Bigg Boss 8 Telugu: హౌస్ నుంచి హరికథల రాణి ఎలిమినేట్ .. హరితేజ రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలంటే..?
Bigg Boss 8 Telugu Hari Teja Remuneration: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఎవరూ ఊహించని ట్విస్టులు, మలుపులు చోటు చేసుకుంటున్నాయి. పదోవారం అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం రోజు గంగవ్వ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆదివారం నాడు అందరూ ఊహించినట్టుగానే హరితేజ ఎలిమినేట్ అయి.. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 8 లో హరితేజ రెమ్యునరేషన్ ఎంత? ఈ సీజన్ లో ఎంత సంపాదించింది? అనే విషయాల్లోకెళ్తే..
పదో వారం నామినేషన్లలో యష్మి, ప్రేరణ, గౌతమ్, హరితేజ, విష్ణు ప్రియ, రోహిణి, పృథ్వి, నిఖిల్ నిలిచారు. ఇందులో నిఖిల్, విష్ణు ప్రియ, పృథ్వి, ప్రేరణ, గౌతమ్ లకు మెరుగైన ఓటింగ్ రావడంతో వరుసగా సేఫ్ అయ్యారు. చివరిగా హరితేజ, యష్మిలు నామినేషన్లు నిలిచారు. దీంతో వీరిద్దరిని యాక్షన్ రూమ్ కి రమ్మని నాగార్జున పిలిచాడు. ఈ సమయంలో నబీల్ ను పిలిచి తన దగ్గర ఉన్న ఎవిక్షన్ షిల్డ్ ను ఎవరికోసమైనా ఉపయోగిస్తావా? అని ప్రశ్నించగా.. తాను తర్వాత వినియోగించుకుంటానని చెప్పాడు నబిల్. దీంతో ఎలిమినేషన్ తప్పలేదు. యష్మీ కంటే హరితేజ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉండడంతో ఎలిమినేట్ అయ్యింది.

ఈ సీజన్ కు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన హరితేజ ఆరు వారాలు పాటుగా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది. ఈమె టాస్కులు బాగానే ఆడినా.. మనసులో కుళ్ళు, అసూయ వంటి క్వాలిటీ బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చలేదని పలువురి అభిప్రాయం. ఎలిమినేట్ అయినా అనంతరం స్టేజ్ పైకి చేరుకుంది హరితేజ. బిగ్ బాస్ లో తన జర్నీ ని చూసి ఎమోషనల్ అవుతుంది. బిగ్ బాస్ ను విడిచి వెళ్తున్నాననే బాధ కంటే, తన కూతురికి దగ్గర అవుతున్నానని సంతోషం ఉందని హరితేజ చెబుతుంది. ఆ తర్వాత కింగ్ నాగ్ .. హరితేజ కు ఓ టాస్క్ ఇస్తారు. హౌస్ లో ఎవరు మాస్కులు తీసి ఆడాలో చెప్పాలని నాగార్జున కోరుతాడు.
అవినాష్ అందరినీ నవ్విస్తూ.. మనసు దోచుకుంటున్నారని, కానీ.. ఆయన కోపం ఎమోషన్స్ ఎవరికి నచ్చడం లేదని చెబుతుంది. తన పర్సనాలిటీ ఏంటో అర్థం కాలేదని, ఇప్పటికైనా మాస్క్ తీసి ఆడితే బెటర్ అని చెబుతోంది. ఆ తర్వాత రోహిణి గురించి మాట్లాడుతూ ఎక్కువసేపు ఏడవడం మంచిది కాదు నవ్వుతే బాగుంటావని రోహిణి చెబుతుంది. తనని కూడా మాస్క్ తీసి ఆడాలని తన అభిప్రాయాన్ని చెబుతుంది. ఆ తర్వాత రూల్స్ చెప్పడమే కాదు.. పాటించాలని తేజకు సలహా ఇస్తుంది.

ఇదెలా ఉంటే.. హరి తేజ ఐదు వారాల పాటు హౌస్ లో కొనసాగింది. బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందంటే.. హరితేజ వారానికి నాలుగు లక్షల చొప్పున రెమినేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఐదువారాలకు గాను.. దాదాపు 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇతర కంటెస్టెంట్ల తో పోలిస్తే.. హరితేజ బెటర్ అమౌంట్ తీసుకున్నట్లు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











