Bigg Boss Nominations: తొలి వారం నామినేషన్స్ లిస్ట్ లీక్.. ఆ ఇద్దరు అలా సేఫ్.. మరి ఎవరు బలి అయ్యారంటే!
ఎన్నో ఊహాగానాలు, అనుమానాల మధ్యన తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. ఊహకే అందని విధంగా ఆడియెన్స్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక షోనే బిగ్ బాస్. పాశ్చాత్య సంస్కృతిని తలపించే కంటెంట్‌తో నడిచే ఇది.. భారీ రేటింగ్‌తో దేశంలోనే టాప్ షో అనిపించుకుంది. ఫలితంగా వరుసగా సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ నిర్వహకులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారమే ఎనిమిదో సీజన్‌ను కూడా మొదలు పెట్టారు. ఇందులో ఫస్ట్ వీక్ నామినేషన్స్ లిస్ట్ తాజాగా బయటకు వచ్చేసింది. ఇందులో ఎవరున్నారో మీరే చూడండి మరి!
అంతా కొత్తగానే.. ట్విస్టులు
బిగ్ బాస్ షో తెలుగులో క్రమం తప్పుకుండా ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో దాన్ని గతంలో ఎన్నడూ చూడని విధంగా అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఫలితంగా ఈ సీజన్ ఎంతో ఆసక్తికరంగా ప్రారంభం అయింది. అందుకు అనుగుణంగానే ఆరంభంలోనే ట్విస్టులు కూడా ఇస్తున్నారు.

అలా 14 మంది వచ్చారుగా
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో పెద్దగా పేరున్న వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు.
నామినేషన్స్‌పై స్పెషల్‌గా
బిగ్ బాస్ షోలో ప్రతి సోమవారం జరిగే ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్కును చూపిస్తారు. షో మొత్తానికి ఊపిరిని పోసే కంటెంట్ ఇందులోనే దొరుకుతుంది. కాబట్టి దీనిపై నిర్వహకులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఎనిమిదో సీజన్ మొదటి వారంలో సోమవారం ఎపిసోడ్‌లో ప్రసారం చేయలేదు. కానీ, మంగళవారం చూపించబోతున్నట్లు ప్రోమో వదిలారు.
ప్రాసెస్ ఇదే.. గొడవలతో
సాధారణంగానే నామినేషన్స్ టాస్కులో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే మొదటి వారంలో కంటెస్టెంట్లు ఇద్దరిని నామినేట్ చేయగా.. చీఫ్‌లు ముగ్గురిలో ఒకరు.. ఆ ఇద్దరిలో ఒకరిని కాపాడి, మరొకరిని నామినేట్ చేసే ప్రాసెస్ ఇచ్చారు. ఇందులో ప్రేరణ, సోనియా.. మణికంఠ, శేఖర్ బాషా గొడవలు పెట్టుకున్నారు. ఇదంతా తాజా ప్రోమోలో చూపించారు.
మొత్తం 6గురు నామినేట్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోని మొదటి వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో 14 మంది కంటెస్టెంట్లలో ఆరుగురు నామినేట్ అయ్యారు. అందులో బెజవాడ బేబక్క, విష్ణుప్రియ భీమనేని, నాగ మణికంఠ, సోనియా, శేఖర్ బాషా, పృథ్వీరాజ్‌లు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.
వాళ్లిద్దరూ అలా సేఫ్‌గా
ఎన్నో గొడవలతో ఎంతో ఆసక్తికరంగా సాగిన మొదటి వారం నామినేషన్స్‌లో కొన్ని ట్విస్టులు కూడా పెట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా ఒక్కో ఓటు పడిన వాళ్లను బిగ్ బాస్ సేఫ్ చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. అలా ప్రేరణ, కిర్రాక్ సీతలు ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారట. అందరి కంటే ఎక్కువగా నాగ మణికంఠకు ఓట్లు పడినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











