Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లొకి ముగ్గురు టాప్ హీరోయిన్లు.. నెవెర్ బిఫోర్ అనేంత సర్‌ప్రైజెస్
ఒక్క మన తెలుగు బుల్లితెర మీద మాత్రమే కాకుండా మొత్తం దేశంలోనే బుల్లితెర దగ్గర మోస్ట్ అటెన్షన్ ఉన్న పాపులర్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. వెస్ట్రన్ దేశాల్లో మొదలైన ఈ రియాలిటీ షో మన దేశంలో కూడా బాగానే పాకేసింది. ఇలా పాన్ ఇండియా భాషల్లో సూపర్ హిట్ అయ్యిన ఈ షో టీవీల నుంచి ఓటిటికి కూడా వచ్చింది. మరి ఇన్ని ఉన్నప్పటికీ ఇండియాలో హైయెస్ట్ రేటింగ్స్ ఇచ్చింది మాత్రం మన తెలుగు ఆడియెన్స్ మాత్రమే..
సినిమాలే కాదు స్మాల్ స్క్రీన్ పై షోల రేటింగ్స్ కి అయినా కూడా మన తెలుగు ఆడియెన్స్ తర్వాతే ఎవరైనా అన్నట్టుగా బిగ్ బాస్ 7 సీజన్లకి మనవాళ్ళు రికార్డు టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చారు. హిందీలో మన కంటే ఎక్కువ సీజన్లు రీచ్ ఉన్నప్పటికీ మన తెలుగులోనే రికార్డు రేటింగ్స్ నమోదు అవుతాయి. అందుకే మన తెలుగులో ఈ షోని ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని చేస్తారు. కాగా గత మూడు సీజన్స్ లో పోయిన క్రేజ్ ని 7వ సీజన్ తీసుకొచ్చింది.

దీనితో 8వ సీజన్ ని మాత్రం చాలా శ్రద్దగా చెక్కుతుంన్నారటచెక్కుతున్నారట. కాగా ఇప్పుడు 8వ సీజన్ కి టైటిల్ నుంచే చాలా సర్ప్రైజ్ లని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట, ఈసారి సీజన్ 8.. దీనిని అడ్డంగా తిప్పితే ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది. దీనితో ఈసారి ఎంటర్టైన్మెంట్స్ ఇన్ఫినిటీ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా రెండు టీం లుగా కనిపిస్తారట.
ఇక్కడ కూడా 8 మంది 8 మంది ఇలా వేరు చేసి కొంతమందిని ఒక చోట కొంతమందిని మరో చోట పెడతారట. ఇలా టైం గడిచే కొద్దీ ఎవరికి నచ్చినవాళ్లు తమ స్నేహితులని వేరైతే కొన్ని టాస్కులు చేసి సక్సెస్ అయితే వేరే టీం దగ్గరకి స్వాప్ అవ్వొచ్చట. అలాగే ఈసారి కొందరు ప్రముఖ నటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నువ్వే కావాలి ఫేమ్ రిచా, అంకితా, పూనమ్ బజ్వా లాంటి హీరోయిన్లు ఈసారి హౌస్ లో కనిపించే ఛాన్స్ ఉందట. అలాగే అప్పటి టైం నటుడే రోహిత్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట.
శంకర్ దాదా ఎంబీబీఎస్, గర్ల్ ఫ్రేం, జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాల్లో నటించిన తాను రాబోతున్నాడట. అలాగే తమిళ హాట్ బ్యూటీ పూనమ్ బాజ్వా కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇలా ఈసారి మాత్రం చాలా తెలిసిన పేర్లు మొహాలనే బిగ్ బాస్ వారు తీసుకు రానున్నట్టుగా తెలుస్తుంది.
కాగా ఈసారి సీజన్ 8 ని అదే టైటిల్ ఫార్మాట్ తో సెప్టెంబర్ 8 నుంచే మొదలు పెట్టనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈసారి కూడా సీజన్ కి హోస్ట్ గా టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునే కొనసాగానున్నట్టుగా రీసెంట్ గా వచ్చిన ప్రోమో అనౌన్సమెంట్ తోనే కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి ఈసారి ఎంటర్టైన్మెంట్, డ్రామా ఏ లెవెల్లో ఉంటుందో అని తెలుగు ఆడియెన్స్ చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











