Bigg Boss Telugu 8: తారుమరైన బిగ్ బాస్ 8 కంటిస్టెంట్స్ లిస్ట్..! వీరికి మాత్రం ఆఫిషియల్ మెయిల్స్!

Bigg Boss Telugu Season 8: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో కు తెలుగులో కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటివరకు తెలుగులో విజయవంతంగా 7 సీజన్స్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. గత సీజన్ 7 లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. సీరియల్ యాక్టర్ అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. ఇప్పుడు ఈ క్రేజీ షో 8వ సీజన్ కోసం సిద్దమవుతుంది. అతి త్వరలో ఈ షో బుల్లితెర ప్రేక్షకులకు పుల్ మీల్స్ లాంటి ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి ముందుకు రాబోతుంది.

ఈ తరుణంలో రిలీజ్ అయిన బిగ్ బాగ్ 8 ప్రోమో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. హోస్ట్ కింగ్ నాగార్జున నయా లూక్ లో అదరగొట్టాడు. ఈ సారి టన్నుల కొద్దీ ఎంటర్టెన్మెంట్ ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు చెప్పేశాడు. వరుసగా అన్ని సీజన్లు సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో ఈ సీజన్ కూడా అంతకుమించి అనేలా ఉండబోతుందనే ఓ క్లారిటీ వచ్చేసింది.

Bigg Boss Telugu 8 rumoured Contestants list Ritu Chaudhary Anjali Pavani Tejaswini Gowda and Banchik Bablu

ఇంతకీ ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఆఫీసియల్ గా కంటిస్టెంట్స్ లిస్ట్ రాకున్నా.. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. కానీ కొందరూ మాత్రం.. ఈ కంటిస్టెంట్స్ పక్కగా షోలో ఉన్నారంటూ బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. వారికి ఆఫిషియల్ గా మెయిల్స్ కూడా వచ్చాయంటూ జనాల్లో ఉన్న క్యూరియాసిటీని మరింత రెట్టింపు చేస్తున్నారు. నెట్టింట్లో హల్ చల్ చేస్తూ ఆ కంటిస్టెంట్స్ ఎవరో మనం కూడా ఓ లూక్కేద్దామా?

Bigg Boss Telugu 8 rumoured Contestants list Ritu Chaudhary Anjali Pavani Tejaswini Gowda and Banchik Bablu

ప్రోమో ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 8 లోనూ కింగ్ నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నట్లు ఓ క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ లవర్స్ కు పుల్ టైం ఎంటర్టైన్ మెంట్ ఇవ్వడంతో ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా.. అందుకు తగ్గట్టుగా కంటిస్టెంట్స్ సెలక్షన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారట. అంతేకాకుండా ఈ సారి బిగ్ బాస్ షో వెరీ వెరీ స్పెషల్ గా ఉండేలా నిర్వహకులు పెద్ద పెద్ద స్కెచ్ లే రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక కంటిస్టెంట్స్ విషయానికి వస్తే.. రీతూ చౌదరి, అంజలి పావని, తేజశ్వని గౌడ, బంచిక్ బబ్లు లకు ఫ్లేస్ కన్పామ్ అయినట్టు తెలుస్తోంది. ఈ కంటిస్టెంట్స్ పక్కగా షోలో ఉన్నారంటూ, వారికి ఆఫిషియల్ గా మెయిల్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.

అలాగే.. నటి సన, మై విలేజ్ షో అనిల్, యాదమరాజు, బర్రెలక్క (సిరి), యాంకర్ వింధ్య, కిర్రాక్ ఆర్పీ, గాయత్రి గుప్తా, కుమారి ఆంటీ, ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర, సీరియల్ నటుడు ఇంద్రనీల్, హీరో అబ్బాస్, రోహిత్, సింగర్ సాకేత్, ఊర్మిళ చౌహాన్ వంటి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైతే అధికారికంగా లిస్ట్ బయటకు రాలేదు. కానీ వీరు కంటెస్టెంట్ చేయడానికి ఛాన్స్ ఉందనే సమాచారం జరుగుతోంది.

Bigg Boss Telugu 8 rumoured Contestants list Ritu Chaudhary Anjali Pavani Tejaswini Gowda and Banchik Bablu

బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభానికి ముందు.. భారీ భారీ సర్పైజ్ లను ప్లాన్ చేస్తున్నట్టు ప్రోమోలో చెప్పేసింది బిగ్ బాస్ టీం. అలాగే.. గతంలో కంటే ఈ సారి కంటెస్టెస్టులకు భారీ మొత్తం రెమ్యూరేషన్లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఈ సారి రెండు బిగ్ బాస్ హౌస్ లు ఉన్నాయనే టాక్ కూడా వస్తుంది. కానీ, ప్రోమోలో మాత్రం అలాంటి హిట్స్ మాత్రం ఏమి కనిపించలేదు. ఏదిఏమైనా గత సీజన్ల కంటే.. రెట్టింపు ఆసక్తి రేకెత్తించే గేమ్స్ తో.. షో మొదటి వారం నుంచే భారీ బజ్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుందట. చూడాలి మరీ గేమ్ ఎలా ఉంటుందో..

More from Filmibeat

Read more about: bigg boss telugu 8
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X