Biggboss Telugu 8: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జగతి మేడమ్.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్.. బిగ్ బాస్..గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త కాన్సెప్ట్ లతో బుల్లితెర ప్రేక్షకులను ఓరేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది. బిగ్ బాస్ 8 తెలుగు ఈ సీజన్ ప్రారంభం నుంచి ఊహించని టాస్కులు, కాంట్రవర్సీలు, గొడవలు, లవ్ సోర్టీలు, రొమాంటిక్ మూమెంట్స్ తో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ లోనే యూట్యూబర్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. దీంతో ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్లే ఉన్నారు. ఈ క్రమంలో వైల్ కార్డు ఎంట్రీ ద్వారా ఓ బ్యూటీ హౌస్ లోకి తీసుకురానున్నారు.

ఆ బ్యూటీ ఎవరో కాదు.. బుల్లితెర సీరియర్ నటిగా తెలుగు ప్రజల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నటి జ్యోతిరాయ్. ఈమె ఎక్కువగా జగతి మేడమ్‌గానే తెలుగు అందరికీ. మా టీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా జ్యోతిరాయ్‌కు మంచి గుర్తింపు దక్కింది. సీరియల్‌లో రిషికి తల్లి పాత్రలో ఎంతో పద్ధతిగా చీరకట్టులో కనిపించినప్పటికీ బయట జగతి మేడమ్ అందాల ఆరబోత మామూలుగా ఉండదు. బోల్డ్ ఫొటో షూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఫ్రంట్, బ్యాక్ అందాలతో కుర్రాళ్ల నుంచి ముసలివారికి సైతం చెమటలు పట్టిస్తుంటుంది. జ్యోతిరాయ్ వయసు 30 ఏళ్లకు పైనే ఉన్నా.. యంగ్ హీరోయిన్‌లా కనిపిస్తూ స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిస్తుంది.

bigg boss telugu 8 Guppedanta Manasu jagathi madam alias Jyothi Rai ready for entry with wild card

జ్యోతిరాయ్ కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ పాత్రల్లో నటించింది. తర్వాత కన్నడ టీవీ సీరియల్ నటిగా పాపులర్ అయ్యింది. దీంతో తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్‌లో అవకాశం కొట్టేసింది. అమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది. అంతేకాకుండా జగతి మేడమ్ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కన్నడ, తెలుగు, తమిళ టీవీ సీరియల్స్‌లో నటిస్తుంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తుంది.

ఇక జ్యోతి ఓ యువ దర్శకుడితో ప్రేమలో మునిగి తేలుతుందని సోషల్ మీడియాలో టాక్. అలాగే ఆయన్ను వివాహం కూడా చేసుకుందని జనాలు చర్చించుకున్నారు. ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ వీరిద్దరు టెంపుల్స్, వెకేషన్స్‌కు వెళ్లినా పిక్స్ నెట్టింట షేర్ చేసుకుంటూనే ఉంటారు.

ఇకపోతే హాట్ బ్యూటీ గురించి మరో వార్త సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్-8 లోకి ఈ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతుందట. మొన్నటిదాకా రీతూ చౌదరి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్ వినిపించింది. ఇప్పుడు జ్యోతిరాయ్ నేమ్ వినిపిస్తుంది.

bigg boss telugu 8 Guppedanta Manasu jagathi madam alias Jyothi Rai ready for entry with wild card

జ్యోతిరాయ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని అభిమానుల చెవిన పడగానే తెగ సంబరపడిపోతున్నారు. తన అందాలతో బిగ్‌బాగ్ ప్రేక్షకులను ఆకట్టుకోనుందా? లేక వయసు తగ్గట్లు ప్రవర్తించనుందా? అనే సందేహాలు జనాల్లో తలెత్తుతున్నాయి. మరికొంతమంది జగతి మేడమ్ హౌస్‌లోకెళ్తే రచ్చ రచ్చే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X