Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు 8 అఫిషియల్ స్టార్ట్ డేట్ వచ్చేసింది.. గ్రాండ్ ఫినాలే ఎప్పడంటే?

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు. ఇప్పటికే 7 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న షో ప్రతీ సీజన్‌కు భారీగా వ్యూవర్ షిప్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో 8వ సీజన్ బిగ్‌బాస్‌ కోసం ప్రేక్షకులను భారీగా ఎదురు చూసేలా చేస్తున్నది. అయితే తాజాగా బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభం ఎప్పుడు? అనే అధికారికంగా వెల్లడించారు. ఈ సీజన్ స్టార్ట్ డేట్ ఎప్పడంటే?

బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ కావడంతో కొత్తగా కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. అన్ లిమిటెడ్ ఫన్, ఫైట్ అనే కాన్సెప్ట్‌తో ఈ షో రానున్నది. 8 అక్షరం ఎన్ఫినిటీ కావడంతో అపరిమితం అనే విధంగా కాన్పెప్ట్ చేశారు. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. ఈసారి ఫన్, ట్విస్టులు, టర్న్‌లకు లిమిటే లేదు అంటూ హోస్ట్ నాగార్జున అక్కినేని క్లారిటీ ఇచ్చారు.

Bigg Boss Telugu 8 official date confirmed Host Nagarjuna show starts on this date

తాజాగా విడుదల చేసిన బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్ టీజర్‌ విశేషంగా ఆకట్టుకొన్నది. కమెడియన్ సత్యతో చేయించిన స్కిట్.. అమ్మాయిలతో నాగార్జున డ్యాన్స్, స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ప్రైవసీకి కూడా స్కోప్ ఉందనే విషయం స్పష్టమైంది. ఈసారి కొత్తగా రెండు ఇళ్లను నిర్మిస్తున్నారనే విషయం మరింత క్యూరియాసిటీని పెంచేస్తున్నది.

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి రకరకాల ఊహగానాలు కొనసాగుతున్నాయి. అయితే ఎండెమాల్ షైన్ ఇండియా నిర్వాహకులు తమ కంటెస్టెంట్ల జాబితాను చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికప్పుడు కొందరు కంటెస్టెంట్లను మార్చుతూ ట్విస్లు ఇస్తున్నారు. షో ప్రారంభమయ్యే రోజే కంటెస్టెంట్లను పరిచేసేందుకు సీక్రసీని మెయింటెన్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఎంపిక చేసిన కంటెస్టెంట్లను వచ్చేవారం క్వారంటైన్‌కు తరలిస్తారు. సెలబ్రిటీలను కంట్రోల్‌కి తీసుకొని వారి ఆరోగ్య, సంబంధిత వివరాలను పరిశీలిస్తారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఏదైనా సమస్యలు తలెత్తితే వారి స్థానంలో మరొకరిని పంపించేందుకు స్టాండ్ బై కంటెస్టెట్లను పెట్టుకొంటున్నారు. ఈ సారి సుమారుగా 20 మంది కంటెస్టెంట్లు ఉండే అవకాశం ఉందనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు బిగ్‌బాస్ తెలుగు 8 స్టార్ట్ డేట్ గురించి స్టార్ మా అధికారికంగా వెల్లడించింది. ఇప్పటి వరకు స్టెప్టెంబర్ 1 లేదా 6 అనే తేదీలపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. స్టెప్టెంబర్ 1 తేదీన ప్రారంభిస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఇక ముగింపు తేది కూడా డిసెంబర్ 8వ తేదీ అనే విషయంపై క్లారిటీ కూడా వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X