బిగ్ బాస్ శివంగి ఎలిమినేట్.. రోహిణీ రెమ్యూనరేషన్.. బిగ్ బాస్ చరిత్రలో ఓ రికార్డు..
Rohini Remuneration: బిగ్ బాస్.. బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న రియాల్టీ షో. గతంలో ఎప్పుడు చూడని కంటెంట్ ఇవ్వడంతో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ సీజన్లో ఎవరు ఊహించని ట్విస్టులు, మలుపులు చోటు చేసుకోవడంతో షోపై క్యూరియసిటీ పెరిగింది. మరో వారం రోజుల్లో ఈ సీజన్ ముగియనున్నడంతో టైటిట్ ఎవరు గెలుచుకుంటారనే చర్చ జరుగుతోంది. అయితే.. టాప్ 5 కంటెస్టెంట్ల్ ఉంటుందని భావించిన బిగ్ బాస్ శివంగి రోహిణి సడెన్ గా ఎలిమినేట్ అయింది. రోహిణి ఎలిమినేషన్ కారణాలేంటీ? ఇంతకీ బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు రోహిణి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నదనేది ? చర్చనీయంగా మారింది.
బిగ్ బాస్ సీజన్ 8 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకూ బీబీ బాస్ లవర్స్ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ అందిస్తూ సక్సెస్ పుల్ గా సాగుతోన్న ఈ షోలో 14 వ వారం ఎవరు ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. టాప్ 5 లో నిలుస్తుందని భావించిన స్టాంగ్ కంటెస్టెంట్ రోహిణి ఎలిమినేట్ అయ్యింది. వాస్తవానికి 14వ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించారు.ఒకర్ని ఎలిమినేట్ చేసి.. బిగ్ బాస్ తెలుగు 8 ఫినాలే వీక్‌కు టాప్ 6 కంటెస్టెంట్స్‌ను పంపిస్తారని అనుకున్నారు. బిగ్ బాస్ 7 సీజన్‌లో గ్రాండ్ ఫినాలేకు టాప్ 6 ని పంపించారు. ఈ సీజన్‌లో కూడా అలాగే ఉంటుందనుకున్నారు.

కానీ, అంచనాలు పూర్తిగా తారుమారు అయ్యాయి. ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారు. ఈ వారం ముక్కు అవినాష్ మినహా మిగతా ఆరుగురు కంటెస్టెంట్స్ గౌతమ్, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, ప్రేరణ, రోహిణి నామినేషన్స్‌లో ఉన్నారు. బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం చూస్తే.. డేంజర్ జోన్‌లో రోహిణి, విష్ణుప్రియలు ఉన్నారు. ఈ క్రమంలో మొదటి ఎలిమినేషన్‌గా రోహిణి ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి అవుట్ అయింది. ఇక బాటమ్ 2లో ఉన్న విష్ణుప్రియ ఈ రోజు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ, ప్రోమోల ప్రకారం.. నబీల్, ప్రేరణ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరికి ఎలిమినేషన్ తప్పదు.
ఇదెలా ఉంటే.. బిగ్ బాస్ చరిత్రలో రోహిణి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ షోలో ఎంతోమంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. ఈ షోలో లేడీ కంటెస్టెంట్లు ఇలా ఫైనల్ రేసు వరకు రావడం అరుదు. కానీ.. ఇకపై ఎవరైనా లేడీ కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెడితే.. రోహిణిలా ఆడాలని, ఆమెలా ఓ హిస్టరీ క్రియేట్ భావిస్తారు. నిజంగా రోహిణి ఆడిన తీరు సూపర్.. అద్భుతం.. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన రోహిణి చూసి..హేళన చేశారు. ఆమె ఏం ఆడుతుందంటూ జీరోని చేశారు. కామెడీ తప్ప.. ఆమెకు ఏం చేయడం రాదంటూ.. చులకనగా మాట్లాడారు. కానీ, అలా మాట్లాడిన వారి నోళ్లు మూయించింది. చివరికి వారితోనే సలామ్ కొట్టేట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది రోహిణి. బిగ్ బాస్ టైటిల్ గెలువకపోయినా.. బిగ్ బాస్ లవర్స్ ప్రేమను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఏ కంటెస్టెంట్ కు లభించని ఫేమ్ రోహిణికి దక్కిందనే చెప్పాలి.
మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో రోహిణి ఎంత రెమ్యూనరేషన్ సంపాదించిందనే చర్చ మొదలైంది. బిగ్ బాస్ టైటిల్ గెలువకపోయినా..విన్నర్‌లా బయటకు వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే.. అది ది గ్రేట్ లేడీ సింగం రోహిణి నే. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన శివంగి రోహిణి 14వ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా రోహిణి ఎలిమినేట్ అయ్యింది. ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన రోహిణి వారానికి రూ.4లక్షలు రెమ్యూనరేషన్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే.. మొత్తం 8 వారాలకు రూ.32 లక్షలు దక్కించుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











