Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ల లిస్ట్.. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే?
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్దమవుతున్నది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా పూర్తి అవుతున్నాయి. దాంతో ఈ షోలోకి ఎవరెవరు వస్తున్నారనే విషయంపై రకరకాల ఊహగానాలు, రూమర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఫిలింబీట్‌కు విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం..
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌కు సంబంధించిన టీజర్ ఇటీవల రావడంతోపాటు అందర్నీ ఆకట్టుకొన్నది. అయితే 8 సంఖ్యను డిఫరెంట్‌గా డిజైన్ చేసి ఇన్ఫినిటీ అనే విధంగా పరిచయం చేశారు. దానికి తగినట్టే హోస్ట్ నాగార్జున క్లారిటీగా వచ్చే సీజన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని వెల్లడించారు. మీరు ఎంత కోరుకొంటే అంత.. అన్ లిమిటెడ్ అంటూ నాగార్జున తన మాటల్లో చెప్పారు.

ఇక ఇప్పటి వరకు బిగ్‌బాస్ తెలుగు 8లోకి ఎంపికైనట్టు ప్రచారం జరుగుతున్న కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే..
అంజలి పావని
రీతూ చౌదరీ
నటి సన
మై విలేజ్ షో అనిల్ గిలా,
యాదమ రాజు
బంచిక్ బబ్లూ
కిర్రాక్ ఆర్పీ
యాంకర్ వింధ్య,
గాయత్రి గుప్తా
వేణుస్వామి తదితర పేర్లు ఖారారైనట్టు తెలుస్తున్నది.
ఇంకా షోలోకి కన్ఫార్మ్ కావాల్సిన వారిలో న్యూస్ రీడర్ కల్యాణి,
రేఖా భోజ్,
అర్గానిక్ ఫార్మింగ్ నేత్ర,
మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్ర నీల్
సింగర్ సాకేత్,
బ్రహ్మముడి దీపిక రంగనాథ్,
టెలివిజన్ నటుడు శ్రీకర్
సయ్యద్ అబూ
ఊర్మిల చౌహన్ తదితరుల పేర్లు ఉన్నాయి. ఆగస్టు రెండోవారం కల్లా కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి చేస్తారు.
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ మాత్రం సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభ కాబోతున్నది. ఈ సీజన్ సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్‌గా మొదలవుతుంది. దాదాపు 100 రోజులపాటు నిరాటకంగా కొనసాగుతుంది. ఓటీటీలో పూర్తిగా స్ట్రీమింగ్ చేయడంతోపాటు ప్రతీ రోజు హైలెట్స్ టీవీలో ప్రసారం చేస్తారని తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











