Bigg Boss Telugu 8: ఎలిమినేషన్ అంచులో నయని పావని..ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా??

Bigg Boss Telugu 8: బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ చూడని, ఎవరూ ఊహించని, దిమ్మతిరిగే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీజన్ ప్రారంభమైన తొలి నాలుగు వారం కాస్త నెమ్మదిగా సాగినా.. డబుల్​ ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డు​ఎంట్రీలతో సీజన్ ను మరోసారి లాంచ్ చేశారు. దీంతో బిగ్ బాస్ షోపై మరింత ఇంట్రెస్టెంట్ పెరిగింది. అలాగే.. గత సీజన్లో ఎప్పుడు చూడని కంటెంట్ ఇస్తుండటంతో ఈ షోకు భారీ రెస్పాన్స్‌ వస్తుంది. అలాగే.. స్టార్ మా లో హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తున్న ప్రోగ్రామ్ గా బిగ్ బాస్ నిలిచింది.

తొలివారం ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో శేఖర్ భాషా, మూడోవారం అభియ్ నవీన్, నాలుగోవారం సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేషన్ అయింది. ఇక ఐదో వారం ఎవరూ ఊహించని విధంగా మీడ్ వీక్ ఎలిమినేషన్‌ పెట్టి.. హీరో ఆదిత్య ఓం ను ఎలిమినేట్ చేశాు. అదే వారం చివరిలో నైనికా ను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఇక ఆరోవారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయింది. ఏడో వారం ఎవరూ ఊహించని విధంగా మణికంఠ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. తాజాగా ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది? అనేది బిగ్ బాస్ లవర్స్ లో చర్చనీయంగా మారింది .

Bigg Boss Telugu 8 Nayani Pavani will eliminate in the 8 th week of Bigg Boss telugu season 8

ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల రచ్చ మామూలుగా జరగలేదు. ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ సభ్యుల మధ్య నామినేషన్ల ప్రక్రియను చూస్తే.. మిని వార్ గుర్తుకు వచ్చింది. ఎవరూ కూడా తగ్గేదేలే అన్నట్టు రెచ్చిపోయారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా ఈసారి ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇందులో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, నయని పావని, మెహబూబ్, విష్ణుప్రియ నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేట్​ అయ్యేది ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఎనిమిదో వారం ఎలిమినేషన్స్ కు మొత్తం ఆరుగురు నామినేషన్‌ అయ్యారు. వీరిలో ఎవరు బయటకు వస్తారు? అనేది బిగ్ బాస్ లవర్స్ అతృతగా ఎదురు చూస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే.. మంగళవారం రాత్రి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై.. శుక్రవారం రాత్రి వరకు జరిగింది.

Bigg Boss Telugu 8 Nayani Pavani will eliminate in the 8 th week of Bigg Boss telugu season 8

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. అయితే వీరిలో ప్రేరణ ఎక్కవ ఓటింగ్‌ శాతంతో మొదటి స్థానంలో నిలువగా.. ఆ తర్వాత నిఖిల్ నిలిచాడు. అనూహ్యంగా విష్ణుప్రియ 3 స్థానంలో నిలిచింది. అలాగే.. ఈసారి ఎవరూ ఊహించని విధంగా మెగా ఛీప్ గా నిలిచింది. ఇక మెహబూబ్-నయని ఓటింగ్‌లో డేంజర్ జోన్‌లోకి నిలిచారు.. అయితే.. చిన్న తేడాతో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటికే ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అవడంతో ఆయన ఎలిమినేషన్ లీకైపోయింది.

నయని పావని గత సీజన్‌లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి కేవలం ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఈ సీజన్‌లో ఆమె రాణిస్తూనే ఉంది. ఎనిమిదో వారం నామినేషన్లో నిలవడంతో బిగ్ బాస్ ప్రేక్షకులు తక్కువ ఓట్లు వేయడంతో ఓటమి అంచున నిలిచారు. అయితే మిస్డ్ కాల్ డేటాలో పావనికి ఎక్కువ రావడంతో ఎలిమినేషన్ నుంచి బయట పడి.. మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారనేది తాజా సమాాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X