అప్పుడు పల్లవి ప్రశాంత్.. ఇప్పడు నాగమణికంఠ.. ఆ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యేనా ?
Bigg Boss Telugu 8: ఎవరెమన్నా.. ఎవరేం మాట్లాడినా.. ఈ సారి బిగ్ బాస్ లో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ పక్కా అంటున్నారు. నిజంగానే ఈ షోలో గొడవలు, కంట్రవర్సీలు, కొట్లాటలే కాదు.. సింపథీకి కూడా తిరుగేలేదని చెప్పాలి. ఆ సింపథీని వాడుకుని గత సీజన్‌లో బీబీ లవర్స్ మనసు గెలుచుకుని విజేతగా నిలిచారు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ఒక్క ట్యాగ్‌ను యూజ్ చేసుకుని బిగ్ బాస్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఆ సింపథీని తనకు తగట్టు ఉపయోగించుకుని చివరికి బిగ్ బాస్ 7 విన్నర్ గా టైటిల్ కొట్టేశాడు పల్లవి ప్రశాంత్. ఈ సీజన్ లో సరిగ్గా అదే సూత్రాన్ని ఓ కంటెస్టెంట్ పాటిస్తున్నాడు. తూచా తప్పకుండా పల్లవి ప్రశాంత్ అడుగు జాడల్లో నడుస్తున్నాడు. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి
మరెవరో కాదండీ.. అతడే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు కంటెస్టెంట్ నాగ మణికంఠ. ఈ సీజన్ లాంచింగ్ ఈవింట్ నుండే నాగ మణికంఠ ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉంది. ఆ స్టేజ్ మీద మనోడు 'రెండేండ్లకే తండ్రిని కోల్పోయాను. పెరిగి పెద్దయిన తర్వాత కన్నతల్లిని కోల్పోయాను. 'అని తన ప్లాష్ బ్యాక్ చెప్పి కన్నీరు పెట్టించారు. అంతటితో ఆగకుండా.. మనోడు భార్య, కూతురు సెంటిమెంట్ ను కూడా కలిపేశాడు. తాను ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడి విదేశాలకు వెళ్తననీ, తనకు ఓ అందమైన అమ్మాయితో పెళ్లి జరిగిందనీ, ఆ తరువాత కూతురు పుట్టిందని, ఆ కూతురులో తన తల్లిని చూసుకుంటున్నానని చెప్పకొచ్చారు. దీంతో మనోడి లైఫ్ పుల్ హ్యాపీగా సాగుతుందని అనుకున్నారు.

కట్ చేస్తే.. తన భార్యతో తనకు పడటం లేదనీ, ఆ గొడవల కారణంగా తన భార్య తన కూతురుని దూరం చేసిందనీ, తనను తాను నిరూపించుకోవడానికే బిగ్ బాస్ లో అడుగుపెట్టానన్నారు. దీంతో 'అయ్యో పాపం' అనేలా కంటెస్టెంట్ల మనసులో నిలిచిపోయారు. ఇలా స్టేజిపై నుంచే ఒక వైబ్ క్రియేట్ చేసుకుని బిగ్ బాస్ లో అడుగుపెట్టారు. అదే రోజు కంటెస్టెంట్లందరూ నాగమణికంఠను టార్గెట్ చేశారు. ఈవింగ్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన హౌస్ లోకి వచ్చి.. మీరో ఎవరో ఒకరిని బయటకు పంపడానికి ఓటు వేయమన్నారు.
ఈ క్రమంలో చాలా మంది నాగమణికంఠకు నామినేట్ చేశారు. దీంతో మనోడ్ని బయటకు తీసుకొస్తారు అనిల్ రావిపూడి. ఆ సమయంలో మనోడు ఓ రేంజ్ లో ఫర్మెన్స్ ఇచ్చారు. అంతకంటే ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు. మీరు ఇది గేమ్ కావొచ్చు. కానీ, ఇది లైఫ్ .. నేనేంటో నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చా.. నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ సమయంలో మనోడు ఓ రేంజ్ లో శివుడిపై పాట పాడి భావోద్వేగానికి లోనయ్యారు. కానీ చివరిలో అనిల్ రావిపూడి అది ప్రాంక్ అని చెబుతారు. ప్రాంక్ సమయంలో నాగమణికంఠ ఓవరాక్షన్ తో మనదిపై ఓవర్ అటెన్షన్ వచ్చిందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. ఈ మూడు రోజుల్లో మనోడు ఏదో తేడాగానే మాట్లాడుతున్నాడు. తేడాగానే కనిపిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్స్, ఈ రోజు ప్రోమో చూస్తే.. ఈ విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. నామినేషన్స్ సమయంలో పలువురు కంటెస్టెంట్స్ ఎమోషనల్ బాయ్ నాగమణికంఠని టార్గెట్ చేశారు. అతన్ని నామినేట్ చేశారు. ఈ సమయంలో నాగమణికంఠ మాట్లాడుతూ.. 'నేను చావు దాకా వెళ్లి వచ్చాను. నా గురించి మీకేం తెలుసు.. చిన్నప్పుడే కన్న తండ్రిని పోగొట్టుకున్నాను. పెంపుడు తండ్రితో అవమానాలు పడ్డాను. ఊహా తెలిశాక అమ్మ చచ్చిపోయింది. అమ్మ శవం కాల్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కొని వచ్చి శవం కాల్చాల్సి వచ్చింది' అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో మిగిత కంటెస్టెంట్లందరూ ఏడ్చేశాడు.
మనోడ్ని చూస్తే.. గత సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గుర్తుకువచ్చాడు. గత సీజన్ లో కూడా తొలివారం నామినేషన్స్ లో కూడా ఇలాంటి సీన్స్ కనిపించాయి. బిగ్ బాస్ హౌస్ లోకి ఓ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌పై సీరియల్ బ్యాచ్ ముకుమ్మడిగా నామినేషన్స్‌లో దాడి చేసింది. తొలివారంలోనే ప్రశాంత్ ను ఇంటికి పంపిచాలని ఓ రేంజ్ లో ప్రయత్నించారు. పక్కా ప్లాన్‌తో అతడ్ని నామినేట్ చేసేశారు. ఆ సమయంలోనూ పల్లవి తన కష్టాలను చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తాను రైతుబిడ్డను అనే సెంటిమెంట్ ఇచ్చి ఓ సింపథీని క్రియేట్ చేశారు. తీరా వీకెండ్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది.
మనోడ్ని సింపథీకి తెలుగోళ్ల హృదయాలు కరిగిపోయాయి. ఆ దెబ్బతో పల్లవి ప్రశాంత్ ఓటింగ్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఆ తరువాత కంటెస్టెంటందరికి గట్టి పోటీ ఇచ్చారు. కట్ చేస్తే.. రైతుబిడ్డ టైటిల్ విన్నర్ గా నిలిచారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ఈ సీజన్ లో కూడా మణికంఠ ఈ సూత్రాన్నే పాటిస్తున్నారు. ఈ సింపథీని మనోడుసరిగ్గా వాడుకుంటే ఫినాలేలో అడుగుపెట్టడం ఖాయమంటున్నారు బిబి లవర్స్. ఇక నాగమణికంఠ విషయానికి వస్తే..
షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో తన కెరీర్ టర్న్ చేసుకునేలా ప్రయత్నిస్తున్నాడు. మనోడు మరీ మున్ముందు ఎలా టాలెంట్స్ ప్రదర్శిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











