Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లో కొట్లాటలు స్టార్ట్ ..మనిషిలా తినాలంటూ ,వచ్చి రోజు కాలేదు అప్పుడే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు 8 ఈ ఆదివారం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు హౌస్‌లోకి అడుగుపెట్టి సందడి చేశారు. అసలు బిగ్‌బాస్ అంటేనే కొట్లాటలు, వివాదాలు , కాంట్రవర్సీలు కదా. గ్రాండ్ లాంచ్ రోజున షేక్‌హ్యాండ్‌లు ఇచ్చుకుంటూ పలకరించుకున్న కంటెస్టెంట్స్ రోజు తిరిగేసరికి కొట్టుకుంటున్నారు. స్టార్ మా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో హౌస్‌మెట్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ విశేషాలేంటో చూస్తే:
కంటెస్టెంట్స్ మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మధ్య మధ్యలో ఈసారి బిగ్‌బాస్ ఎలా ఉంటుందో , మారిన రూల్స్ ఏంటో వివరించారు నాగార్జున . గడిచిన ఏడు సీజన్లుగా ప్రతివారం పర్పార్మెన్స్‌ను బట్టి ఇంటి సభ్యుల్లో ఒకరు హౌస్‌కి కెప్టెన్ అవుతారు. అయితే ఈసారి మాత్రం కెప్టెన్ కాన్సెప్ట్ ఉండదని నాగార్జున బాంబు పేల్చారు. కెప్టెన్ అయిన వారు ఎలిమినేషన్ నుంచి మినహాయించబడటంతో పాటు వారం పాటు హౌస్‌ను కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది.

ఇక బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ చివరిలో నాగార్జున కంటెస్టెంట్స్‌ని పిలిచి విన్నర్ గెలుచుకుబోయే రెమ్యునరేషన్ చూడండి అని చెబుతాడు. అక్కడున్న కర్టెన్ లాగి చూసిన కంటెస్టెంట్స్ జీరో చూసి షాక్ అయ్యారు. దీని అర్ధం విన్నర్‌కి రూపాయి కూడా ప్రైజ్ మనీ లేకుండా కావడం కాదు. ప్రైజ్ మనీ కూడా లిమిట్ లెస్. కంటెస్టెంట్స్ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తే అంత ప్రైజ్ మనీ ఇస్తారు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే నాటికి ప్రైజ్ మనీ ఎన్ని లక్షలకు చేరుకుంటుందో అది విన్నర్‌కు దక్కుతుందన్న మాట.
బిగ్‌బాస్ మీద అంచనాలు పెంచేందుకు స్టార్ మా ఎప్పటికప్పుడు ప్రోమోలు రిలీజ్ చేస్తుంటుంది. దీనిలో భాగంగా డే 1లో ఏం జరగబోతోంది, కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారో తెలియజేస్తూ ఓ ప్రోమో వదిలారు. ఇందులో మణికంఠ, నిఖిల్‌ల మధ్య ఏదో హాట్ డిస్కషన్ జరిగినట్లుగా చూపించారు. నీ వల్లే ఇష్యూ పెద్దది అవుతుందని మణికంఠ చెబుతుండగా.. నా వల్ల అయితే వదిలేయ్ అని నిఖిల్ అంటాడు. చూస్తుంటే ఎపిసోడ్ ప్రారంభంలోనే ఇద్దరి మధ్యా ఏదో జరిగిందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఈ గ్యాప్‌లోనే ఆర్జే శేఖర్ భాషా, సోనియా ఆకుల మధ్య పెద్ద గొడవ జరిగి.. ఒకొరికకరు పెద్దగా అరచుకుంటున్నట్లుగా చూపించారు. కిచెన్‌లోని ఆరెంజ్ పండ్లను తీసుకుని బాల్ మాదిరిగా క్యాచ్‌లు పట్టుకుంటూ శేఖర్ ఆడుకోవడంపై సోనియా సీరియస్ అవుతుంది. ఆ వెంటనే ఎవరైతే ఆడుతున్నారో వాళ్లెవ్వరూ ఆరెంజెస్ ముట్టుకోవడానికి వీల్లేదని వార్నింగ్ ఇస్తుంది. ఆమె మాటలకు సీరియస్ అయిన శేఖర్ భాషా.. హౌస్‌లో ఉన్నవన్నీ అందరివీ, నీ ఒక్కదానివే కాదంటూ వాదనకు దిగుతాడు.
దానికి సోనియా సైతం ఘాటుగానే.. ఎవరైతే మనుషుల్లా తిందామని అనుకుంటున్నారో, వాళ్లదాంట్లో వాటిని పెట్టోద్దని అంటుంది. అయితే ఆరెంజ్ పళ్లను కోపంగా తింటూ అంటే నేను మనిషిని కాదా అని భాషా మరోసారి సీరియస్ అయ్యాడు. ప్రోమో చివరిలో పట్టుకునే ఉండండి అనే గేమ్‌ని షురూ చేయగా.. కంటెస్టెంట్స్ తాడుపై వేలాడుతూ ఉంటారు. మరి ఫస్ట్ డే ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











