Bigg Boss 8 Telugu: అప్పుడు రతిక.. ఇప్పుడు సోనియా ఆకుల
Bigg Boss 8 Telugu: గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త కాన్సెప్టుతో ముందుకు వచ్చిన రియాలిటీ షో బిగ్ బాస్ 8 తెలుగు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ఊహించని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో అంశాలు హైలైట్ గా నిలుస్తున్నాయి. బుల్లితెర ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేస్తున్న ఏకైక షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో సక్సెస్ పుల్ గా వారం రోజులు పూర్తి చేసుకుని, రెండో వారంలోకి అడుగుపెట్టింది. గత వారంలో నాగ మణికంఠ తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పి అందరి ద్రుష్టిని ఆకర్షించగా.. ఈ వారం సోనియా ఆకుల హాట్ టాపిక్ గా మారింది. ఈమె తన ప్రవర్తనతో ఇంకో రతిక గా మారబోతున్న అనే అభిప్రాయంలో వెలువడుతోంది. ఆ కామెంట్స్ కారణమేంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో తొలివారం సైలెంట్ గా ఉన్నా సోనియా రెండు వారంలో రెచ్చిపోయింది. ఈ వారం సోనియా ఇతర కంటెస్టెంట్లతో వ్యవహరించే తీరు, మాట్లాడే మాటలు, ఆమె చేతలు, చేష్టాలు చాలా తేడా ఉన్నాయి. మరో వైపు నిఖిల్, ప్రుద్వీతో మాట్లాడుతూ ట్రయాంగిల్ లవ్ సోర్టీకి తెర తీసిందా? అనే వ్యవహరిస్తుంది. హౌస్ లోని పలు విషయాలపై హనెస్ట్ గా తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పటికీ, ఇతర కంటెస్టెంట్లతో ఆమె వ్యవహరించే తీరు తేడా ఉంది.

నిజానికి హౌస్ లో సోనియా ప్రవర్తన మొదటి నుంచే తేడాగా ఉంది. తొలుత నిఖిల్ ను నామినేషన్స్ లో విమర్శించినా ఆమె క్రమంగా అదే నిఖిల్ తో సన్నిహితంగా ఉండటం. ఈ క్రమంలో ఇద్దరూ పక్కనే కూర్చుని కళ్లల్లో కళ్లు పెట్టుకుని చూసుకుంటూ తేడా మాట్లాడుకోవడం కంటెస్టెంట్ల అందరికి తేడాగా అనిపించింది. ఈ క్రమంలో విష్ణు ప్రియ కాస్త ఓపెన్ అయినా.. 'మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు. మరి ఇప్పుడు ఎలా ఫ్రెండ్‌షిప్ కుదిరింది' అని సోనియాను ప్రశ్నించింది. దీనికామె 'ఎవరు అడగమన్నా నేను మాత్రం మీ అడల్డ్ కామెడీలో పార్ట్ కాను'అని చెప్పింది. ఈ క్రమంలో విష్ణు ప్రియ, సోనియాల మధ్య మాటల తూటాలు పేలడం. ఈ క్రమంలో సోనియా కంటతడి పెట్టుకోవడంతో ఆమెపై కాస్త సింపథి క్రియేట్ అయ్యింది.
ఇక్కడ వరకూ అంత బాగానే ఉన్నా రెండో వారంలోకి అడుగుపెట్టారో ? లేదో? కానీ, ఆమె తన విశ్వరూపం చూపించింది. సీజన్ ప్రారంభంలో నిఖిల్ వర్సెస్ సోనియాగా ఉన్న పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. వాళ్లిద్దరూ నాన్నా.. బుజ్జీ.. కన్నా.. అని పిలుచుకునే రేంజ్ కు వెళ్లిపోయింది. ఆ తరువాత విష్ణుప్రియ, యష్మి గురించి నిఖిల్‌కు నెగెటివ్ గా చెప్పడం, పలు విషయాల్లో వీరిద్దరూ చాలా క్లోజ్ గా మూ కావడం. కేవలం కంటెస్టెంట్లకే కాదు.. బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి బోలెడన్ని డౌట్లు వస్తాయి. కేవలం వారం రోజులకే ఇంత ప్రేమనా? అనేట్టు వ్యవహరించారు.
నేటీ ఎపిసోడ్ లో సోనియా మరింత డోస్ పెంచింది. ఆమె నిఖిల్ తో మాట్లాడుతూ.. సిగరెట్ తాగకుండా ఉంటే నువ్వు అడిగినా ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నిఖిల్, సోనియాలు తెగ ప్రేమించేసుకుంటున్నారే అని అనుకునేలోపే.. సోనియా ట్రాక్ మార్చేసింది. మరోవైపు పుథ్వీ పక్కన కుర్చోని చేతిలో చెయ్యేసి మాట్లాడుతూ తల నిమురుతూ కసి కసి చూపులతో ప్రుధ్వీని ఆగం ఆగం చేసింది. హౌస్‌లో మరో జంటను లవ్ ట్రాక్ ఎక్కించే వరకూ వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ పైనే కంటెస్టెంట్ల దృష్టి పడుతుంది. ఇవన్నీ చూసిన జనాలు.. ఈమె ఇంకో రతిక అయ్యేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











