బిగ్‌బాస్ 8 ప్రోమో వచ్చేసిందోచ్ : వరాలిచ్చే కింగ్‌గా నాగ్ , ఒక్కసారి కమిటైతే లిమిటే లేదట
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అసలు వినోదాన్ని అందించే బిగ్‌బాస్ కోసం జనం ఎగ్జయిటింగ్‌తో ఉన్నారు. సరికొత్త టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజ్‌లు, వివాదాలు, విమర్శలు, గొడవలు ఇలా అన్నింటిని మిక్స్ చేసి వదిలితే అదే బిగ్‌బాస్. అందుకే ఈ రియాలిటీ షో కోసం జనం అంతగా వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే ఏడు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్‌బాస్.. త్వరలో 8వ సీజన్‌లోకి ఎంటరవ్వనుంది.
ఎప్పటిలాగే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంటూ చాలా మంది సెలబ్రెటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. విష్ణుప్రియ, రీతూ చౌదరి, అమృత ప్రణయ్, బంచిక్ బబ్లూ, యూట్యూబర్ అనిల్ , యాదమ్మ రాజు, ఖయ్యూమ్ అలీ, సోనియా సింగ్, బర్రెలక్క, కుమారి ఆంటీ, వేణుస్వామి, అంబటి రాయుడు, అబ్బాస్, రాజ్ తరుణ్ ఇలా చాలా మంది కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఉన్నారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. బిగ్‌బాస్ ఈసారి పూర్తిగా మారిపోయిందని, ఇకపై అంత ఈజీ కాదంటూ హాట్ హాట్ గాసిప్స్ హల్‌చల్ చేస్తూ షోపై హైప్‌ను మరింత పెంచుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయ్యిందని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో టాక్ వినిపిస్తోంది. బిగ్‌బాస్ సెట్ కూడా గతానికి భిన్నంగా గ్రాండియర్ లుక్‌లో ఆకట్టుకోనుందని చెబుతున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌కు సంబంధించి ఇప్పటికే లోగోను విడుదల చేయడంతో ప్రోమో ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. జనాన్ని ఎక్కువ వెయిట్ చేయించకుండా స్టార్ మా.. బిగ్‌బాస్ తెలుగు 8 టీజర్‌ను రిలీజ్ చేసింది. ప్రోమో మొదలవ్వగానే.. కమెడియన్ సత్య ఒక దొంగ గెటప్‌లో అరుదైన కళాఖండాలు విక్రయించే షాపులో దొంగతనం చేస్తూ కనిపిస్తాడు. ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి.. సగం ఇంట్లో వాడుకోవచ్చు, మిగిలినవి అమ్మేసుకోవచ్చని వాళ్ల భార్యకు ఫోన్ చేసి చెబుతాడు. ఇంతలో అక్కడున్న ఓ వస్తువు కదులులూ, వింత వింత శబ్ధాలు వినిపిస్తాయి... అంతే చేతిలో ఉన్న ఖడ్గాన్ని కిందపడేసి వెనక్కి తిరిగి చూస్తాడు. అవన్నీ ఓ దీపంలో నుంచి వస్తున్నట్లు గమనించి దానిని ముట్టుకోబోగా.. అందులోంచి పొగ రూపంలో 8వ నెంబర్ బయటకొస్తుంది.
కాసేపటికే ఆ నెంబర్ కాస్తా నాగార్జునగా మారిపోతుంది, మీరెవరు అని సత్య అడగ్గా.. వరాలిచ్చే కింగ్ అంటూ నాగ్ ఆన్సర్ ఇస్తారు. అయితే నన్ను వదిలేయండి.. నేను వెళ్లిపోతాను అంటూ సత్య అక్కడి నుంచి జారుకోవాలని చూస్తాడు. అప్పుడు నాగ్ అతనిని ఆపి.. ఆశలెక్కువ, అవకాశాలు తక్కువ, బయట చూస్తే రేట్లెక్కువ, నాకు ఎవరిస్తారు చెప్పండి అని సత్య అడుగుతాడు. దాంతో నాగ్ ఏం కావాలో కోరుకోమనగా.. ఏం కావాలన్నా ఇస్తారా అని సత్య ప్రశ్నిస్తాడు. దానికి నాగ్.. లిమిట్ లెస్‌గా ఇస్తా అని చెబుతారు. బాబు అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని.. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు అంటూ నాగార్జున కండీషన్ పెడతారు. అక్కడితో టీజర్ ఎండ్ అవుతోంది.
ఈ టీజర్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేసిన నాగ్.. బిగ్‌బాస్ కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ టీజర్, నాగ్ గెటప్ చూస్తే నిర్వాహకులు ఈసారి కొత్తగా ఏదో ప్లాన్ చేసినట్లే కనిపిస్తోంది. ప్రతి సీజన్‌కు బిగ్‌బాస్‌కు ట్యాగ్‌లైన్ ఉంటుంది. ఈసారి ఏంటబ్బా అని ఆలోచిస్తుండగా.. నాగార్జునే క్లూ ఇచ్చినట్లుగా అర్ధమవుతోంది. ఒక్కసారి కమిటైతే లిమిట్ లేదు ' అన్నదే ఈ సీజన్ ట్యాగ్‌లైన్ కావొచ్చు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే కంటెస్టెంట్స్ ఎవరా అన్న సస్పెన్స్‌కు కూడా తెరపడనుంది. మరి అసలైన వినోదం కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











