Bigg Boss Telugu 8: బిగ్ బాస్ నుంచి బోల్డ్ బ్యూటీ అవుట్.. కిర్రాక్ సీత రెమ్యునరేషన్ ఎంతంటే?

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నెల రోజుల పాటు కాస్త చప్పగా.. సాగిన షోను రి లాంచ్ చేశారు. వైల్డ్ కార్డు ​ఎంట్రీ ద్వారా 8 మందిని ఓల్డ్ తీసుకవచ్చారు. ఇలా షోపై క్యూరియాసిటీని పెంచేశారు. గత సీజన్లో ఎప్పుడు చూడని కంటెంట్ ఇస్తుండటంతో భారీ రెస్పాన్స్‌ వస్తుంది. హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దూసుకపోతోంది. రసవత్తరంగా సాగుతోన్న ఈ షోలో ఆరో వారం బోల్డ్ బ్యూటీ ఎలిమినేట్ అవుతుందని సమాచారం. ఈ తరుణంలో ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే అనేది హాట్ టాపిక్ గా మారింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 .. గతంలో ఎన్నాడు లేని విధంగా ఈ సీజన్ లో 8 మందిని వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకవచ్చారు. హౌస్ లో ఉన్నా కంటెస్టెంట్లను ఓజీ క్లాన్ మెంబర్స్‌, వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన రాయల్ క్లాన్ గా విభజించారు. ఇరు గ్రూపుల మధ్య కంటెస్టెంట్ల పోరు హోరా హోరీగా సాగుతోంది. ఓజీ క్లాన్ మెంబర్స్ ను రాయల్ క్లాన్ మెంబర్స్ నామినేట్ చేయగా.. ఇద్దరూ రాయల్ క్లాన్ సభ్యులను ఓజీ క్లాన్ సభ్యులను నామినేషన్‌ చేశారు. ఇలా ఆరోవారం నామినేషన్స్‌లో ఆరుగురు నామినేట్ అయ్యారు.

Bigg Boss Telugu 8 Kirrak Seetha remuneration for 6 weeks Kirrak Seetha eliminate

ఈ తరుణంలో ఆరోవారం ఎవరూ ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠగా మారింది. నామినేషన్స్ లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో తక్కువ ఓట్లు వచ్చిన పృద్వి అండ్ సీత మధ్య ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే.. ఈ ఓటింగ్ ప్రకారం ఆరో వారం కిర్రాక్ సీత కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. తాజా ఇన్పుట్స్ ప్రకారం కూడా ఆరో వారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది. కిరాక్ సీత ఎలిమినేష‌న్‌కు ఎలిమినేష‌న్‌కు సంబంధించిన ఎపిసోడ్‌ షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. కానీ, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

బిగ్ బాస్ 8 ప్రారంభంలో కిర్రాక్ సీతకు పాజిటివ్‌ టాక్ వచ్చింది ప్రేక్షకులు. తొలుత ఆట తీరులో గానీ, హౌస్‌లో అందరితో కలిసిపోయే విషయంలో గానీ సీత కు పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ, రోజురోజుకు ఆట తీరులో మార్పు వచ్చింది. ఆమెలో క్రమంగా కామెడీ యాంగిల్ లేక‌పోవ‌డం, తన ఆట తీరులో కూడా తేడా రావడం, టాస్కుల్లో సీరియ‌స్‌నెస్ లేకపోవడం, ప్రతి విషయానికి ఎమోషనల్ కావడం, ఎక్కువగా అందరితో గొడవపడడం, అనవసరమైన విషయాల్లో కావాలని తలదూర్చడంతో సీతపై నెటిగివిటీ పెరిగిపోయింది.దీంతో ఆరో వారం ఓటింగ్ లో ఆ ప్రభావం కనిపించింది. సీతపై నెగిటివ్ అభిప్రాయంతో ఓట్లు త‌క్కువ‌గా వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Bigg Boss Telugu 8 Kirrak Seetha remuneration for 6 weeks Kirrak Seetha eliminate

ఈ తరుణంలో సీతా రెమ్యునరేషన్ విషయం హాట్ టాఫిక్ గా మారింది. ఇతర కంటెస్టెంట్లతో పోల్చుకుంటే.. సీతా పారితోషికం కాస్తా బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఈ బ్యూటీకి బిగ్ బాస్ వారానికి రూ.2 లక్షల 20 వేలు పే చేస్తుందట. అంటే.. ఆరు వారాలకు సీత 13 లక్షల 20 వేల రూపాయాలను అందుకోబోతుందన్న మాట. టాప్ 5 కంటెస్టెంట్లలో కిర్రాక్ సీతా ఉంటారని బీబీ లవర్స్ ఎంతగానో ఊహించారు. కానీ ఆరువారమే ఎలిమినేట్ కావడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X