100 ఎపిసోడ్‌లొద్దు.. బిగ్‌బాస్‌కే షాకిచ్చిన బేబక్క, సోనియాతో విష్ణుప్రియ బూతు పంచాయతీ
బిగ్‌బాస్ తెలుగు 8 చూస్తుండగానే ఫస్ట్ వీక్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. వీకెండ్ అంటే ఎలిమినేషన్ రోజు కాబట్టి ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఈ వీక్ మొత్తం ఎలా జరిగిందో హోస్ట్ నాగార్జున అనాలిసిస్ చేసి కంటెస్టెంట్స్‌ను మందలిస్తారు. అందుకే సండే రోజు బిగ్‌బాస్ ఎపిసోడ్‌ను ఎవ్వరూ మిస్ అవ్వరు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారు తమలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని టెన్షన్‌తో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా ప్రోమో రిలీజ్ చేసింది.
టాస్క్‌లు, గేమ్స్ మొదలవ్వడంతో బిగ్‌బాస్ హౌస్‌లో సందడి మొదలైంది. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఒక్కొక్కరు మాట్లాడుతూ యాక్టీవ్ అవుతున్నారు. ఇందులో విష్ణు ఒకరు.. ఆడపులినంటూ రెచ్చిపోతున్న సోనియాకు టైం చూసి ఇచ్చిపడేసింది. ఇక కొత్తగా ఇంటి పెత్తనం సంపాదించిన యాష్మీ గౌడ ఓవరాక్షన్‌ను కంటెస్టెంట్స్ తట్టుకోలేకపోతున్నారు. టాస్క్‌లలో తమను టార్గెట్ చేసిన నైనిక అండ్ బ్యాచ్‌కు ఆమె చుక్కలు చూపెడుతోంది. ఫ్రెండ్ అయిన నిఖిల్ కూడా యాష్మీ బిల్డప్ చూసి రగిలిపోతున్నాడు.

వినాయక చవితి కావడంతో కంటెస్టెంట్స్ అంతా శనివారం ట్రెడిషనల్ డ్రెస్సుల్లో రెడీ అయ్యారు. నాగార్జున రావడంతోనే అందరికీ క్లాస్ పీకారు. ఆదిత్య ఓం ఇకనైనా ఇంట్లో కనిపించాలంటూ చురకలంటించారు నాగ్. ఫస్ట్ వీక్‌లో చీఫ్‌లుగా నిలిచిన నిఖిల్, యాష్మీ, నైనికలకు కంగ్రాట్స్ చెప్పిన ఆయన యాష్మీని మాత్రం స్పెషల్‌గా మెన్షన్ చేశారు. యాష్మీ టీమ్ ఓవరాక్షన్ గురించి కంటెస్టెంట్స్ నాగార్జునకు కంప్లయింట్ చేయగా.. ఆయన ఆమెనే వెనకేసుకొచ్చినట్లుగా మాట్లాడారు.
యాష్మీ టీమ్ గెలిచింది, పవర్ సాధించింది .. కాబట్టి దానిని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటారని నాగ్ క్లారిటీ ఇచ్చారు. నిఖిల్ పూర్తిగా మారిపోయాడని.. స్టార్టింగ్‌లో ఆయనలో లీడర్ కనిపించాడని, ఇప్పుడేమో సోనియా సోనియా అంటూ కలవరిస్తున్నాడని.. తనకు నిఖిల్ టీమ్‌లో ఉండాలని లేదని బేబక్క చెప్పింది. దీంతో ఆమె కోరిక ప్రకారం బేబక్కను నిఖిల్ టీమ్ నుంచి తప్పించారు నాగ్. చివరిలో ప్రేరణ, సీత, బేబక్క, ఆదిత్య ఓం, విష్ణుప్రియల పర్ఫార్మెన్స్ బాలేదని చెప్పిన ఆయన సోనియా ఆకులను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశారు. దీంతో నామినేషన్స్‌లో మిగిలిన ఐదుగురిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ కానున్నారు.
ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో విషయానికి వస్తే.. ఇంటి సభ్యులకు ఓ జంతువును డెడికేట్ చేసి వారిపై రీజన్స్ చెప్పాలని నాగ్ టాస్క్ ఇస్తాడు. శేఖర్ భాషాను దోమతో పోల్చాడు నిఖిల్. ఎంత సీరియస్ కండీషన్‌లోనైనా జోకులు వేసి నవ్విస్తాడని చెప్పాడు. అడల్ట్ రేటెడ్ జోక్స్ విషయంలో సోనియాకు విష్ణుప్రియకు మరోసారి పడగా బిగ్‌బాస్ హౌస్ హీటెక్కింది. మణికంఠ వచ్చి శేఖర్ భాషాకు చిరాకు అంటూ దోమ బోర్డ్ మెడలో వేయగా.. మణికంఠ ఏదో మూల కూర్చొని చీ.. రాకు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటాడని శేఖర్ అనగా నాగార్జునతో సహా ఇంటి సభ్యులంతా నవ్వేస్తారు. మరి సాయంత్రం ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











