Bigg Boss Telugu 8: విడిపోయిన బిగ్ బాస్ లవ్ బర్డ్స్.. పృథ్వీకి రెమ్యూనరేషన్ లోనూ అన్యాయమేనా?
బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ రియాల్టీ షో చివరి అంకానికి చేరుకుంది. ఎవరు ఊహించని విధంగా 13వ వారం ఎలిమినేషన్ లో చోటుచేసుకుంది. బిగ్ బాస్ లవర్స్ కు దిమ్మ తిరిగిపోయేలా డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం నాడు టేస్టీ తేజ ఎలిమినేట్ కాగా.. ఆదివారం నాడు ఊహించని విధంగా పృథ్వీరాజ్ శెట్టిని ఎలిమినేట్ చేసి హౌస్ నుండి బయటకు పంపించేశారు. అయితే దాదాపు మూడు నెలల పాటు హౌస్ లో కొనసాగిన పృథ్విరాజ్ శెట్టి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు, అతడు ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణాలేంటి? అనేది చర్చనీయంగా మారింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్ లో ఎవరు ఊహించని ట్విస్టులు, మలుపులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో చూడని కంటెంట్ ఇవ్వడంతో బిగ్ బాస్ లవర్స్ నుండి మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో హైయెస్ట్ టిఆర్పి తో దూసుకు వెళ్తుంది బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. ప్రస్తుత సీజన్ చివరి దశకు చేరుకున్న మరో రెండు వారాలలో పూర్తి కానుంది. ఈ తరుణంలో షోపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా.. బిగ్ బాస్ టీం సరికొత్త కంటెంట్ ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే 13వ వారం డబుల్ ఎలిమినేషన్ చేపట్టారు.

వాస్తవానికి 13వ వారంలో మెగా చీప్ అయిన రోహిణి తప్ప అందరూ నామినేట్ అయ్యారు. శనివారం నాడు టేస్టీ తేజ ఎలిమినేట్ కాగా.. ఆదివారం షోలో వరసగా మిగతా కంటెస్టెంట్లు సేవ్ అవుతూ వచ్చారు. కానీ, చివరిగా ఎలిమినేషన్ ప్రక్రియ పృద్వి వర్సెస్ విష్ణు ప్రియ మధ్యలో జరిగింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. సీజన్ 8లోకి 11 వ కంటెస్టెంట్ గా పృధ్వీరాజ్.. 12వ కంటెస్టెంట్ గా విష్ణు ప్రియ కలిసి బడ్డీగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి రచ్చ చేశారు అందరికీ తెలిసింది. ప్రతి కంటెస్టెంట్ కి వీరి మధ్య ఉన్న రిలేషన్ తెలిసిపోయింది.
వీరి వ్యవహారం చూసిన కింగ్ నాగార్జున నుండి వచ్చిన గెస్టులు, పేరెంట్స్ కూడా వీరిద్దరిని లవర్స్ గా ట్రీట్ చేశారు. సీజన్ 8 లో మొత్తానికి లవ్ బర్డ్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. చివరికి వారిద్దరికి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరగడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎలిమినేషన్ ప్రక్రియలో విష్ణు ప్రియ సేవ్ కాగా పృధ్విరాజ్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ వారం పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ కావడంతో లవ్ బర్డ్స్ విడిపోయినట్లు అయింది. విష్ణు ప్రియ తాను సేవ్ అయ్యానని ఆనందం కంటే.. తన లవర్ పృథ్వి ఎలిమినేట్ అయ్యాడని బాధ పడింది.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 నుండి పృథ్వి తీసుకున్న రెమ్యూనరేషన్ ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ సీజన్ 8 లోకి 11వ కంటెస్టెంట్ గా ఎంట్రీ అయిన పృద్వి దాదాపు 91 రోజులు హౌస్ లో ఉన్నాడు. బిగ్ బాస్ ఇన్పుట్స్ ప్రకారం పృథ్వీరాజ్ వారానికి 1,50,000 రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే.. 13 వారాలకు గాను పృథ్వీరాజ్ శెట్టి 19,50,000 తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే ఇది తక్కువ మొత్తమే అని చెప్పవచ్చు. పృధ్వీరాజ్ ఎలిమినేట్ కావడంతో ప్రేమ పక్షులు విడిపోయారంటూ బిగ్ బాస్ లవర్స్ కామెంట్ చేస్తున్నారు. మరి విష్ణు ప్రియ టాప్ 5 రేసులో ఉంటుందో.. వచ్చేవారం ఎలిమినేట్ అయి బిగ్ బాస్ షో నుంచి నిష్క్రమిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











