Bigg Boss Telugu Rating: టాప్ రేటింగ్‌తో దుమ్మురేపిన బిగ్‌బాస్ తెలుగు 8 షో.. గ్రాండ్ ఓపెనింగ్‌ రేటింగ్ ఎంతంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ వారం క్రితం గ్రాండ్‌గా మొదలైంది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని హోస్ట్‌గా ఈ రియాలిటీ షో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ట్విస్టులు, టర్నులతో ఇంట్రెస్టింగ్‌గా షోను ప్రారంభించారు. విభిన్నమైన రీతిలో కంటెస్టెంట్లను పరిచయం చేస్తూ షోను మరింత ఆకర్షణీయంగా మార్చారు. ఈ షో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా టాప్ ర్యాంకింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఆ షో వివరాలు, ర్యాంకింగ్ వివరాల్లోకి వెళితే..

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ మొత్తం 14 మంది కంటెస్టెంట్లను ఇంటిలోకి పంపించారు. ఈ ఓపెనింగ్ షోకి స్టార్స్ పోటెత్తారు. నాని, అనిల్ రావిపూడి, రానా దగ్గుబాటి, నివేదా థామస్ వచ్చి కంటెస్టెంట్లను కలిశారు. వారికి టాస్కులు పెట్టి షాకిచ్చారు. ఇలా స్టార్లతో ఈ షో మొత్తం కళకళలాడింి.

Bigg Boss Telugu 8 grand opening registered Top Rating in Television History Here Is the details

ఇక 14 మంది కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. నైనిక, బేబక్క, యష్మీ గౌడ, ఆదిత్య ఓమ్, నిఖిల్ మాలియక్కల్, అభయ్ నవీన్, శేఖర్ భాషా, కిర్రాక్ సీత, సోనియా ఆకుల, విష్ణుప్రియ, ప్రేరణ, మణికంఠ, పృథ్వీ తదితరులు ఇంటి సభ్యులుగా చేరిపోయారు.

ఇక ఇలాంటి జోష్‌తో సాగిన బిగ్‌బాస్ తెలుగు 8 షోకు భారీ రేటింగ్ నమోదైంది. బిగ్‌బాస్ గ్రాండ్ ఓపెనింగ్ రోజున 18.9 టీఆర్పీతో దుమ్ము రేపింది. ఈ మధ్యకాలంలో ఇంతటి రేటింగ్ రాబట్టి షో మరోటి లేదనే విషయాన్ని స్టార్ మా నిర్వాహకులు ధృవీకరించారు. ఈ రేటింగ్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 8 చరిత్రలో ఇలాంటి ర్యాకింగ్ రావడం ఇదే మొదటిసారి. ఈ షోకు పెరుగుతున్న ఆదరణ, యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించిన తీరుకు ఇది నిదర్శనం అంటూ టీవీ వర్గాలు పేర్కొన్నాయి. మంచి కంటెంట్‌‌తో స్టార్ మాకు ఎప్పుడు ప్రేక్షకుల నుంచి సపోర్ట్ ఉంటుందని నిరూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X