీనిలో భాగంగానే బిగ్‌బాస్ తెలుగు 8 ఫైనల్ కంటెస్టెంట్స్‌ వీళ్లేనంటూ ఓ లిస్ట్‌ను తన ఛానెల్‌లో పెట్టాడు. అభయ్ నవీన్, నాగ మణికంఠ, శేఖర్ భాషా, లావణ్య, నైనిక, యాష్మీ గౌడ, కిరాక్ సీత, విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, ఆదిత్య ఓం, ప్రేరణ కంభం, పృథ్వీరాజ్ శెట్టి, నబీల్ అఫ్రిదిలను తొలుత 14 మందిని ఫస్ట్ డే హౌస్‌లోకి పంపుతారని ఆదిరెడ్డి చెప్పాడు.

ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద ఈసారి ఆరు , ఏడు ఉంటాయని ఆయన లీకులు ఇస్తున్నాడు. దీంట్లో ప్రస్తుతానికి బర్రెలక్క, శోభాశెట్టిల పేర్లు మాత్రం తాను అంచనా వేస్తున్నట్లు ఆదిరెడ్డి వెల్లడించారు. సింగర్ లేకుండానే ఈసారి సీజన్ ఆరంభం కానుందని , అయితే బెజవాడ బేబక్క మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఆమెతోనే సింగర్ లేని లోటును భర్తీ చేస్తారని ఆదిరెడ్డి చెబుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X