Bigg Boss Telugu 8: ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఆ లవ్ స్టోరీకి బ్రేక్ పడినట్టేనా?

Bigg Boss Telugu 8: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ ఊహించని, దిమ్మతిరిగే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. నెల రోజుల పాటు షో కాస్త నెమ్మదిగా సాగిన షో ను డబుల్​ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డు​ఎంట్రీలతో సీజన్ ను మరోసారి లాంచ్ చేశారు. దీంతో బిగ్ బాస్ షోపై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెరిగిపోయింది. అలాగే.. గత సీజన్లో ఎప్పుడు చూడని కంటెంట్ ఇస్తుండటంతో ఈ షోకు భారీ రెస్పాన్స్‌ వస్తుంది. స్టార్ మా లో హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఇలా రసవత్తరంగా సాగుతోన్న ఈ షోలో ఏడో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది.

తొలివారం ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వెళ్లిపోగా.. రెండో వారంలో శేఖర్ భాషా, మూడోవారం అభియ్ నవీన్, నాలుగోవారం సోనియా ఆకుల హౌస్ నుంచి ఎలిమినేషన్ అయింది. ఇక ఐదోవారం ఎవరూ ఊహించని విధంగా మీడ్ వీక్ ఎలిమినేషన్‌ పెట్టి..హీరో ఆదిత్య ఓంను, ఆ వారం చివరిలో డాన్సింగ్ డాల్ నైనికా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆరోవారం హౌస్ నుంచి కిర్రాక్ సీత ఎలిమినేట్ అయింది. ఏడో వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది? అనేది బిగ్ బాస్ లవర్స్ లో చర్చనీయంగా మారింది .

Bigg Boss Telugu 8 Prithvi will eliminate in the seventh week of Bigg Boss telugu season 8

వాస్తవానికి ఏడో వారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల రచ్చ మామూలుగా జరగలేదు. ఓజీ క్లాన్ సభ్యులు, రాయల్ క్లాన్ సభ్యుల మధ్య నామినేషన్స్​ జరగడంతో .. ఇప్పటివరకూ ఒక్క లెక్క ఇప్పడూ మరో లెక్క​ అన్నట్టు పరిస్థితి నెలకొంది. సోమవారం ఎపిసోడ్ లో గౌతమ్-అవినాష్ మధ్య జరిగిన గొడవ ఓ రేంజ్ లో ఉంటే.. మంగళవారం ఎపిసోడ్‌లో అవినాష్ - పృథ్వీ మధ్య జరిగిన గొడవ మరో లెవల్ ఉంది. మొత్తానికి ఈ వారం తొలి రెండు జరిగిన నామినేషన్లలో ఎవరూ ఊహించని విధంగా తొలిసారిగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. ఇందులో హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠ ఉన్నారు.

ఈ వారం ఎలిమినేట్​ అయ్యేది ఎవరంటే.. ఏడోవారం ఎలిమినేషన్స్ కు మొత్తం తొమ్మిది మంది నామినేషన్‌ అయ్యారు. వీరిలో ఎవరు బయటకు వస్తారు? అనేది బిగ్ బాస్ లవర్స్ అతృతగా ఎదురు చూస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే.. మంగళవారం రాత్రి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై.. శుక్రవారం రాత్రి వరకు జరిగింది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. నిఖిల్​ మొదటి స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానంలో నబీల్, మూడో స్థానంలో మణికంఠ ఉన్నారట. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా.. ప్రేరణ, యష్మీ, గౌతమ్ నిలిచారు. ఇక చివరి మూడు స్థానాల్లో టేస్టీ తేజ, హరితేజ,పృథ్వీ ఉన్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 8 Prithvi will eliminate in the seventh week of Bigg Boss telugu season 8

ఈ లెక్క ప్రకారం చూస్తే.. నిఖిల్​, నబీల్​, మణికంఠ, ప్రేరణ, యష్మీ, గౌతమ్​ ప్రస్తుతానికి సేఫ్​ జోన్​లో ఉన్నారు. ఇక టేస్టీతేజ, పృథ్వీ, హరితేజ డేంజర్​ జోన్​లో ఉన్నారట. అయితే .. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఓటింగ్ లో చివరి స్థానంలో నిలిచిన పృథ్వీ హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. మొదటి నాలుగు వారాలు పృథ్వీ గేమ్ ను చాలా బాగా ఆడారు. తన ఆట తీరును కింగ్ నాగ్ కూడ ప్రశంసించారు. తనపై ఎవరైనా వ్యక్తిగతంగా కామెంట్స్ చేసిన అసలు పట్టించుకోలేదు. గేమ్స్ ల్లో, టాస్కుల్లో 100 ఇచ్చారు. కానీ, గత రెండు వారాలుగా.. పృథ్వీ ఆట తీరులో కాస్తా తేడా వచ్చింది.

నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠతో అనవసరంగా గొడవ క్రియేట్ చేసుకుని కూడా కాస్త నెగిటివ్ తెచ్చుకున్నారు. ఇలా గత రెండు వారాలుగా గేమ్ పై ఫోకస్ చేయకపోవడంతో ఓట్లు తక్కువ స్ధాయిలో పోల్ అయినట్టు తెలుస్తోంది. ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి పృథ్వీ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. అఫిషీయల్‌ తెలియాలంటే.. ఆదివారం వరకూ వేచి ఉండాల్సింది. ఇదిలాఉంటే.. ఈ వార్త వైరల్ కావడంతో యాంకర్ విష్ణు , పృథ్వీ లవ్ కు బేకప్ అయినట్లేనా అంటూ బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X