Bigg Boss 8 Telugu: అతడికి అక్కడ కూడా నిరాశే.. మణికంఠ రెమ్యునరేషన్ ఎంతంటే?
Bigg Boss Telugu 8: రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరూ ఊహించని ఘటనలు, దిమ్మతిరిగే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. గత సీజన్ ల్లో లేని విధంగా ఈ సీజన్ లో డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి తీసుకరావడం, సడెన్ గా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయడం, తాజాగా సెల్ప్ ఎలిమినేషన్ కు అవకాశమివ్వడం. ఇలా ఎన్నో షాకింగ్ విషయాలు బిగ్ బాస్ లో చోటుచేసుకుంటున్నాయి.ఇలా రసవత్తరంగా సాగుతూన్న ఈ షోలో ఏడో వారం ఎవరూ ఊహించని విధంగా నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు. ఇంతకీ నాగమణికంఠ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు?
బిగ్‌బాస్ సీజన్ 8లో ఏడోవారం నామినేషన్లలో గౌతమ్, పృథ్వీ, నిఖిల్, యష్మీ, తేజ, మణికంఠ, నబిల్, హరితేజ, ప్రేరణ ఉన్నారు. ఈ సీజన్ లో మొదటి సారి 9 మంది కంటెస్టెంట్స్ ఉండటంతో ఈ సారి ఎవరు ఎలిమినేటర్ అవుతారని బిగ్ బాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేశారు. అలాగే ప్రతివారం లాగానే ఈ వారం కూడా ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న పర్సన్ వెళ్లిపోతున్నారని అందరూ భావించారు. ఓటింగ్ పరంగా చూస్తే.. పృథ్వీ గానీ, డాక్టర్ గౌతమ్ గానీ ఎలిమినేట్ అవుతాడని చాలా మంది భావించారు. ఒకనొక సందర్భంలో పృథ్వీ ఎలిమినేట్ అవుతాడనే ప్రచారం కూడా జరిగింది.

కానీ.. ఎవరూ ఊహించని విధంగా తనని తాను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు నాగమణికంఠ. ఈ నిర్ణయం బిగ్ బాస్ కే కాదు.. బీబీ ఫ్యాన్స్ కూడా ఊహించని షాక్. ఓటింగ్ పరంగా మణికంఠ స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అతనికి బీబీ లవర్స్ కూడా చాలా సపోర్టుగా నిలిచారు. ఎంతలా అంటే.. హౌస్ మొత్తం అతడి పంపించాలని ఈ ఏడు వారాల్లో మణికంఠ ఏకంగా ఆరు సార్లు నామినేట్ చేశారు. కానీ, మణికంఠ గేమ్ నచ్చిన ప్రేక్షకులు.. నామినేషన్స్ ఉన్న ప్రతిసారి ఓ రేంజ్ లో ఓట్లు గుద్దేశారు. కొన్నిసార్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా.. వీడికి ఓట్లు ఎలా పడుతున్నాయి రా.. ఇంకో సారి వీడిన్ని నామినేట్ చేయొద్దురా.. అనే విధంగా తన సత్తాచాడు మణికంఠ.
బిగ్ బాస్ సీజన్ రీ లాంచ్ వరకు స్ట్రాంగ్ గా ఉన్న మణికంఠ బయటకు వెళ్తానని మొండికేశాడు. తనుకు ఏమైనా జరిగితే..తన ఫ్యామిలీకి కష్టమనీ, తాను ఆడలేనని చెప్పడం. ఈ వారం ఎలిమినేట్ అయిపోయినా ఫర్లేదు అంటూ ఫిజికల్ ట్కాసులకు దూరంగా ఉన్నారు. ఇతర కంటెసెంట్లతో కూడా తనకు హౌస్ నుంచి వెళ్లిపోవాల్సి వస్తోంది చెప్పడం. తాను వీక్ గా ఉన్నాననీ, మైండ్, హార్ట్ ఏం బాలేదు అంటూ ఇతర కంటెస్టెంట్లకు చెప్పడం . అలాగే.. షూటింగ్ సయమంలో కూడా తనకు తానుగా వెళ్లిపోతానని నాగార్జునకు రిక్వెస్ట్ చేసుకున్నారు.
ఓటింగ్ ప్రకారం ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ మణికంఠ తన సొంత నిర్ణయంతో ఆటను మధ్యలోనే వదిలి బయటకు వచ్చేశాడు. ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చినా మణికంఠ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవ్వరికీ తెలియదనీ, ఆడియెన్స్ సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చాను. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే తాను బయటకు వెళ్తునని చెప్పారు. తనకు సపోర్టుగా నిలిచిన ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు మణికంఠ.
గతంలో.. నోయెల్ సీన్, గంగవ్వ, నూతన్ నాయుడు, జెస్సీ కూడా ఆరోగ్య కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుత సీజన్‌లో శేఖర్ బాషా కూడా తన ఆరోగ్యం సరిగా లేదనీ,తనని బయటకు పంపించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. పలుమార్లు ఇతర హౌస్‌మేట్స్‌తో తన బాధ వ్యక్తం చేశాడు. మొత్తానికి రెండో వారమే శేఖర్ బాషా బయటకు వచ్చేశారు. ఆయన బయటకు వచ్చిన తరువాత హౌస్ లో ఆకలితో అలమటిస్తూ.. అసౌకర్యంగా ఉన్నాననీ, తానే బిగ్ బాస్ టీంకు రిక్వెస్ట్ చేసుకున్నానని తెలిపాడు. తాజా మణికంఠ కూడా ఇలా బయటకు వచ్చేశాడు.
మణికంఠ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. మణికంఠ టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తూ.. మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అతను తన వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో బిగ్ బాస్ తెలుగు 8 హౌస్‌లో పాల్గొనే అవకాశాన్ని పొందాడు. ఇలా సీరియల్స్ ఫేమ్ తో బిగ్ బాస్ లో అడుగుపెట్టిన మణికంఠ ఏడూ వారాలు ఉన్నందుకు ఎంత సంపాదించాడో అన్నది ఆసక్తిగా మారింది . మణికంఠ బిగ్ బాస్ లోకి రావడానికి వారానికి రూ.1.20 లక్షలు పారిదోషికం అందజేసినట్టు తెలుస్తోంది. అంటే. ఏడు వారాలకు గానూ దాదాపు రూ. 8.4 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.
ఏదిఏమైనా మణికంఠ బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు రావడం తన ఫ్యాన్ కు షాక్ అనే చెప్పాలి. మణికంఠ హౌస్ లో ఉన్నని రోజులు సింపతీతో ఓట్లు పొందడానే ఓ టాక్ వచ్చింది. కానీ, తాను ఉన్నని రోజులు ఎంటర్టైన్ ఇచ్చారు. చివరికి మణికంఠకు అందించే రెమ్యునరేషన్ విషయంలో కూడా అన్యాయం జరిగిందని ఫ్యాన్ ఫీలవుతున్నారు.


Click it and Unblock the Notifications











