Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు 8 కంటెస్టెంట్‌గా నిఖిల్.. యాష్మీతో కలిసి జంటగా, హౌస్‌లో బాధ్యతగా ఉంటాడట
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. షో ప్రారంభమైన వెంటనే నాగార్జున తన స్టైలీష్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చారు. తొలుత సీరియల్ నటి యాష్మీ గౌడ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన నాగార్జున హౌస్‌లోకి వెళ్తున్న యాష్మీ గౌడను వన్ సెకన్ అని చెప్పి ఆపేశారు. నువ్వు ఒక్కదానివే హౌస్‌లోకి వెళితే ఎలా.. నీ కోసం ఓ బడ్డీ వెయిట్ చేస్తున్నాడు.. అతనితో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళుదువు గానీ చెప్పాడు. దీంతో ఎవరు రాబోతున్నారా అని యాష్మీ గౌడ ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేసింది. అంతలో బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఓ సాంగ్ ప్లే అయ్యింది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ లోని చోర్ ముంత సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ సీరియల్ నటుడు నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఫర్ఫార్మెన్స్‌కి ఇంప్రెస్ అయిన నాగార్జున అతనిని బిగ్‌బాస్ తెలుగు 8లోకి ఆహ్వానించారు. డ్యాన్స్ బాగా చేశావు.. చూడటానికి చాలా బాగున్నావ్, సినిమాల్లో ఏమైనా ట్రై చేశావా అని ప్రశ్నించారు. దీనికి నిఖిల్ ఆన్సర్ ఇస్తూ.. రెండు కన్నడ సినిమాల్లో ఆల్రెడీ నటించానని చెప్పాడు. హీరోగా చేశావా, విలన్‌గా చేశావా అంటే విలన్‌గా చేశానని ఆన్సర్ ఇచ్చాడు.

తనకు విలన్‌గా చేయడమంటేనే ఇష్టమని నిఖిల్ తెలిపాడు. ఫస్ట్ డ్యాన్సర్ అవ్వాలని గోల్ ఉండేదని .. కానీ తెలియకుండానే ఈ ఫీల్డ్‌లో ఆఫర్లు రావడంతో ఇలా కంటిన్యూ అవుతున్నట్లు నిఖిల్ గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో మంచి విలన్‌గా సెటిలవ్వాలన్నది తన గోల్ అని ఆయన చెప్పాడు. హౌస్‌లో విలన్‌గా ఉంటావా, హీరోగా ఉంటావా అని నాగ్ అడగ్గా.. బిగ్‌బాస్‌లో బాధ్యతతో ఉంటానని నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు.
రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటని నాగ్ అడగ్గా.. సింగిల్ అని చెబుతాడు నిఖల్. అంటే రెండు మూడు సార్లు నాన్ సింగిల్ అయి.. ఇప్పుడు సింగిల్ అయ్యావా అని నాగ్ సెటైర్లు వేయగా పాతకథలు కొన్ని ఉన్నాయని నిఖిల్ పేర్కొన్నాడు. ప్రస్తుతానికి మాత్రం సింగిల్‌గానే ఉన్నానని అంటే.. హౌస్‌లో ఎవరినైనా పార్ట్‌నర్‌ను వెతుక్కుదామని అనుకుంటున్నావా అని నాగ్ ప్రశ్నిస్తారు. దీనికి లేదంటూ నిఖిల్ బదులిస్తాడు. తాను కాన్సన్‌ట్రేషన్‌తో ఆడదామని ఇక్కడికి వచ్చానని.. పార్ట్‌నర్ సంగతి అమ్మ చూసుకుంటుదని అంటాడు.. దీనికి నాగ్ అమ్మగారు విన్నారు కదా అని కామెంట్ చేస్తారు.
బిగ్‌బాస్ 8 తెలుగు లిమిట్‌లెస్ అని నీకు ఏం కావాలని నిఖిల్‌ను నాగార్జున అడగ్గా.. తనకు మనశ్శాంతి కావాలని ఆన్సర్ ఇస్తాడు. అయితే అది దొరకదని.. మనం వెతుక్కుంటే దొరకదని చెబుతారు నాగ్. నీ కోసం ఓ అమ్మాయి వెయిట్ చేస్తుందని ఆ అమ్మాయే నీ బడ్డీ అని యాష్మీని పిలిచి ఇద్దరూ కలిసి హౌస్‌లోకి వెళ్లాలని సూచిస్తారు నాగార్జున. నువ్వు సెలెక్ట్ చేసుకున్న మూడు క్వాలిటీస్ నిఖిల్‌లో ఉన్నాయా అని నాగ్ యాష్మీని అడగ్గా.. సింగిల్ ఓకే, స్మార్ట్ తెలియదు, కానీ లుక్స్ పరంగా పవర్‌ఫుల్ అంటుంది. దీనికి నిఖిల్ స్పందిస్తూ.. అమ్మాయిల ముందు ఎంత స్మార్ట్ అయినా ఓడిపోతాడని అనడంతో హీ ఈజ్ స్మార్ట్ అంటూ మెచ్చుకుంటుంది యాష్మీ. మూడు క్వాలిటీస్ నిఖిల్‌లో ఉన్నాయని .. అతనితో కలిసి హౌస్‌లో అడుగుపెడుతుంది యాష్మీ.


Click it and Unblock the Notifications











