Bigg Boss 8 Telugu: మరోసారి షాకింగ్ ఎలిమినేషన్.. 4 వారాలకు నయని పావని రెమ్యునరేషన్ ఎంతంటే?
Bigg Boss Telugu 8: బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఈ షోలో ఎవరూ చూడని, ఎవరూ ఊహించని, దిమ్మతిరిగే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్ ప్రారంభమైన తొలి నాలుగు వారం కాస్త నెమ్మదిగా సాగినా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సీజన్ ను రీ లాంఛ్ చేశారు. అప్పట్నుండి బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ చూడని కంటెంట్ ఇస్తుండటంతో బిగ్ బాస్ షోపై క్యూరియాసిటీని పెరిగింది. ఇలా రసవత్తరంగా సాగుతున్న ఈ సీజన్ తొమ్మిదో వారం నయని పావని ఎలిమినేట్ అయింది. ఈ తరుణంలో నాలుగు వారాలు ఉన్నందుకు గాను నయని పావని ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నదనేది హాట్ టాపిక్ గా మారింది.
స్టార్ మా లో ప్రసారమవుతున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం ఎదైనా ఉందంటే.. అది బిగ్ బాస్ షోనే. ఈ షో నుంచి ఇప్పటివరకూ.. బెజవాడ బేబక్క, శేఖర్ భాషా, అభియ్ నవీన్, సోనియా ఆకుల , హీరో ఆదిత్య ఓం, నైనికా, కిర్రాక్ సీత, మణికంఠ,మెహబుబ్ ఎలిమినేట్ అయ్యారు. ఇందులో ఆదిత్య ఓం మీట్ వీక్ ఎలిమినేట్ కాగా, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకునీ బిగ్ బాస్ లవర్స్ అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇక బిగ్ బాస్ సీజన్ 8లో తొమ్మిదోవారం ఎలిమినేషన్ లో టేస్టీ తేజ,యష్మి , నయని పావని, హరితేజ, గౌతమ్ నిల్చారు. షోను మోస్ట్ ఎంటర్టైన్ గా మార్చడంలో కి రోల్ ప్లే చేస్తున్నాడు తేజ. దీంతో తేజ అందరికంటే ముందు సేవ్ అయ్యారు. యష్మికి మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో ఆమె కూడా సేఫ్ అయింది. అలాగే.. ఈ వీక్ లో తన టీం కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా నిఖిల్ బెదిరించడం కూడా ఆమె కలిసి వచ్చింది. డాక్టర్ గౌతం కూడా తన శక్తి మేరకు టాస్కులలో ఆడుతున్నందుకు ఆయన కూడా ఓటింగ్లో ముందు వరుసలో నిలిచారు.
ఇక మిగిలింది హరితేజ, నయని పావని వీరిద్దరూ డేంజర్ జోన్ లో నిలిచారు. గతవారం హైపర్ ఆది చెప్పినట్లుగా వీరిద్దరిని బిగ్ బాస్ ప్రేక్షకులు వీరిని సరిగ్గా గుర్తించటం లేదేమో అన్నట్లుగానే.. ఈ వారం ఓటింగ్ లో చివరి స్థానంలో నిలిచారు. అయితే హరితేజ బీన్ బ్యాగ్ టాస్క్ లో పూనకం వచ్చినట్లు ఆడి బిగ్ బాస్ లవర్స్ ను మెప్పించింది. దీంతో ఆమె సేవ్ అయ్యే ఓట్లే పడ్డాయి.
ఇంకా మిగిలింది నయని పావని.. ఆమె ఆటల్లో ఆడే దానికంటే ఎప్పుడు కూడా ఏడుస్తూనే కనిపిస్తోంది. ఈ విషయం బిగ్ బాస్ ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగానే కనిపించి ఉంటుంది. మొత్తానికి ఈ క్రయింగ్ బేబీ మాకొద్దవంటూ ఈ వారం ఆమెను ఎలిమినేట్ చేసి పంపించారు. చివర్లో హరితేజ, నయని పావని ఉండగా.. పావని ఎలిమినేట్ చేసి. . నాగార్జున బయటకు పంపించేసాడు. గత సీజన్ లో నయనిపావని కేవలం ఒకే ఒక వారం మాత్రమే షోలో ఉంది. ఈ సీజన్లో కాస్తా బెటర్ గా నాలుగు వారాలు ఉండి ఎంటర్టైన్ చేసిందని చెప్పాలి. కానీ, తన ఏడుపే తనని ఇంటికి పంపించిందేమోనని బిగ్ బాస్ ప్రేక్షకుల అభిప్రాయం.
నయని పావని రెమ్యునరేషన్
ఇక బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొన్నందుకు నయని పావనికి సుమారుగా వారానికి రూ. 3,50,000 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే.. రోజుకు దాదాపుగా 50,000 రూపాయలు పారితోషికంగా తీసుకునేది నయని పావని. ఈ లెక్కన చూస్తే.. నయని పావని నాలుగు వారాలకు దాదాపుగా రూ. 14 లక్షల పారితోషికం అందుకుందని తెలుస్తోంది. అంటే.. బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా 4 వారాల్లో నయని పావని పద్నాలుగు లక్షలు రూపాయలు సంపాదించినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











